
Russia sells Alaska : అమెరికా-రష్యా (America Russia) దేశాలు బద్ధశత్రువులని ప్రపంచమంతా తెలుసు. అలాంటిది ఒకప్పుడు రష్యా తన రాజ్యంలోని బంగారంలాంటి భూమిని తన శత్రువు అమెరికాకు చిల్లర ధరకు అమ్మేసింది. ఆ భూమి విస్తీర్ణంలో యూరప్ ఖండానికి మూడింతలు ఉంటుంది. అంత పెద్ద భూమి అది కూడా బంగారం ధరతో సమానమైన విలువ చేసేది. బంగారం రెండు రకాలు ఒకటి నగలు, నట్రా చేసుకునే పుత్తడి మరొకటి నల్లబంగారం అంటే పెట్రోలియం. పెట్రోల్, డీజిల్ లాంటి విలువైన ఖనిజ పదార్థం. అలాంటిది ఆ భూమిలోపల రెండు రకాలు బంగారం ఉంది. ఇక చెప్పేదేముంది. ఆ భూమి కొన్న ధర కంటే వేయి రెట్లు ఎక్కువ సంపాదించింది అమెరికా. ఇదంతా చూసి రష్యా ఇప్పుడు లోలోపల అసూయ పడుతోంది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకుందాం..
1867 సంవత్సరానికి ముందు అలస్కా ప్రాంతం రష్యా రాజ్యంలో ఓ పెద్ద భాగం. అలస్కా ప్రాంతంలోని భూమిలో బంగారం, వజ్రాలు, పెట్రోలియం వంటి ఖనిజాల నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. అలాంటి విలువైన భూమిని రష్యా 1867, మార్చి 30న అమెరికా దేశానికి కేవలం 72 లక్షల డాలర్ల(45 కోట్ల 81 లక్షలు) ధరకు విక్రయించేసింది.
అలస్కాకు తూర్పు దిశలో కెనడా దేశం, ఉత్తరాన ఆర్కటిక్ మహాసముద్రం, పడమర దిక్కున రష్యా దేశం, దక్షిణాన పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. ఈ ప్రాంతానికి అలస్కా అనే పేరు రష్యా పాలకులే పెట్టారు. అలస్కా అంటే అందమైన భూమి. ఈ భూమిని ఒకప్పుడు రష్యా స్వర్గ భూమి అనే పిలిచేవారు. ఎందుకంటే ఈ ప్రాంతం మంచుకొండలు, అడువులు, నదులు, పచ్చని చెట్లతో ఎంతో అందంగా ఉంది.
ఇంతటి అందమైన భూమిని అమెరికాకు విక్రయించాలని 1867లో అప్పటి రష్యా విదేశాంగ మంత్రి అల్గెజాండర్ మిఖాలోవిచ్ గొక్రాకోవ్ రష్యా జార్(మహారాజు) అల్గెజాండర్-IIకు సలాహా ఇచ్చారు. దీనికి చాలా కారణాలున్నా.. విదేశాంగ మంత్రి గొక్రాకోవ్ ఈ విషయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌తో కలిసి కుట్ర పన్నారని చరిత్రకారుల అభిప్రాయం.
అలస్కా లాంటి ప్రాంతాన్ని అమెరికా దేశానికి విక్రయించేందుకు అప్పటి రష్యా ప్రజలు అంగీకరించలేదు. అయినా రష్యా మహారాజు 1867, మార్చి 30న అలస్కాను అమెరికా దేశానికి విక్రయిస్తూ పత్రాలపై అధికారిక ముద్ర వేశారు.
ముఖ్య కారణాలు :
ప్రపంచం చరిత్రలో అతి పెద్ద సంక్షోభాలకు చాలా వరకు బ్రిటీషువారే కారణం. ఇక్కడ కూడా అదే జరిగింది. 1853 సంవత్సరంలో ఫ్రాన్స్, బ్రిటీష్ వారితో రష్యా యుద్ధం చేసింది. ఈ యుద్ధం క్రిమియాలో జరిగింది. మూడేళ్లపాటు జరిగిన ఈ యుద్ధంతో రష్యా ఆర్థికంగా చాలా నష్టపోయింది. దాదాపు ఖజానా ఖాళీ అయిపోయింది.
మరోవైపు అలస్కాకు పక్కనే ఉన్న కెనడా దేశం ఆ సమయంలో బ్రిటీష్ పాలనలో ఉండేది. చాలా కాలంగా అలస్కాపై అమెరికా కన్ను ఉండేది. బ్రిటీష్ సహాయంతో అమెరికా ఎప్పుడైనా దాడి చేసి అలస్కాపై అధికారం సాధించగలదు.
ఈ పరిస్థితులలో పెద్ద విస్తీర్ణంలో ఉన్న అలస్కా ప్రాంతాన్ని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున ఖర్చు చేయాలి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న అలస్కాను కాపాడుకోవడం రష్యా మహారాజుకి పెద్ద సవాలుగా మారింది.
రష్యా మహారాజు హత్య వెనుక అలస్కా కారణం
అల్గెజాండర్-II సోవియట్ యూనియన్ రష్యాలో ఏప్రిల్ 29, 1818లో జన్మించారు.
1855, మార్చి 2న ఆయన రష్యా మహారాజు అయ్యారు.
1867 సంవత్సరంలో అలస్కా భూమిని అమెరికాకు విక్రయించిన తరువాత మహారాజుపై మూడు సార్లు హత్యాయత్నం జరిగింది. అలస్కాను విక్రయించడాన్ని వ్యతిరేకించిన విప్లవకారులే మహారాజు హత్యకు కుట్ర పన్నారని రష్యా చరిత్రకారలు అభిప్రాయపడుతున్నారు.
రష్యా పతనానికి మహారాజు అల్గెజాండర్-II నిర్ణయాలే కారణమని విప్లవకారుల వాదన.
ఆ తరువాత 1881, మార్చి 13న, సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని వింటర్ ప్యాలెస్‌లో మహారాజు ఉండగా.. ఆయనపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో మహారాజు అల్గెజాండర్-II మరణించారు.
అలస్కా ప్రకృతి సంపదతో పెద్ద ఖజానా కొల్లగొట్టిన అమెరికా
దాదాపు 1,717,856 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అలస్కా భూమిపై ఉన్న కుబేరుడి ఖజానా లాంటిది.
అలస్కాలో పెట్రోలియం నిక్షేపాలు ఉన్నాయని 1890వ దశకంలో తెలియడంతో అమెరికా ఇక్కడ ఎన్నో ఫ్యాక్టరీలు స్థాపించింది.
1950వ దశకంలో అలస్కా ప్రాంతంలో బంగారం, వజ్రాలున్నాయని అమెరికాకు తెలిసింది. దీంతో ఇక్కడ పెద్ద మొత్తంలో బంగారం వెలికితీయడం జరుగుతోంది.
అలస్కా అందమైన ప్రాంతం కావడంతో ఇక్కడ టూరిజం, ఫిషింగ్ వల్ల కూడా అమెరికాకు భారీ ఆదాయం వస్తోంది. ఇక్కడ ప్రతీ సంవత్సరం లక్షల సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు.