BigTV English

Viral News: ట్రైన్ ఫర్ సేల్.. సీరియస్ బయ్యర్స్ మాత్రమే ట్రై చేయండి- సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో!

Viral News: ట్రైన్ ఫర్ సేల్.. సీరియస్ బయ్యర్స్ మాత్రమే ట్రై చేయండి-  సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో!

Train For Sale viral Video: పాత వస్తువులను అన్ లైన్ ద్వారా అమ్మడం కామన్. ఓఎల్ఎక్స్ లాంటి  వేదికల్లో సెకెండ్ హ్యాండ్ కార్లు, బైకులు, ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కెమెరాలు సహా పలు వస్తువులను అమ్మకానికి పెడతారు. గుండు పిన్నుల నుంచి పెద్ద పెద్ద వాహనాలకు వరకు సేల్ చేసుకునే అవకాశం ఉంది. నిత్యం ఆన్ లైన్ వేదికగా ఎన్నో వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. కానీ, ఓ యువకుడు పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఏకంగా ‘ట్రైన్ ఫర్ సేల్’ అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.


2007 మోడల్.. 2027 వరకు చెల్లుబాటు

‘ట్రైన్ ఫర్ సేల్’ అనే ఫన్నీ వీడియోను @shiv_shukla_5005 అనే యూజర్ ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు. సాయంత్రం వేళ, ఓ స్టేషన్ దగ్గర పట్టాల మీద నిల్చున్న ట్రైన్ వీడియో తీసి.. రైలును అమ్ముతున్నట్లు వెల్లడించాడు. ఈ  రైలు 2007 మోడల్ అని..  2027 పేపర్ వర్క్ చెల్లుబాటు అవుతుందని వివరించాడు. రైల్లో కొంత డెంట్,  పెయింట్‌ వర్క్ చేయించాల్సి ఉందన్నాడు. కాస్త మసకబారిన హెడ్‌ లైట్లను మార్చే పని ఉందన్నాడు. ఇంజిన్‌ లో చిన్న సమస్యలు ఉన్నాయన్నాడు. అయితే, రైలు కండీషన్ చాలా బాగుందన్నాడు. ఇన్సూరెన్స్ అయిపోయిందని, కొనుగోలు దారులు రెన్యువల్ చేయించుకోవచ్చన్నాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెటిజన్లకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది.


Read Also: బస్సును ఢీ కొట్టబోయిన రెండు రైళ్లు జస్ట్ మిస్.. అంతా గేట్ మెన్ నిర్వాకం..

సుమారు 4 మిలియన్ల వ్యూస్

‘ట్రైన్ ఫర్ సేల్’ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. సుమారు 4 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ వీడియోకు నెటిజన్లు ఫుల్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ‘ట్రాక్స్ తో కలిపి దీని ధర ఎంత?” అంటూ ఓ వ్యక్తి కామెంట్స్ చేయగా, “2015-16 మోడల్ ఉంటే చెప్పండి. ఇది కొంచెం పాతదిగా అనిపిస్తుంది” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ప్రస్తుతం మీరు చెప్పిన మైనర్ రిపేర్లను చేయించిన తర్వాత చెప్పండి. నేను కొనుగోలు చేస్తాను” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఇంతకీ ఈ రైలు మైలేజీ ఎంత ఇస్తుంది?” అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఫన్నీ కామెంట్స్ తో  ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ఫన్ జెనరేట్ చేస్తుంది. యువకుడి క్రియేటివ్ ఆలోచనను అందరూ మెచ్చుకుంటున్నారు.

భారతీయ రైల్వే సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. ప్రతి రోజూ సుమారు 2 కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు తీసుకెళ్తున్నాయి రైల్వే సర్వీసులు. నిత్యం కోట్లాది రూపాయల విలువ చేసే సరుకు రవాణా కొనసాగుతున్నది. ఇండియాలో అన్ని రైళ్లు ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి. విదేశాల్లో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు రైళ్లను నడుపుతాయి.

Read Also: 8 వేల డ్రోన్లతో కళ్లు చెదిరే లేజర్ షో.. గిన్నీస్ రికార్డులూ బద్దలు, అలా ఎలా చేశారయ్యా బాబు!

Related News

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Big Stories

×