Pushpa 2 Day 11 collection : పుష్ప.. పుష్ప.. ఇదే మాట జనాల్లో వినిపిస్తుంది. పుష్ప 2 మూవీ వచ్చి 12 రోజులు అవుతున్నా రికార్డులు మాత్రం తగ్గలేదు.. కలెక్షన్స్ ఊచకోత ఆగలేదని తెలుస్తుంది. డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షోతోనే మంచి టాక్ ను అందుకుంది. మౌత్ టాక్ ఎఫెక్ట్ ఏమో గాని సినిమా మాత్రం ఇప్పటికి థియేటర్లలో రన్ అవుతుంది. అల్లు అర్జున్ సినిమా చూసేందుకు సినీ అభిమానులు ఆతృత కనబరుస్తున్నారు. మొదటి ఆరు రోజుల్లోనే రికార్డులను బ్రేక్ చేసింది. రాజమౌళి సినిమాల రికార్డులను బ్రేక్ చేసేలా 1000 కోట్లను వసూల్ చేసింది. ఇక ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.. ఆ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందని అనుకున్నారు. కానీ పుష్ప రాజ్ జోరు తగ్గలేదు.. 12 రోజుల అవుతున్నా కోట్లు వసూల్ చేస్తుంది. ఇప్పటివరకు ఎంత వసూల్ చేసిందో ఒక్కసారి చూసేద్దాం..
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాకు దాదాపు 450 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది.. ఇక ప్రమోషన్స్ కు గాను మరో 50 కోట్ల వరకు ఖర్చు చేశారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ మూవీకి 500 ల కోట్లు ఖర్చు చేశారని అంచనా వేస్తున్నారు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. భారతీయ సినీ చరిత్రలోనే ఏ హీరోకి, ఏ సినిమాకు జరగని విధంగా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపరిచాడు అల్లు అర్జున్. రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల షేర్ టార్గెట్‌గా బరిలోకి దిగిన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను రాబట్టి ట్రేడ్ వర్గాలనే షాక్ అయ్యేలా చేసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కల్కి రికార్డులను బ్రేక్ చేసేంది.
పుష్ప రాజ్ థియేటర్లలో ఇంకా దుమ్ము దులిపేస్తున్నాడు. శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ ఇంకాస్త ఊపందుకున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. శనివారం, ఆదివారాల్లో కలెక్షన్స్ పెరిగాయి. 11 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 17 కోట్లు, హిందీలో రూ. 57 కోట్లు, తమిళనాడులో రూ.4 కోట్లు, కర్ణాటక, కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో కలిపి రూ. 3 కోట్లు , ఓవర్సీస్‌లో రూ. 10 కోట్ల చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ. 92 కోట్ల వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. మొత్తంగా 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లు పైగా రాబట్టిందని తెలుస్తుంది.. రేపు ఏళ్లు, ఎల్లుండికి 1500 కోట్లను క్రాస్ చేస్తుందని తెలుస్తుంది. ఇక ఈ నెలలోపు 2000 కోట్లను క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం 11 రోజుల్లోనే అందుకుని భారతీయ సినీ చరిత్రలోనే ఆ స్థాయి బిజినెస్, రికవరీని అందుకున్న తొలి చిత్రంగా పుష్ప 2 నిలిచింది. చూడాలి అంతకు మించి రాబడుంతుందేమో.. ఇక ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.