BigTV English

Ind VS Pak War: పాక్‌ను ఒంటరి చేసేలా.. భారత్ పక్కా ప్లాన్

Ind VS Pak War: పాక్‌ను ఒంటరి చేసేలా.. భారత్ పక్కా ప్లాన్

Ind VS Pak War: దేశంలో ప్రస్తుతం ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఉగ్రవాదంపై పాక్ పాత్రను ప్రపంచదేశాలకు చెప్పేందుకు ఏడుగురు అఖిలపక్ష బృందాన్ని మోడీ ఎంపిక చేయడం వెనుక స్ట్రాటజీ గురించి హాట్ డిబేట్ నడుస్తోంది. కాంగ్రెస్ పేరు ఇవ్వని శశిథరూర్ ను ఎంపిక చేయడం కీలకంగా మారింది. ఇది విస్తృత చర్చకు దారి తీసింది. మోడీ మాస్టర్ స్ట్రోక్ లో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నది అర్థం చేసుకోవచ్చు. ఒకటి అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఏకాకి చేయడం, రెండోది ప్రతిపక్ష కాంగ్రెస్ కు చెక్ పెట్టడం. మరి ఏం జరగబోతోంది?


పాకిస్తాన్ పాపాలు బయటకు ఎలా తెలియాలి? ఎలా చెప్పాలి?

పాకిస్తాన్ పాపాలు బయటకు ఎలా తెలియాలి? ఎలా చెప్పాలి? వారి తీరును ఎలా ఎండగట్టాలి.. పాక్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదం ఎలాంటి నష్టాలు కలిగిస్తోంది.. ఆపరేషన్ సిందూర్ జరిగిన తీరు ఇలాంటి విషయాలను ప్రపంచదేశాలకు వివరించబోతోంది భారత్. అంతే కాదు.. మనం కేవలం పాక్ ఉగ్రస్థావరాలు, అలాగే వారి ఎయిర్ బేస్ లపై దాడి చేస్తే.. పాక్ మాత్రం భారత్ లోని సామాన్య జనాన్ని టార్గెట్ చేసుకుంది. ఈ విషయాలను కూడా ఆధారాలతో సహా వివిధ దేశాలకు భారత్ వివరించబోతోంది.


ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందాలు

ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు చుక్కలు చూపిన భారత్.. ఇకపై దౌత్యపరంగా కూడా పాక్ కు పెద్ద షాకే ఇవ్వబోతోంది. అసలు పాకిస్తాన్ ఎలాంటి దేశం.. వారు చెప్పే మాటలకు, చేతలకు అసలు సంబంధం ఉందా అన్న విషయాలను ప్రపంచదేశాల దృష్టికి తీసుకెళ్లబోతోంది. ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందాలు మే 23 నుంచి 10 రోజుల వాషింగ్టన్, లండన్, అబుదాబి, ప్రిటోరియా, టోక్యో వంటి కీలక రాజధానులను కవర్ చేస్తుంది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదన్న సందేశాన్ని ఇవ్వబోతున్నారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులతోనూ భేటీ

కేంద్రం ఎంపిక చేసిన ప్రతినిధి బృందాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులతోనూ భేటీ జరుపుతారు. ఈ ప్రతినిధులు భారత్ జాతీయ ఏకాభిప్రాయాన్ని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కచ్చితమైన విధానాన్ని తెలియజేస్తారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేదే లేదన్న సందేశాన్ని తీసుకెళ్లనున్నారు. సో మోడీ తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం ఖాయమే. ప్రతినిధుల బృందం ప్రపంచదేశాలకు వెళ్లడం ద్వారా భారత్ తన వైఖరిని అంతర్జాతీయ సమాజం ముందు స్పష్టంగా చెబుతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న విషయాన్ని ఆధారాలతో వివరించడం వల్ల యునైటెడ్ నేషన్స్ వంటి వేదికలపై భారత్‌కు సపోర్ట్ పెరిగేలా చూసుకుంటుంది.

పాకిస్తాన్ మారుతుందా మారదా అన్న విషయాలను పక్కన పెడితే..

పాకిస్తాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అఖిలపక్ష బృందం వివిధ దేశాలకు వెళ్లి ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఇస్తున్న సపోర్ట్ ను బహిర్గతం చేయడం వల్ల ఆ దేశంపై దౌత్యపరంగా ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పాకిస్తాన్ మారుతుందా మారదా అన్న విషయాలను పక్కన పెడితే.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో పాకిస్తాన్ కు ఇబ్బందికర పరిస్థితి తీసుకురావచ్చు. నిధులు, రుణాల లభ్యతను చాలా వరకు తగ్గించవచ్చు.

అఖిలపక్ష బృందంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు

అఖిలపక్ష బృందంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉండటం వల్ల ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఐక్యత, ఇక్కడి ప్రజాస్వామ్యం విషయాన్ని అంతర్జాతీయంగా బలంగా కనిపించేలా చేయబోతోంది. ఇది భారత్ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది. భారత్ ప్రతినిధులు ఇచ్చే ఆధారాలతో లష్కరే తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఇచ్చే సపోర్ట్ ను బహిర్గతం చేయడం వల్ల ఈ సంస్థలపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించే ఛాన్సెస్ పెరుగుతాయి.

భవిష్యత్ లో పాకిస్తాన్ పై పూర్తిస్థాయి యుద్ధం చేసే పరిస్థితి

అఖిలపక్ష బృందం ప్రపంచ రాజధానులలో చర్చలు జరపడం వల్ల భారత్‌తో ఇతర దేశాల భద్రతా సహకారం పెరుగుతుంది. ఇది డిఫెన్స్ డీల్స్ ను మరింత పెంచుతుంది. ఉగ్రవాద నిరోధక చర్యలలో సమాచార భాగస్వామ్యం, సైనిక సహకారం వంటివి పెరగబోతున్నాయి. ఇక్కడే మనకు మోడీ మాస్టర్ స్ట్రాటజీ అర్థమవుతుంది. అంటే భవిష్యత్ లో పాకిస్తాన్ పై పూర్తిస్థాయి యుద్ధం చేసే పరిస్థితి వస్తే ఏ దేశం కూడా అడ్డు చెప్పకుండా స్కెచ్ రెడీ చేసి పెడుతున్నారు. పాకిస్తాన్ కు కావాల్సిందే అని ప్రపంచదేశాలు మాట్లాడేలా చూస్తున్నారు. అప్పుడు చర్చలు అంటూ ఏ దేశం కూడా చెప్పే పరిస్థితి లేకుండా చేస్తున్నారు.

కశ్మీర్ విషయంలో భారత్ వైఖరిని బలోపేతం చేయడం లక్ష్యం

పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ ఇస్తున్నట్లు ఆధారాలతో వెల్లడించడం వల్ల ఆ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ఇది ఆర్థిక ఆంక్షలు, చైనా, టర్కీ వంటి దేశాలను మినహాయిస్తే.. దౌత్యపరంగా ఒంటరి అయ్యేందుకు ఛాన్సెస్ పెరుగుతాయి. వీటితో పాటే.. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరిని బలోపేతం చేయడం లక్ష్యం. కశ్మీర్‌లో శాంతి, ప్రజాస్వామ్యం బలంగా ఉన్నాయని, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల వల్ల ఈ ప్రాంతంలో అశాంతి నెలకొంటోందని ఎక్స్ పోజ్ చేసే ఛాన్స్ ఉంది.

భవిష్యత్ లో ఉగ్రదాడులకు భారత్‌ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పడం

ఈ దౌత్య చర్యలు పాకిస్తాన్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌లను బలవంతంగా ధ్వంసం చేసేందుకు దారి తీస్తాయి. దీనివల్ల దక్షిణాసియాలో దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వం సాధ్యమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టడానికి పాక్‌ రెచ్చగొట్టే చర్యలు ఎలా కారణమయ్యాయో చెప్పడం, భవిష్యత్ లో ఉగ్రదాడులకు భారత్‌ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పడం, పాకిస్తాన్ పౌరులకు హాని చేయకుండా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయాన్ని ప్రస్తావించడం, కీలకంగా మారబోతున్నాయి.

ఆపరేషన్ సిందూర్ 2.0 రెడీ

మరోవైపు పాకిస్తాన్ ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు సిందూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది భారత్. అంతే కాదు పాకిస్తాన్ తో అన్ని రకాల వాణిజ్యాలను క్లోజ్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ శాంతి చర్చలు అంటూ కాళ్లబేరానికి వస్తున్నా ఇప్పుడే మోడీ స్ట్రాటజీ మరో లెవెల్ లో ఉండబోతోందంటున్నారు. మొత్తంగా ఈ చర్య భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు, దౌత్యపరమైన బలం, ఉగ్రవాద నిరోధక కెపాసిటీని పెంచడమే కాకుండా, పాకిస్తాన్‌ బాధ్యతగా ఉండేలా ఒత్తిడి తేవడం లక్ష్యంగా ఉన్నాయి. మారితే సరే. లేకపోతే ఆపరేషన్ సిందూర్ 2.0 రెడీగా ఉంది. దాన్ని తట్టుకోవడం ఇక పాకిస్తాన్ తో కాదు. చేతులెత్తేయాల్సిందే.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×