BigTV English

TDP Vs YSRCP: వైసీపీ డామినేషన్.. టీడీపీ ఎమ్మెల్యేల బాధలు..

TDP Vs YSRCP: వైసీపీ డామినేషన్.. టీడీపీ ఎమ్మెల్యేల బాధలు..

TDP Vs YSRCP: ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పలువురు కీలక టీడీపీ నేతలతో పాటు దాదాపు ప్రతీ జిల్లాల్లోనూ ద్వితీయశ్రేణి నాయకులు కూడా ఇబ్బందులు పడ్డామని చెప్పుకున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతల చెప్పుచేతల్లో ఉన్న పోలీసులు తమను టార్గెట్ చేశారని వాపోయేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారి నాలుగు నెలలు గడిచిపోయింది. అయినా గ్రౌండ్‌లెవల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయా? సొంత ప్రభుత్వం వచ్చినా తమ పరిస్థితి మారలేదని ఎమ్మెల్యేలు ఎందుకు వాపోతున్నారు?


వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్లలో టీడీపీ శ్రేణులు తీవ్ర వేధింపులకు గురయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమ కేసులు, అరెస్టులతో పార్టీ నేతలు కార్యకర్తలు ఇబ్బందుల పాలయ్యారంటారు. పోలీసు సిబ్బంది అయితే వైసీపీ కేడర్‌లా వ్యవహరించిందన్న విమర్శలున్నాయి. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్నే వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించి 53 రోజులు జైల్లో పెట్టించింది.

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ఇలా ఎవరినీ వైసీపీ సర్కారు వదిలిపెట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. టీడీపీలో ముఖ్య నేతల పరిస్థితే అలా ఉంటే ఇక కార్యకర్తలపై అధికార జులుం ఎలా కొనసాగిందో వేరే చెప్పనవసరం లేదు. అయిప్పడు ప్రభుత్వం మారింది . కూటమి సర్కారు ఏర్పడి నాలుగు నెలలు గడిచిపోతుంది. కానీ ఇప్పుడు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు సొంత పార్టీ ప్రభుత్వం వచ్చినా తమ పరిస్ధితి మారలేదని వాపోతున్నారు.


Also Read:  అయోమయంలో ధర్మాన ఫ్యూచర్.. తమ్ముడిని ముంచేస్తాడా?

ఇంకా చెప్పాలంటే వైసీపీ హయాంలోనే ధైర్యంగా ఉన్నామని సెటైర్లు వేస్తున్నారు. ఇదే క్రమంలో పల్నాడు జిల్లా నరసరావు పేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నామని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చినా అణిగిమణిగి ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణుల పరిస్థితి మరీ విచిత్రంగా మారిందని ఆయన వాపోయారు.

తాజాగా నరసరావుపేటలో ఏర్పాటు చేసిన పార్టీ నేతల భేటీలో అరవిందబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఇసుక, మద్యం వైసీపీ మాఫియా చేతుల్లోనే ఉందని, ప్రతి వ్యవస్థలోనూ వైసీపీ ఉద్యోగులే ఉన్నారని, కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని అరవిందబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలు, నేతలు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. అలాంటివి కుదరదని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేల బహిరంగ వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నా వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదని తాజా ఘటనతో నిరూపితమైంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×