BigTV English

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో 8 వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలు.. మళ్లీ వీళ్లేనా?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో 8 వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలు.. మళ్లీ వీళ్లేనా?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు హౌస్ లో రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాడు బిగ్ బాస్.. మొన్నటిదాకా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 4 హౌస్ లోకి రాబోతున్నారని చెప్పాడు. కానీ ఇప్పుడు అంతకు మించి హౌస్ లోకి 8 వైల్డ్ కార్డులు ఇచ్చేలా ప్లాన్ చేశాడు. ఎనిమిదో సీజన్‌లో వైల్డ్‌ కార్డులను తీసుకురావాలన్న ఆలోచన ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాదు. సీజన్‌ ప్రారంభమయ్యే రోజు కేవలం 14 మందినే హౌస్‌లోకి పంపించి మిగిలినవి వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉన్నట్లు పేర్కొన్నాడు బిగ్ బాస్. ఇప్పుడు ఐదువారాలు పూర్తి అయ్యాయి. 6 గురు హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఈ వీక్ కు 8 మంది మాత్రమే ఉన్నారు. అందుకే ఈ వీక్ హౌస్ లోకి 8 మంది వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి రాబోతున్నట్లు ప్రచారంలో ఉంది..


కేవలం 8 మందితో హౌస్ లో రాణించాలంటే కష్టం.. వీరి మధ్య గొడవలు తప్ప టాస్క్ లు జరగవు. ఇక మంది ఉంటే మజా వస్తుందని ప్లాన్ చేసుకున్న బిగ్ బాస్ కొత్తవాళ్లను తీసుకొస్తే వర్కవుట్‌ అవుతుందో, లేదోనని డౌట్‌ పడ్డారో ఏమో కానీ పాత సీజన్ల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేశారు. ఒక్కో సీజన్‌లో నుంచి ఒక్కో ఆణిముత్యాన్ని తీసుకుని హౌస్‌లోకి పంపించనున్నారు.. హరితేజ, గంగవ్వ, గౌతమ్‌ కృష్ణ, నయని పావని, రోహిణి, అవినాష్‌, టేస్టీ తేజ, మెహబూబ్‌ దిల్‌సేను ఎంపిక చేసినట్లు టాక్.. గంగవ్వ టాస్క్ లు ఆడటం కష్టమే. అందులోను ఆమె హౌస్ లో ఉండటం కష్టమే. అందుకే ఎక్కువగా హాట్ బ్యూటీస్ ను హౌస్ లోకి దించుబోతున్నాడు బిగ్ బాస్..

గౌతమ్ కృష్ణ. సీక్రెట్‌రూమ్‌కు వెళ్లి వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్‌గా మళ్లీ హౌస్‌లో అడుగుపెట్టాడు. ముచ్చటగా మూడోసారి హౌస్‌లోకి వెళ్లబోతున్న ఇతడు ఎలా మెప్పిస్తాడో చూడాలి. రోహిణి, అవినాష్‌, హరితేజల గురించి భయపడాల్సిన పనేలేదు. వీళ్లు రచ్చ చెయ్యడంతో పాటుగా ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ ఉన్నట్లే అనే టాక్ వినిపిస్తుంది. హాట్ బ్యూటీ నయని పావని వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఒక్కవారంలోనే ఎలిమినేట్‌ అయింది. కానీ వారం రోజుల్లోనే తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది. మరి ఈసారైనా ఎక్కువవారాలు ఉంటుందేమో చూడాలి. టేస్టీ తేజా, మెహబూబ్ లు ఎలా ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి.. మరి వీరంతా ఈ సీజన్ కు హైఫ్ ను తీసుకొస్తారేమో చూడాలి.. ఇక ఐదు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్. ఇప్పుడు ఆరో వారంలో కొత్త వాళ్ళతో కొనసాగుతుంది.. ఆరో వారం నామినేషన్స్ ఆసక్తి మారాయి.. ఈ వారం తప్పించుకున్న విష్ణు ప్రియా వచ్చే వారం బయటకు వెళ్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. చివరికి బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తాడేమో చూడాలి.. ఏది ఏమైనా వైల్డ్ ఎంట్రీల తర్వాత హౌస్ లో రచ్చ మాములుగా ఉండదని తెలుస్తుంది..


Related News

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Big Stories

×