BigTV English

Pushpa 2 Music Session: పుష్ప 2 మ్యూజిక్ సెషన్స్.. ఈ సారి పుష్పకి మించి కొట్టాలి డీఎస్పీ..!

Pushpa 2 Music Session: పుష్ప 2 మ్యూజిక్ సెషన్స్.. ఈ సారి పుష్పకి మించి కొట్టాలి డీఎస్పీ..!
Pushpa2 Music Sessions Begin
Pushpa2 Music Sessions Begin

Pushpa 2 Music Sessions Begin: సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప2’ మూవీ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ టీజర్‌ మూవీపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. అయితే ఈ మూవీ నుంచి మరో అప్డేట్‌ను మేకర్స్ అందించారు. ఈ మేరకు హీరో బన్ని, దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ కలిసి దిగిన ఓ ఫోటోను పంచుకున్నారు.


వీరు కలవడానికి కూడా ఓ కారణం ఉందండోయ్.. ఈ ఫోటో పంచుకుంటూ మ్యూజిక్ సెషన్స్ స్టార్ట్ అయినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియలో షేర్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు రకరకాలు కామెంట్లు కురిపిస్తున్నారు. ఈ సారి పుష్పకి మించి కొట్టాలి డీఎస్పీ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ఇకపోతే ఈ మూవీ టీజర్‌ను అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. దీంతో ఈ టీజర్ చూసేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ టీజర్‌కి దేవీశ్రీ అదిరిపోయే రేంజ్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించినట్లు చెప్పుకొస్తున్నారు. మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో మరికొద్ది రోజుల్లో చూడాలి.


Also Read: ‘దేవర’ ట్రీట్ అదిరింది బాసు.. కొరటాల శివ ప్లాన్ మామూలుగా లేదుగా..!

ఇలాంటి అప్డేట్లతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బన్నీ పుష్ప3 పై అదిరిపోయే అప్డేట్ అందించి మరింత హైప్ పెంచేశాడు. పుష్ప 3 కూడా ఉండొచ్చని చెప్పకనే చెప్పాడు. పుష్ప మూవీని ఫ్రాంచైజీలో తీసుకువచ్చేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తుందని తెలిపాడు.

ఇకపోతే దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. పుష్ప మూవీ ప్రపంచ వ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్ అందుకోవడంతో సెకండ్ పార్ట్ పుష్ప2 పై మరింత అంచనాలు ఏర్పడ్డాయి. అందువల్లనే సుకుమార్ ఎలాంటి విషయంలోనూ తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు.

రిలీజ్ కాస్త లేట్ అయినా పర్వాలేదు కానీ, క్వాలిటీ విషయంలో వెనక్కి తగ్గే ప్రశక్తే లేదని అంటున్నాడట. ఇక అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్‌ కానుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×