BigTV English

Loksabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు.. సౌత్ లో సత్తా చాటేదెవరు..?

Loksabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు.. సౌత్ లో సత్తా చాటేదెవరు..?
Lok Sabha Polls
Lok Sabha Polls

South Lok Sabha Elections 2024 : సౌత్‌ ఇండియాలో జెండా పాతేసేందుకు బీజేపీ తహతహలాడుతోంది. మరి కమలనాథులు ఆశలు నెరవేరే చాన్స్‌ ఉందా? కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సారి మళ్లీ ప్రాంతీయ పార్టీల హావానే కొనసాగుతుందా? ఇంతకీ సౌత్ స్టేట్స్ మూడేంటి? ఈ రాష్ట్రాల్లో సత్తా చాటేదేవరు?


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ.. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే నార్త్‌లో మొత్తం మోడీ మ్యానియా నడుస్తోంది. కానీ సౌతిండియా మూడ్ మాత్రం కాస్త డిఫరెంట్‌. అందుకే బీజేపీ సౌత్‌పై ఫుల్ ఫోకస్ చేసింది. ప్రాజెక్టులను ప్రకటిస్తోంది.. ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మరి ఇవి ఫలిస్తున్నాయా? ఈసారి బీజేపీ సత్తా చాటుతుందా? అంటే.. ఫుల్ డిజాస్టర్ అని చెప్పలేము. ఎట్ ది సేమ్ టైమ్.. ఎక్సాట్రార్డినరీ అనలేం. ఎందుకంటే… సౌతిండియాలో ఉన్న మొత్తం 131 సీట్లలో బీజేపీకి కేవలం 36 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముందుగా ఒక్కో స్టేట్‌లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.

ముందు తెలంగాణ సిట్యూవేషన్‌ చూద్దాం. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ కొలువు దీరింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచి అధికారాన్ని చేపట్టింది. ప్రస్తుతం బీఆర్ఎస్ అవినీతి కేసుల్లో కూరుకుపోయి చాలా దీన స్థితిలో ఉంది. అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఇక బీజేపీ విషయానికి వస్తే.. కాస్త బలపడ్డట్టు కనిపించినా.. మళ్లీ చతికిల పడింది. చేరికలపై ఫోకస్ పెంచినా.. ఎక్స్‌పెక్ట్‌ చేసినంత జరగడం లేదు. దీనికి తోడు అంతర్గత కుమ్ములాటలు కంటిన్యూ అవుతున్నాయి. According to India TV ఓపినియన్‌ పోల్‌ ప్రకారం..
తెలంగాణలో కాంగ్రెస్‌కు 9 సీట్లు, బీజేపీకి ఐదు.. బీఆర్ఎస్‌కు 2, ఎంఐఎంకు ఒక సీటు దక్కే అవకాశం కనిపిస్తోంది.


Also Read: గ్లాజుగ్లాస్ పోయినట్టేనా ? జనసేన చేస్తున్న తప్పేంటి ?

నెక్ట్స్‌ ఏపీ సంగతి చూస్తే.. ఇక్కడ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. అధికార వైసీపీ సోలోగా ఎన్నికలకు వెళుతుండగా.. విపక్ష టీడీపీ.. జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగుతోంది. అయితే ఇక్కడ కూటమికే ఎడ్జ్ కనిపిస్తోంది. ఏపీలో వైసీపీ కేవలం 10 స్తానాలకే పరిమితం కాగా.. టీడీపీకి 12, బీజేపీకి 3 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్‌గా చూస్తే కూటమికి 15 సీట్లు దక్కే చాన్స్ ఉంది. INDIA TV ఓపినియన్ పోల్ ప్రకారం.. జనసేనకు లోక్‌సభ స్థానాలు గెలిచే అవకాశం కనిపించడం లేదు.

కర్ణాటకలో మాత్రం సీన్‌ ఫుల్ రివర్స్‌లో కనిపిస్తోంది. కర్ణాటకలో బీజేపీకి మంచి బేస్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్న మొత్తం 28 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఏకంగా 22 స్థానాలు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్‌ కేవలం 4, జేడీఎస్ 2 స్థానాలకు పరిమితం కానుందని తెలుస్తోంది. ఇక్కడ మాత్రం మోడీ మ్యానియా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎట్ ది సేమ్ టైమ్.. ఇక్కడ బీజేపీకి JDSతో పొత్తు ఉంది. సో NDA కూటమికి ఈ స్టేట్‌లో 24 స్థానాలు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

తమిళనాడులో మాత్రం అస్సలు జాతీయ పార్టీలను పట్టించుకునే అవకాశం లేదనే తెలుస్తోంది. ఎందుకంటే ఈసారి కూడా స్టాలిన్ సారథ్యంలోని DMK సత్తా చాటడం ఖాయమన్న టాక్ ఉంది. తమిళనాడులో 39 ఎంపీ స్థానాలుంటే.. అందులో డీఎంకేకే 18 స్థానాలు దక్కుతాయని ఒపీనియర్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీకి 3, AIADMKకు నాలుగు, PMKకు ఒక స్థానం.. అంటే NDA కూటమికి 8 స్థానాలు దక్కే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఓవరాల్‌గా చూస్తే అన్నామలై పాదయాత్ర, కచ్చతీవు అంశం. పార్టీ బలోపేతానికి పనికి వస్తాయి కానీ.. ఇప్పటికిప్పుడు క్లీన్ స్వీప్‌ చేసే పరిస్థితైతే కనిపించడం లేదు. ఇక కాంగ్రెస్‌కు 8 స్థానాలు దక్కించుకోనుంది.. ఇక ఇండియా కూటమి లెక్కలు తీస్తే.. 26 స్థానాలు దక్కించుకోనుంది.

Also Read: పింఛన్ ఇవ్వండి మహాప్రభో.. ఏపీలో రాజకీయ క్రీడ

కేరళలో ఈసారి కాంగ్రెస్‌ జోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ స్టేట్‌లో మొత్తం 20 ఎంపీ సీట్లు ఉండగా.. ఇందులో కాంగ్రెస్‌కు 7 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక సీఐపీఎం ఐదు, బీజేపీ మూడు, సీపీఐ ఒకసీటు దక్కే అవకాశం ఉంది.

మొత్తం 131 ఎంపీ సీట్లు ఉన్న దక్షిణ భారతంలో.. బీజేపీకి సొంతంగా కేవలం 36 సీట్లు మాత్రమే దక్కే చాన్స్ కనిపిస్తోంది. అది కూడా కర్ణాటక ప్రజల పుణ్యమా అని.. ఎందుకంటే కర్ణాటకలోనే 22 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ లెక్క తప్పితే బీజేపీ అంచనాలన్నీ తలకిందులైనట్టే. అదే కూటమి పరంగా చూసుకుంటే ఎన్డీఏకు 54 సీట్లు దక్కే అవకాశం ఉంది. ఓవరాల్‌గా సౌత్‌ ఇండియాలో ఏ పార్టీ కూడా ఏకచత్రాధిపత్యం చేసే పరిస్థితైతే కనిపించడం లేదు. ప్రజలు బ్యాలెన్స్‌డ్‌గా పార్టీలకు స్థానాలను కట్టబెట్టే అవకాశమే కనిపిస్తోంది.

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×