BigTV English

Ambati Rambabu: అంబటికి జగన్ షాక్.. సత్తెనపల్లిలో వైసీపీకి కొత్త ఇంచార్జ్

Ambati Rambabu: అంబటికి జగన్ షాక్.. సత్తెనపల్లిలో వైసీపీకి కొత్త ఇంచార్జ్

Ambati Rambabu: మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం.. కానీ గెలిచింది రెండు సార్లే. విషయం ఏదైనా కానీ ప్రత్యర్ధులపై విమర్శలు చేయడమే ఆయన పని. వాగ్బాణాలే కాదు..అవసరమైతే స్టెప్పులు కూడా వేయగలరు ఆ మాజీ మంత్రి. వీటన్నింటికీ తోడు ఆ పార్టీ అధినేతకి నమ్మిన బంటు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా జిల్లా మార్చి మరీ.. వేరే జిల్లాకి ఇంచార్జ్ చేశారు పార్టీ చీఫ్. కానీ సీటు విషయంలో మాత్రం మళ్లీ అక్కడ నో ఛాన్స్ అని ఎందుకు అంటున్నారు ? ఈసారి అసలు సీటు అయినా ఇచ్చే ఛాన్స్ ఉందా ? ఇస్తే ఎక్కడ అవకాశం ఇస్తారు ? ఇంతకీ ఎవరా నేత ? ఆ నియోజకవర్గం ఏంటో.. వాచ్ థిస్ స్టోరీ…


మాజీ సీఎం జగన్ కి నమ్మిన బంటుగా అంబటి రాంబాబు

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేతల్లో ఒకరు అంబటి రాంబాబు. వన్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ వైసీపీగా ఆయన పేరు పొందారు. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్‌కళ్యాణ్‌లతో పాటు విపక్ష నేతల్ని తిట్టడమే పనిగా పెట్టుకొని.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కి నమ్మిన బంటుగా మారారు. అసెంబ్లీలోనూ, బయటా నాటి విపక్షాలపై ధ్వజమెత్తడమే పనిగా పెట్టుకుని.. వైసీపీ అధికారంలో ఉన్న చివరి రెండేళ్లలో కేబినెట్ బెర్త్ దక్కించుకోగలిగారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టు.. ప్రభుత్వాన్ని విమర్శించడమే టార్గెట్ గా పెట్టుకొని.. విషయం ఏదైనా కానీ సర్కారుని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ బాస్ జగన్.. అంబటికి సీటు విషయంలో షాక్ ఇవ్వబోతున్నారనే చర్చ హాట్ టాపిక్ గా మారింది.


ఎన్నికలకు ముందు అంబటి రెండో అల్లుడు షాకింగ్ కామెంట్స్

అంబటి రాంబాబు నీచుడు, శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి ఓటేయవద్దు.. గత ఎన్నికలకు ముందు అంబటి రాంబాబు రెండో అల్లుడు, డాక్టర్‌ జి.గౌతమ్‌ చేసిన కామెంట్స్ ఇవి. ఇవే కాకుండా రెండో సారి సత్తెనపల్లి నుంచి బరిలోకి దిగిన అంబటికి చాలా సవాళ్లే ఎదురయ్యాయి. ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని స్థానికసంస్థల ప్రతినిధులు పలువురు పార్టీకి రాజీనామా చేయడం. పేదలకు వచ్చిన ఎక్స్‌గ్రేషియా చెక్కుల్లో సైతం కమీషన్లకు పాల్పడ్డారనే ఆరోపణలు.. మహిళలను వేధించిన ఫోన్ కాల్స్ లీక్ అవ్వడం వంటి వివాదాలతో నిండా మునిగిపోయారు. ఇవేమీ పట్టించుకోని జగన్ అంబటికి ఛాన్స్ ఇస్తే.. ఎన్నికల్లో ఓటర్లు ఓటమి కట్టబెట్టారు.

11 సీట్లకే పరిమితం కావడంతో ఆలోచనలో పడ్డ జగన్

ఇక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత.. వైసీపీ అధినేతకు అత్యంత సన్నిహితులుగా ఉన్న పలువురు నాయకులు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పటికే రాజీనామాలు, వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కానీ పలువురు నేతలు మాత్రం జగన్ ని నమ్మిన బంటుల్లాగానే ఉంటున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు పలువురు చేసిన ఘన కార్యాలే ఇప్పుడు వారికి చిక్కులు తీసుకురాక తప్పదని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడం జగన్ ని ఆలోచనలో పడేస్తుందట. అందుకే తనకు నమ్మిన బంటుగా ఉన్న నేతలకు సైతం ఈసారి హ్యాండ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. వారిలో అంబటి పేరు కూడా ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

అంబటి రాంబాబుకు షాక్ ఇస్తున్నారనే ప్రచారం

ఘోర పరాభవంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన జగన్.. ఉన్న నేతలను అయినా కాపాడుకునేందుకు క్షేత్ర స్థాయి నుంచి ప్రక్షాళన చేపట్టారు. ఈ క్రమంలోనే వైసీపీలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొందరికి నియోజకవర్గాలు మారుస్తుంటే.. కొందరు మాత్రం ఏకంగా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకే మారుస్తున్నారు. ముఖ్యంగా పలువురు నేతలకు మాత్రం మళ్లీ అదే సీటు కట్టబెట్టే ఆలోచనలో జగన్ లేరని అనుకుంటున్నారు. అందులో భాగంగానే మాజీ సీఎంకి వీర విధేయుడు.. పార్టీలో సీనియర్ అయిన అంబటి రాంబాబుకు కూడా షాక్ ఇస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో.. అంబటి పోటీ చేసి భారీ ఓటమిని చూసిన సత్తెనపల్లి అసెంబ్లీ సీటులోకి.. కొత్త ఇంచార్జిని జగన్ నియమిస్తున్నారని ప్రచారం విస్తృతంగా సాగుతోంది.

36 ఏళ్ల కెరీర్‌లో 2 సార్లే గెలిచిన అంబటి

అంబటి రాంబాబు తన 36 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది రెండంటే రెండు సార్లే. 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బీఎల్ చేసిన ఆ లాయర్ .. ఆ మరుసటి ఏడాది అంటే 1989లో గుంటూరు జిల్లా రేపల్లె నుంచి మొట్టమొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994, 1999 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంబటి .. వైఎస్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014లో సత్తెనపల్లి టికెట్ దక్కించుకున్న ఆయన కోడెల శివప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. 2019లో రెండో సారి ఎమ్మెల్యే అయ్యే భాగ్యం ఆయనకు దక్కింది. ఐదేళ్లలో చివరి రెండేళ్ళు మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు జగన్. కానీ గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యారు అంబటి. ప్రస్తుతానికి అంబటి రాంబాబుని గుంటూరు జిల్లా అధ్యక్షులుగా కూడా నియమించారు. ఈ సమీకరణాలతోనే సీటు విషయంలో మాత్రం ససేమేరా అంటున్నారట జగన్.

Also Read:  జగన్‌కు బిగ్‌ షాక్‌.. జనసేనలోకి ఆమంచి క్రిష్ణ మోహన్..?

సత్తెనపల్లిలో ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్

ఈ పరిస్థితుల్లోనే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈసారి బరిలో ఎవరుండే అవకాశాలు ఉన్నాయనే దానిపైన ఇప్పటికే చర్చ మొదలైంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా గమనీయంగానే ఉన్నాయట. అందుకే ఈసారి అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయట. అయితే సత్తెనపల్లిలో టీడీపీ తరఫున మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గెలుపొందారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో వైసీపీ కూడా అంబటిని మార్చినా కాపులకే మళ్లీ ఇక్కడ ఇంచార్జిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఛాన్స్ ఉందని టాక్

ప్రస్తుత పరిస్థితుల్లో మంగళగిరి నుంచి రెండు సార్లు గెలిచి.. 2024లో టికెట్ దక్కించుకోలేకపోయిన జగన్ సన్నిహితుడు అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఛాన్స్ ఉందని అంటున్నారు. సామాజికవర్గ సమీకరణాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఆర్కేకి ఛాన్స్ ఇవ్వొచ్చని చర్చ జరుగుతోంది. ఈ విషయంలోనే జగన్ నియోజకవర్గంలోని ముఖ్య నేతల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నట్టు భావిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి నుంచి బరిలో దించాలని చర్చ నడిచింది. కానీ అంబటి రాంబాబు మాత్రం తనకు మాత్రమే ఆ సీటు ఇవ్వాలని పట్టుబట్టడంతో జగన్ కాదనలేకపోయారని అంటున్నారు.

నరసరావుపేట ఎంపీ స్థానానికి మోదుగుల ?

కానీ ఈసారి మాత్రం ఆళ్ల రామకృష్ణారెడ్డికి సత్తెనపల్లి నియోజకవర్గంలో అవకాశం ఇచ్చి నరసరావుపేటలో కూడా ఎంపీ స్థానానికి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గనక అవకాశం ఇస్తే తప్పకుండా తమకు ఈక్వేషన్స్ కలిసి వస్తాయని అంచనాల్లో వైసీపీ అధిష్టానం ఉందట. అందుకోసం ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారట. దీంతో సత్తెనపల్లి బరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉండే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని పొలిటికల్ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది.

రాజకీయాల్లో ఆర్కే మళ్లీ యాక్టివ్ అవుతారా ?

ప్రస్తుతానికి మాత్రం రాజకీయాల్లో యాక్టివ్ గా లేని ఆర్కే.. మళ్లీ యాక్టివ్ అయ్యి అవుతారా ? సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందడుగు వేస్తారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు నమ్మిన బంటుగా పేరొందిన అంబటికి జగన్ ఏం న్యాయం చేస్తారు ? ఒకవేళ మళ్లీ ఛాన్స్ ఇస్తే ఎక్కడ ఇస్తారు అని కూడా చర్చ జరుగుతోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×