Jaanvi Swarup Ghattamaneni: ఒకప్పుడు హీరోల వారసులు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూసిన ప్రేక్షకులు ఇప్పుడు వారసురాళ్లు రావడం చూస్తూ షాక్ అవుతున్నారు. ఒక తరం నుంచి హీరోయిన్స్ గా వస్తారు అనుకుంటే.. కొత్త తరం వారసురాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇక ఈమధ్యనే నందమూరి కుటుంబం నుంచి ఒక వారసురాలు కెమెరా ముందుకు వచ్చింది. నందమూరి నట సింహం బాలకృష్ణ ముద్దుల తనయ తేజస్విని.. సిద్దార్థ్ ఫైన్ అండ్ జ్యూవెలరీ యాడ్ లో కనిపించి కనువిందు చేసింది. అబ్బా.. ఏముంది.. హీరోయిన్ కూడా సరిపోదు. అంత అందంగా ఉంది. నెక్స్ట్ హీరోయిన్ గా తీసుకురండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు.
ఇక ఇప్పుడు మరో వారసురాలు యాడ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఘట్టమనేని కృష్ణ వారసుల గురించి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కృష్ణ వారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు ఆల్రెడీ తమ సత్తాను చూపించారు. ఇక వారసురాలిగా మంజుల ఘట్టమనేనిని హీరోయిన్ గా తీసుకురావడానికి కృష్ణ చాలానే కష్టపడ్డాడు. కానీ, అది వర్క్ అవుట్ అవ్వలేదు. మంజులను ఫ్యాన్స్ తిరస్కరించారు. దీంతో ఆమె నటిగా అడపాదడపా కనిపిస్తుంది తప్ప.. పూర్తిస్థాయిలో ఇండస్ట్రీలో లేదు.
ఇప్పుడు మంజుల తాను చేయలేనిది తన కూతురు ద్వారా చేయాలనీ ప్రయత్నిస్తుంది. తనెలాగూ హీరోయిన్ కాలేదు కాబట్టి.. తన కూతురు కజాన్వీ స్వరూప్ ను హీరోయిన్ గా నిలబెట్టాలని ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొన్నిరోజుల క్రితం జాన్వీని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక తాజాగా జాన్వీ ఒక యాడ్ తో ప్రేక్షకుల ముందు వచ్చింది. కౌశిక్ గోల్డ్ & డైమండ్స్ యాడ్ లో ఘట్టమనేని వారసురాలు ఎంతో అందంగా మెరిసింది. తన తల్లి మంజులతో కలిసి జాన్వీ ఈ యాడ్ లో నటించింది.
ఒంటినిండా ఆభరణాలతో.. జాన్వీ అచ్చతెలుగు పెళ్లికూతురు గెటప్ లో ఎంతో అందంగా దర్శనమిచ్చింది. అందమే అసూయపడేంత అందంగా కనిపించి కనువిందు చేసింది. మొదటిసారి కెమెరా ముందుకు వచ్చినా కూడా తడబడకుండా కాన్ఫిడెంట్ గా నటించి మెప్పించింది. మహేష్ మేనకోడలు అంటే ఆ మాత్రం ఉంటుందిగా. ఇక జాన్వీ లుక్ చూస్తుంటే హీరోయిన్ మెటీరియల్ లానే అనిపిస్తుంది. అందానికి అందం, అభినయం.. ఇక కావాల్సినంత పేరు ఉండనే ఉంది. దీంతో త్వరలోనే ఈ చిన్నది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని ప్రేక్షకులు నమ్మకంగా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి త్వరలోనే జాన్వీ.. ఘట్టమనేని వారసురాలిగా టాలీవుడ్ లో అడుగుపెడుతుందేమో చూడాలి.