BigTV English

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ విషయంలో ICC కీలక నిర్ణయం.. అక్కడే మ్యాచులు !

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ విషయంలో ICC కీలక నిర్ణయం.. అక్కడే మ్యాచులు !

 


Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పై కీలక అప్డేట్ వచ్చింది. పాకిస్తాన్… తన పంతాను నెగ్గించుకోవాలని ఎంత ప్రయత్నించినా విఫలమైంది. అయితే చివరికి హైబ్రిడ్ మోడల్ కు… పాకిస్తాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఐసీసీ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల కాబోతుందని తెలుస్తోంది.

తాజాగా హైబ్రిడ్ మోడల్ కు పాకిస్తాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు సంబంధించిన అధికారులు కూడా.. ప్రకటన చేశారు. అయితే టీమిండియా మ్యాచ్లకు మాత్రం దుబాయ్ వేదిక కానుంది. ఈ మేరకు… కొత్త కండిషన్ పెట్టింది పాకిస్తాన్. దీనికి ఐసిసి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఒకవేళ ఈ ఛాంపియన్ ట్రోఫీలో… తొలి సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ కు టీమిండి అర్హత సాధిస్తే… కచ్చితంగా దుబాయిలో ఈ రెండు మ్యాచ్లను నిర్వహించాల్సి ఉంటుంది.


ఒకవేళ టీమిండియా క్వాలిఫై కాకపోతే… సెమీఫైనల్ అలాగే ఫైనల్ మ్యాచ్లు రెండు కూడా… పాకిస్తాన్లో జరగనున్నాయి. ఇక దుబాయ్ లో జరిగే టీమిండియా మ్యాచ్లో కోసం వచ్చే డబ్బును ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో… పంచుకోకూడదని… ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు.. పాకిస్తాన్ కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పాకిస్తాన్ కండిషన్లలో కొన్నిటికి ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.

 

ఇది ఇలా ఉండగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య.. మొన్నటి వరకు వార్ జరిగిన సంగతి తెలిసిందే. తమ దేశానికి ఇండియా రావాల్సిందేనని పాకిస్తాన్ పట్టుబట్టింది. కానీ దానికి… టీమిండియా అలాగే భారత క్రికెట్ నియంత్రణ మండలి అస్సలు ఒప్పుకోలేదు. భారతదేశ ప్రభుత్వం కూడా దీనికి అంగీకారం తెలపలేదు. కేవలం ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి పాకిస్తాన్ క్రికెటర్లు అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు సంబంధించిన సభ్యులు మాట్లాడారు.

 

 

కచ్చితంగా టీమిండియా మా దేశానికి రావాల్సిందేనని.. లేకపోతే టీమిండియా లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలని.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా మీడియా ముందే వెల్లడించడం జరిగింది. కానీ టీమిండియా ఆడకపోతే.. ఐసీసీ ట్రోఫీ నిర్వహించి వృధా అవుతుంది. టీమిండియా లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే ఖచ్చితంగా ఐసిసికి నష్టం వాటిల్లుతుంది. ఆదాయం కూడా పెద్దగా రాదు. టీమిండియా ఆడితేనే స్పాన్సర్లు కూడా..ముందుకు వస్తారు.

 

అందుకే టీమిండియా మాట మాత్రమే ఐసీసీ పాలకమండలి విన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే హైబ్రిడ్ మోడల్ ను తెరపైకి తీసుకువచ్చింది ఐసీసీ పాలక మండలి. టీమిండియా లేకున్నా కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని ఐసిసి అధికారులు కొంతమంది పాకిస్తాన్ జట్టును హెచ్చరించారట. మీరు లేకుండా దక్షిణాఫ్రికా లేదా దుబాయ్ లో టోర్నమెంటు నిర్వహిస్తామని అధికారులు తెలిపారట. అయితే ఇండియాకు అండగా ఐసీసీ పాలకమండలి నిలవడంతో చేసేదేమీ లేక పాకిస్తాన్ కూడా హైబ్రిడ్ మోడల్ కు ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇక దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×