BigTV English

AP Pension Politics : పింఛన్ ఇవ్వండి మహాప్రభో.. ఏపీలో రాజకీయ క్రీడ

AP Pension Politics : పింఛన్ ఇవ్వండి మహాప్రభో.. ఏపీలో రాజకీయ క్రీడ


AP Pension Politics : నాన్‌స్టాప్ నాన్సెన్స్.. ఇష్యూ ఏదైనా.. దానిని మిస్‌లీడ్ చేయడం. ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేయడం.. ఏపీలో కామన్‌గా మారింది. ఎందుకింత హార్ష్‌గా మాట్లాడాల్సి వస్తుందంటే.. ఇక్కడ సఫర్‌ అవుతున్నది ప్రజలు కాబట్టి. పబ్బం గడపుకుంటున్నది పొలిటికల్ పార్టీలు కాబట్టి. ఇప్పుడు చెప్పుకుంటున్న విషయం.. ఏపీలో జరుగుతున్న పెన్షన్‌ పంపిణీ రాద్దాంతం గురించి. అసలు ఈ వివాదం వెనక రీజనేంటి? దానికి కారకులు ఎవరు?

ఎలక్షన్‌ టైమ్.. అందులోనూ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చీమ చిటుక్కుమన్నా.. ఓ పార్టీ మరో పార్టీపై ఆరోపణలు కామన్. ఎన్నికల పుణ్యమా అని అది మాటల దాడి వరకు వెళుతుంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. దీంతో ప్రజలకు తిప్పలు మొదలయ్యాయి. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల కష్టాలు వర్ణనాతీంగా మారాయి. మాములగా అయితే వాలంటీర్లు ప్రతి నెలా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి అందించేవారు. ఇప్పుడు ఈసీ నిర్ణయంతో ఈ సీన్ మారిపోయింది. వాలంటీర్లు విధులకు దూరంగా ఉన్నారు. నికి కారణం టీడీపీనే అని వైసీపీ. కాదు వైసీపీ కారణంగానే ఈ రాద్దాంతమని టీడీపీ. ఇలా పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ సఫర్ అయ్యేది మాత్రం లబ్ధిదారులు.


Also Read : ఇది శాంపిలే.. అసలు సినిమా ముందుంది!

నిజానికి పెన్షన్‌ ఒకటో తేదీన అందాలి. కానీ క్యాలెండర్‌లో డేట్ మారుతున్న డబ్బులు మాత్రం అందడం లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేయడానికి తీసుకున్న చర్యలేంటి? ఇప్పుడిదే పంచాయితీ కొనసాగుతోంది. ప్రస్తుతం వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది.

ఓ వైపు ప్రజలిలా ఇబ్బందులు పడుతుంటే… వాళ్ల పేరు చెప్పుకొని పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి అధికార, విపక్ష పార్టీలు. ఖజానాను ఖాళీ చేశారని.. కావాలనే ముందు డబ్బులు డ్రా చేయలేదని.. పెన్షన్‌ రాకపోవడానికి కారణం టీడీపీ నేతలే అని ప్రచారం చేస్తున్నారంటూ.. టీడీపీ నేతలు విమర్శలు చేస్తుంటే.. అసలు వాలంటీర్లను తమ విధులకు దూరం కావడానికి కారణమే టీడీపీ అని.. ఈ రోజు ప్రజలిలా ఇబ్బంది పడటానికి కారణం ఆ పార్టీ నేతలే అంటూ వైసీపీ విమర్శిస్తోంది. మరి ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం?

వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఫిర్యాదు చేసిందీ నిజం. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి ఈసీ దూరంగా ఉంచింది నిజం. వాలంటీర్లు సంక్షేమ పథకాలను అందించవద్దు అని కోర్టుకు వెళ్లింది నిజం. కోర్టు వాలంటీర్లు పెన్షన్‌ పంచవద్దని ఆదేశాలు ఇచ్చింది నిజం. ఈ ఆదేశాలకు అనుగుణంగా పెన్షన్‌ను ఇళ్ల వద్ద కాకుండా సచివాలయాల్లో అందిస్తామని.. ప్రభుత్వాధికారులు అనౌన్స్ చేశారు.. ఇది కూడా నిజమే.

Also Read : ఏ నిమిషానికి ఏమి జరుగునో!

ఇప్పుడు నాణేనికి మరో వైపు చూద్దాం. ఈసీ ఆదేశాలు తెలిసినా ప్రభుత్వం ఎందుకు తగిన ఏర్పాట్లు చేయలేదు? ముందు సచివాలయాల వద్ద పంపిణీ చేస్తామని ఎందుకు ప్రకటించింది? మళ్లీ ఇళ్ల వద్దే పంపిణీ చేస్తామని ఈసీ ప్రకటించింది. మరి అన్ని ఏర్పాట్లు చేసే ఈ ప్రకటన జారీ చేసిందా? పంపిణీ చేసేందుకు ఖాజానాలో డబ్బు ఉందా? ఒకటో తేదీన ఇవ్వాలంటే ముందే డబ్బును డ్రా చేయాలి. మరి ఆలస్యంగా ఎందుకు డ్రా చేస్తున్నారు? ఆలస్యానికి కారణం విపక్షాలపై వేసే ఉద్దేశమా? లేక నిజంగానే వాలంటీర్లు లేని లోటు పెద్ద సమస్యగా మారిందా? అసలు వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేసింది ఎవరు? సంక్షేమ పథకాలు అందించవద్దని కోర్టులో కేసులు వేసింది ఎవరు? పిటిషన్‌ వేసిన సంస్థల వెనకున్న రాజకీయ పార్టీ ఏది? వాలంటీర్లు వైసీపీకి ప్రచారం చేస్తున్నారని నిజంగానే భయపడుతున్నారా? ఇప్పుడు నేను వేస్తున్న ప్రశ్నలు వింటుంటేనే మీకో సమాధానం వస్తుంటుంది..

ఎవరి వాదనలు వారివే.. ఎవరి పంచాయితీ వారిదే. వీరి మాటలు వింటే బ్లేమ్‌ గేమ్ తప్ప.. సమస్యకు పరిష్కారమైతే కనిపించదు.ఇప్పటికీ అంటే మూడో తేదీన చీకటి పడే సమయానికి కూడా చాలా సచివాలయాలకు ఇంకా నగదు అందలేదు. ఇక్కడ కూడా రాజకీయమే మొదలైంది. చాలా మందిని సచివాలయాల వద్దకు తరలించారు. మరి వారికి తప్పుడు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చింది వైసీపీ నేతలా, టీడీపీ నేతలా అన్నది తేలాలి. కష్టాలన్నీ టీడీపీ వల్లే అన్నది వైసీపీ లైన్.. నగదు లేకపోయినా కావాలనే తిప్పుతున్నారన్నది ప్రూవ్ చేయాలన్నది టీడీపీ టార్గెట్. ఈ రెండు పార్టీల మధ్య నలిగిపోతున్నది మాత్రం లబ్ధిదారులే. ఇప్పటికే ఇద్దరు వృద్దులు మరణించారు. మరిన్ని ప్రాణాలు పోయేలా చేయకండి. ఈ చనిపోయిన వారిపై కూడా కొత్త రాజకీయం మొదలుపెట్టకండి. మీ రాజకీయాలను దయచేసి ప్రజలను బలి చేయకండి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×