BigTV English

Amritpal Singh To File Nomination: ఎన్నికల బరిలో ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్,

Amritpal Singh To File Nomination: ఎన్నికల బరిలో ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్,

Amritpal Singh To File Nomination: ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ ఎన్నికల బరిలోకి దిగాడు. ఈసారి పంజాబ్‌లోకి ఖడూర్ సాహిబ్ లోక్‌సభ నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులను వెయ్యి రూపాయలుగా చూపించాడు.


మూడుపదుల వయసున్న ఆయన, వారిస్ పంజాబ్ దే అతివాద సంస్థకు అధ్యక్షుడు. ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయి, అస్సాంలోకి దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. ఆయన తరపు నామినేషన్  పత్రాలను బంధువులు శుక్రవారం ఎన్నికల అధికారికి అందజేశారు. అందులో ఆస్తుల చిట్టాను బయటపెట్టాడు.

ఎస్బీఐలో కేవలం వెయ్యి రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నాడు. అలాగే తన భార్య కిరణ్‌దీప్ కౌర్ పేరిట 18 లక్షల చరాస్తులు ఉన్నట్లు తెలిపాడు. బంగారం ఆభరణాలు దాదాపు నాలుగు లక్షలు ఉన్నట్లు అందులో తెలిపాడు. ఆమె బ్రిటీష్ జాతీయురాలు. తాను పేరెంట్స్‌పై ఆధారపడి బతుకుతున్నట్లు వెల్లడించాడు.


అమృత్‌పాల్ సింగ్‌పై 12 క్రిమినల్ కేసులు ఉన్నాయి. కేవలం పదో తరగతి మాత్రమే చదివాడు. 2008లో అమృతసర్‌లోని ఓ పాఠశాల నుంచి పాసయ్యాడు. ఖలిస్తాన్ సానుభూతి పరుడైన అమృత్‌పాల్ సింగ్ పోలీసులకు చిక్కకుండా రకరకాల మారువేషాలతో పంజాబ్ అంతటా తిరిగాడు. గతేడాది మార్చి 18న జలంధర్ జిల్లాలో పోలీసులకు దొరికిపోయాడు.

అమృతపాల్ సింగ్ ఓ స్వీయ బోధకుడు. 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్‌లో మరణించిన బింద్రన్ వాలా స్టయిల్‌లో బోధకుడి అవతారం ఎత్తాడు. తన బోధనలతో సిక్కులను రెచ్చగొట్టడంలో ఆయన దిట్ట. ప్రత్యేకంగా సిక్కు దేశం కావాలని పోరాడుతున్నాడు. బెదిరింపులకు కేరాఫ్ అడ్రస్‌గా అమృత్‌పాల్ సింగ్  గ్యాంగ్‌ని చాలామంది చెబుతారు. ఇక పంజాబ్‌లో 13 సీట్లకు జూన్ ఒకటిన ఎన్నికల పోలింగ్ జరగనుంది.

 

Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×