Bigg Boss 8 Elimination : తెలుగు బుల్లి తెరపై టాప్ రియాల్టీ షో గా దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్. ప్రస్తుతం తెలుగులో ఎనిమిదవ సీజన్ ప్రసారమవుతుంది. రెండు వారాల్లో ఈ సీజన్ ముగియనుంది. ఫినాలే ఎపిసోడ్కి ఐదు మంది మాత్రమే ఉండాలి కాబట్టి ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. 12 వ వారం యష్మీ గౌడ ఎలిమినేట్ అయ్యింది. ఇక 13వ వారం నామినేషన్ గట్టిగానే జరిగాయి. మరి ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే ఇద్దరెవరో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 13 వ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. ఈ వారం పక్కాగా డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని టాక్. నిఖిల్ మలియక్కల్, ప్రేరణ, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, జబర్దస్త్ రోహిణి, జబర్దస్త్ అవినాష్, నబీల్ అఫ్రీది తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు.. ఇక నామినేషన్స్‌లో 8 మంది నామినేట్ అయ్యారు. దాంతో ఈ వారం నామినేషన్స్‌లో విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీరాజ్, టేస్టీ తేజ, నిఖిల్, అవినాష్, నబీల్ ఉన్నారు.. ఈ వీకెండ్ ఓటింగ్ రివర్స్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓటింగ్ విషయంలో గౌతమ్ గత కొన్ని వారాలుగా టాప్ లోనే ఉన్నాడు. ఈ వారం ఓటింగ్ తారుమారు అయ్యాయి. మొదటి స్థానంలో నిఖిల్, రెండో స్థానంలోకి గౌతమ్ వచ్చేశాడు. ఇక మూడో స్థానంలో ప్రేరణ అలాగే కొనసాగింది. నాలుగో స్థానంలో విష్ణుప్రియ ఉంటే ఐదో స్థానంలో నబీల్ నిలిచాడు..ఆరో స్థానంలో అవినాష్, ఏడో స్థానంలో టేస్టీ తేజ, ఎనిమిదో స్థానంలో పృథ్వీ ఉన్నట్లు తెలుస్తుంది.
డేంజర్ జోన్లో నబీల్, టేస్టీ తేజ, పృథ్వీ ఉన్నారు. ఈ వారం టేస్టీ తేజ, పృథ్వీ ఇద్దరు ఎలిమినేట్ అవనున్నారని టాక్.. ఇవాళ, రేపు తేజ, పృథ్వీ ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని నిన్నటివరకు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ టాక్ మారింది. ఈ వారం లీస్ట్ లో ఉన్న పృథ్వీ ఎలిమినేషన్ అవుతాడా లేదా అనేది క్యూరియాసిటిగా మారింది. కన్నడ బ్యాచ్ కి బిగ్ బాస్ బయాజ్ గా ఉంటూ నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతీవారం సేవ్ చేస్తూ వస్తున్నాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది.. శనివారం ఎపిసోడ్ లో టేస్టీ తేజా ఎలిమినేట్ అవ్వగా, ఆదివారం ఎపిసోడ్ లో పృథ్వి, విష్ణు ప్రియా డేంజర్ జోన్లో ఉండగా అందులోంచి విష్ణు ప్రియా సేఫ్ అవుతుంది. పృథ్వి ఎలిమినేట్ అవుతాడని సమాచారం. ఈ ఎలిమినేషన్ కు సంబందించిన షూటింగ్ పూర్తి అయ్యింది. ఇన్ని రోజులు విష్ణు వల్లే పృథ్వి సేవ్ అయ్యాడు. తను లేకుండా ఉంటే తెలుగు వాళ్ళే హౌస్ లో టాప్ లో ఉండేవారు అని కామెంట్లతో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.. హౌస్లో డస్ట్ బిన్ వల్ల ఎంత యూజ్ ఉంటుందో విష్ణుప్రియ వల్ల కూడా అంతే యూజ్ అని ఒకరు, హౌస్ లో గ్రూప్ గా ఆడే వారికేమో ఓటింగ్ ఉంది. కానీ ఇండివిడ్యువల్ గా ఆడుతూ జెన్యున్ కంటెస్టెంట్స్ కి సరైన ఓటింగ్ లేదు. ఈ వారం తేజు, పృథ్వి డేంజర్ జోన్లో ఉన్నారు. మరి ఇద్దరు వెళ్తారేమవిన్నర్ లిస్ట్ లో నిఖిల్, గౌతమ్ పేర్లు వినిపిస్తున్నాయి. కన్నడ బ్యాచ్ కు నాగార్జున సపోర్ట్ ఎక్కువగానే ఉంది. మరి ఎవరు విన్నర్ అవుతారో చూడాలి..