BigTV English

Yanam Politics: రాష్ట్రం మార్చేసిన పొన్నాడ.. గురువుపైనే పోటీ

Yanam Politics: రాష్ట్రం మార్చేసిన పొన్నాడ.. గురువుపైనే పోటీ

Yanam Politics: కొందరంటే కొందరికి అరుదైన అవకాశాలుంటాయి. వారు కేవలం పార్టీలు మారడమే కాదు.. ఏకంగా రాష్ట్రాలను కూడా దాటేసి దడదడలాడించే బంపరాఫర్లు కొట్టేస్తుంటారు. అలాంటి అరుదైన అవకాశమున్న ఆ నేత ఎవరు? తన గురువుకే దమ్కీ ఇవ్వాలని చూస్తున్న ఆ నేతకు అత్యంత దగ్గర్లో తచ్చాడుతున్న ఆ ఛాన్సేంటి? తెలియాలంటే మీరీ స్టోరీ చూడాల్సిందే.


పాండీకి 800 కి. మీలో ఉండే యానాం

ఇటు గురువును కొట్టి అటు యానాం ఎమ్మెల్యేగా గెలిచి.. రాజధాని పాండిచ్చేరికి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న యానాం నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే కొత్త కొత్త రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. గత ఎన్నికల వరకూ యానాం నిజయోవర్గం పేరు చెబితే వినిపించే పేరు.. ద ఒన్ అండ్ ఓన్లీ మల్లాడి కృష్ణారావు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పేరున్న ఆయన.. యానాం రాజకీయాలను మూడు దశకాలుగా శాసించారనే పేరుంది. ఇటు ఎమ్మెల్యేగా అటు మంత్రిగా కాంగ్రెస్ తర్వాత ఎన్ ఆర్ కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన మల్లాడి.. 2021లో తాత్కాలిక రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఈ దిశగా ఒక ప్రకటన కూడా చేశారు.


2021లో మల్లాడి తాత్కాలిక రాజకీయ సన్యాసం

2021లో తన రాజకీయ వారసులుగా తన శిష్యులను నిలబెడతానని ప్రకటన చేసిన కృష్ణారావు.. ఆ ఎన్నికల సమయంలో.. ప్రస్తుత పాండి సీఎం రంగస్వామిని యానాం బరిలోకి దింపారు. పాండీ నుంచి కూడా పోటీ చేసిన రంగస్వామి వైపు యానం ప్రజలు ఎంత మాత్రం మక్కువ చూపలేదు సరికదా.. బీజేపీ రెబల్ గొల్లపల్లి అశోక్ ని గెలిపించి యానాం రాసిచ్చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన రెబల్ అశోక్ తిరిగి బీజేపీలోకి చేరి.. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారు.

యానాం పాలిటిక్స్ లోకి ఏపీ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ

ఇప్పటి వరకూ యానాం రాజకీయ నావ సజావుగా సాగుతుందనుకునే లోపు.. సడెన్ గా మరో కుదుపు. అదే ఏపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ.. యానాం ఎంట్రీ ఇస్తున్నారనే పబ్లిసిటీ పీక్ స్టేజ్ లో సాగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుగా ఉన్న యానాం.. నియోజకవర్గం పాండిచ్చేరిలో ఉండటం తెలిసిందే. ఇప్పటి వరకూ యానాం నుంచి ప్రాతినిథ్యం వహించిన మల్లాడి మత్స్యకారుడు కావడం, అదే సామాజిక వర్గానికి చెందిన ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ యానం కాంగ్రెస్ లో చేరి తన పొలిటికల్ గురూ.. మల్లాడి కృష్ణారావుపై రానున్న ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

యానాంలో తాళ్లరేవు, ముమ్మిడివరం, అమలాపురంకి చెందిన 35 వేల ఓట్లు

యానాంలో.. తాళ్లరేవు, ముమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గాల వారెందరో ఇక్కడ సెటిలర్స్ గా ఉన్నారు. వీరందరి ఓట్లే సుమారు 35 వేలు కాగా.. ఈ ఓటర్లలో కూడా మత్స్యకారులే అధికం. దీంతో ఏపీ రాజకీయాల్లో ఉండి ఎలాంటి యూజ్ లేదని ఫీలైన సతీష్‌.. వైసీపీకి రాజీనామా చేయకుండానే పాండీ వెళ్లి.. అక్కడ మాజీ ముఖ్యమంత్రులు నారాయణస్వామి, వైద్యలింగం వంటి కాంగ్రెస్ పెద్దలను కలవడంతో యానాం రాజకీయాల్లో కలకలం చెలరేగింది. టూ టరమ్స్ ముమ్మిడివరం ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నాడ.. ఇలా సడెన్ గా యానాం టర్న్ తీస్కోవడంతో.. ఇదో చర్చగా మారింది.

పొన్నాడ సడెన్ గా యానాం టర్న్ తీస్కోవడంతో మొదలైన చర్చ

వైసీపీ అధికారంలో ఉండగా.. మంత్రివర్గ విస్తరణ సమయంలో మత్స్యశాఖా మంత్రిగా ఉన్న మోపిదేవి.. రాజ్యసభకు వెళ్లడంతో ఆ మంత్రిత్వాం తనకే వస్తుందని ఆశించారు పొన్నాడ. నోటికాడికి వచ్చినట్టే వచ్చి చేజారిన ఆ పదవి తనకు దక్కక పోవడం వెనక మల్లాడి హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండే మల్లాడి.. ఈ పదవి తొలి సారి ఎమ్మెల్యే అయిన సీదరి అప్పలరాజుకు ఇంప్పించారనీ.. దీంతో ఎలాగైనా ఆ కసి తీర్చుకోవాలని సతీష్ డిసైడ్ అయినట్టు యానాం రాజకీయ వర్గాల భోగట్టా. అందుకే 2021 పాండీ ఎన్నికల్లో యానాం నుంచి పోటీ చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి రంగస్వామిని ఓడించడానికి పొన్నాడ శాయశక్తులా పని చేశారని కూడా అంటారు.

ఆ కక్షతోనే సతీష్ రంగస్వామిని ఓడించినట్టు లోకల్ టాక్

తన శిష్యుడి రాజకీయ కక్ష సాధింపును గురువు మల్లాడి కూడా సీరియస్ గా తీసుకున్నారనీ. అందుకే 2024 ఎన్నికల్లో ముమ్మిడివరం నుంచి బరిలోకి దిగిన పొన్నాడను ఓడించి తీరుతానని శపథం చేశారనీ. అనుకున్నట్టే.. ఏపీలో కూటమి హవా ముందు పొన్నాడ కొట్టుకుపోయారనీ.. దీంతో మల్లాడి అనుకున్న పని.. కూటమి చేసినందుకు ఆయన లోలోన ఎంతగానో సంతోషిస్తున్నారనీ అంటారు స్థానికులు.

2026 పాండీ ఎన్నికల్లో పార్టీయే కాదు రాష్ట్రమూ మారనున్న పొన్నాడ

రాజకీయాలన్నాక ఎత్తుకు పై ఎత్తులే ఎక్కువ కాబట్టి.. ఇప్పుడు పొన్నాడ వంతు వచ్చిందనీ. 2026లో వచ్చే పాండీ ఎన్నికల్లో.. తన రాజకీయ గురువు మల్లాడిని ఎలాగైనా సరే దెబ్బ తీయాలనే ఉద్దేశంతో ఏకంగా.. పార్టీ మారడం మాత్రమే కాదు.. రాష్ట్రం సైతం దాటడానికి పొన్నాడ సిద్ధపడ్డారనీ.. అంటున్నారు. 2009లో కాంగ్రెస్, 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన పొన్నాడ.. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇకపై మరొక లెక్క అంటున్నారని యానాం రాజకీయ వర్గాల సమాచారం. ఇప్పటి వరకూ తాను గెలవడానికి మాత్రమే ప్రయత్నించిన సతీష్ ఇక తన గురువు యానాంలో ఎలా గెలుస్తాడో చూస్తాననీ అంటున్నట్టు తెలుస్తోంది.

ఈసారి తన గురువు ఎలా గెలుస్తాడో చూస్తానంటోన్న శిష్యుడు

తన శిష్యుడి నుంచి ఇంతటి రాజకీయ సవాళ్లను ఎదుర్కుంటున్న మాజీ మంత్రి మల్లాడి.. ప్రస్తుత ముఖ్యమంత్రి రంగస్వామి నియోజకవర్గంలో ఏం చేసినా.. అదంతా తన వల్లే సాధ్యమైందని టముకేసుకుంటున్నట్టు ఇన్నర్ సర్కిల్స్ బిగ్గర్ టాక్. దానికి తోడు ప్రస్తుత ఎమ్మెల్యే అశోక్ ఏమంత ఎఫెక్టివ్ గా లేక పోవడంతో.. కృష్ణారావు చేస్తున్న ప్రచారం కూడా జనం బాగానే నమ్ముతున్నట్టు తెలుస్తోంది.

మల్లాడి ఏ పార్టీలో చేరుతారో అనే సస్పెన్స్ ను క్యాష్ చేసుకునే యత్నం

మల్లాడి రాజకీయ ఎత్తుగడలు ఇలాగుంటే.. ఆయన మైనస్ పాయింట్లను సైతం బాగా గుర్తించి పొన్నాడ ముందుకెళ్లే యత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటి వరకూ కృష్ణారావు ఏ పార్టీలోనూ లేక పోవడం, 2026లో ఏ పార్టీ తరఫు పోటీ చేస్తారో ఒక క్లారిటీ లేక పోవడంతో.. ఇవే తన ఆయుధాలుగా భావించి పొన్నాడ పథక రచన చేస్తున్నట్టు అంచనా వేస్తున్నాయి యానాం రాజకీయ వర్గాలు.

ఇటు గురువును కొట్టి అటు యానాం ఎమ్మెల్యేగా గెలిచి..

అందుకే తన కాంగ్రెస్ పరిచయాలను పావులుగా వాడుకున్న పొన్నాడ సతీష్.. ముందుగానే తన యాంనం సీటు కన్ఫం చేసుకున్నారనీ. రాష్ట్రం మారినా.. అక్కడంతా మన వాళ్లే ఉన్నారు కాబట్టి.. ఇటు గురువును కొట్టి అటు యానాం ఎమ్మెల్యేగా గెలిచి.. తొడగొట్టాలని పొన్నాడ చూస్తున్నారనీ అంటున్నారు. మరి ఈ గురు శిష్యుల యానాం పోరులో గెలిచేదెవరు ఓడేదెవరు తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదంటున్నారు యానాం ఓటర్లు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×