Kayadu Lohar: కాయాదు లోహర్ (Kayadu Lohar) .. ఒక్క సినిమాతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కోలీవుడ్ హీరో కం డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా ‘డ్రాగన్’ సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. అందానికి తగ్గ అందం, ఆ అందానికి తగ్గట్టు క్యారెక్టర్.. ఈమె స్థాయిని మరో లెవెల్ కి పెంచాయి. వాస్తవానికి నాలుగేళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. అరడజనుకు పైగా సినిమాలలో నటించింది. కానీ రీసెంట్గా వచ్చిన ‘డ్రాగన్’ సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అంతేకాదు ఈమె గ్లామర్ కి యువత ఈమెపై ప్రత్యేకమైన క్రష్ ను పెంచుకున్నారు. అందుకే కుర్రాళ్ల క్రష్ గా మారిపోయిన ఈమెకు ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్ భాషల్లో కూడా వరుస అవకాశాలు లభిస్తున్నాయి.
కాయాదు లోహార్ పై కేస్ ఫైల్..నిజమేనా..?
అందులో భాగంగానే ఇప్పటికే తమిళంలో యంగ్ హీరోలు అయిన జీవి ప్రకాష్ (GV Prakash), అధర్వ (Adharva) సినిమాలతో పాటు శింబుతో ఒక సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. అలా ఒక సినిమా ఇచ్చిన అదృష్టంతో రెండు నెలల్లోనే గత నాలుగేళ్లలో చేసిన సినిమాలు సంఖ్యను కూడా బీట్ చేసిందని చెప్పవచ్చు. ఇక ఇలా వరుస సినిమాలతో బిజీగా మారిన ఈమెకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమెపై కేసు ఫైల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే టాస్మాక్ స్కామ్ వ్యక్తులతో ఈమెకు సంబంధాలు ఉన్నాయని, ముఖ్యంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందని, వీరిపై ఈడీ దాడి చేసిన సమయంలో ఈ నిజం వెలుగులోకి వచ్చింది అంటూ ఒక వార్త కలకలం సృష్టిస్తోంది. అంతేకాదు ఈ వ్యక్తులు నిర్వహించిన నైట్ పార్టీలకు ఈమె ఎక్కువగా హాజరవుతూ ఉంటుందట. పైగా అలా హాజరవ్వడానికి ఒక్కో పార్టీకి సుమారుగా రూ.35 నుండి రూ.40 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ కాయాదు లోహర్ కి సంబంధించిన ఈ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కసారిగా సంచలనం రేపుతోంది. ఇది చూసిన కొంతమంది నెటిజన్స్ తమిళ పరిశ్రమ కూడా నెమ్మదిగా అవినీతికి పాల్పడుతోందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక దీనిపై పూర్తి నిజా నిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాయాదు లోహర్ సినిమాలు..
ఈమె సినిమాల విషయానికొస్తే.. ఏప్రిల్ 11 2000 సంవత్సరంలో పుట్టిన ఈమె 2001లో వచ్చిన కన్నడ చిత్రం మొగిల్ పేట తో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక అంతేకాదు 2023లో వచ్చిన మలయాళ చిత్రం పాతోన్ పథం లో కూడా నటించింది. దీనిని తెలుగులో పులి: ది 19త్ సెంచరీ అనే పేరుతో రిలీజ్ చేశారు. అల్లూరి, ఐ ప్రేమ్ యూ , 1 2 రాగ్ వంటి చిత్రాలలో నటించింది. అలా తెలుగు, మరాఠీ, తమిళ చిత్రాలలో నటించిన ఈమె నాని (Nani ) ది ప్యారడైజ్ తో పాటు విశ్వక్ సేన్ – అనుదీప్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా అవకాశం అందుకున్నట్లు సమాచారం.
ALSO READ:Kollywood: నటుడు సూరి తమ్ముడిపై కలెక్టర్ కి కంప్లైంట్.. కమెడియన్ రియాక్షన్..!