BigTV English

OTT Movie : కులం పేరుతో బాయ్ ఫ్రెండ్ ను దూరం పెట్టే అమ్మాయి.. కడుపుబ్బా నవ్వించే అచ్చ తెలుగు కామెడీ మూవీ

OTT Movie : కులం పేరుతో బాయ్ ఫ్రెండ్ ను దూరం పెట్టే అమ్మాయి.. కడుపుబ్బా నవ్వించే అచ్చ తెలుగు కామెడీ మూవీ

OTT Movie : ఓటిటిలో ఇప్పటిదాకా ఎన్నో కామెడీ సినిమాలు వచ్చాయి. కానీ అన్ని సినిమాలను చూసి కడుపుబ్బా నవ్వుకోలేము. ఇలా కామెడీ అంటూ ప్రచారం చేసుకునే కొన్ని సినిమాలు మాత్రమే చూసినంత సేపు పొట్ట పగిలేలా మంచి కామెడీ టైమింగ్ తో ఉంటాయి. అలాంటి సినిమాలను ఇష్టపడే వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీ లోకి వెళ్తే…

హీరో కార్తీక్ అమలాపురంలోనే పుట్టి పెరుగుతాడు. అతనితో పాటు చిన్ననాటి స్నేహితులు సుబ్బు, హరి కూడా అక్కడే పుట్టి పెరుగుతారు. ఈ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. అయితే కార్తీక్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. మరోవైపు సుబ్బు, హరి ఊర్లోనే జీవితాన్ని నెట్టుకొస్తారు. కరోనా లాక్డౌన్ టైంలో ఊరికి వచ్చిన కార్తీక్ స్నేహితులతో సరదాగా గడుపుతాడు. ఈ సమయంలోనే అతను పక్క ఊరికి చెందిన ఫంక్ పల్లవి అనే అమ్మాయిని చూసి మనసు పడతాడు. కానీ ఇక్కడే కులం అడ్డు వస్తుంది. కార్తీక్ తన కులానికి చెందిన వ్యక్తి అనుకుని ఇష్టపడుతుంది హీరోయిన్. కానీ ఆ తర్వాత విషయం తెలిసి ఆ అమ్మాయి దూరమవుతుంది. పైగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. దీంతో వీరిద్దరి పెళ్లి చేయడానికి కార్తీక్ స్నేహితులు వేసే ప్లాన్లు హీరో తండ్రికి తెలిసిపోతాయి. మరి హరి, సుబ్బు ప్లాన్ తెలిసిన హీరో తండ్రి ఏం చేశాడు? అసలు వాళ్ళేం ప్లాన్ చేశారు? హీరో తండ్రి, హీరోయిన్ తండ్రికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరికి కార్తీక్ పల్లవిని పెళ్లి చేసుకున్నాడా లేదా? నిజంగానే ఆమె కులం కారణంగా హీరోను దూరం పెట్టిందా?అనే విషయాలు తెలియాలంటే హాయ్ మూవీని చూడాల్సిందే. చెప్పుకోవడానికి స్టోరి సీరియస్ గానే ఉన్నా చూస్తున్నంత సేపు కడుపుబ్బా నవ్వుకుంటారు.


ఏ ఓటీటీలో ఉందంటే.. 

‘మ్యాడ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన రెండో సినిమా ‘ఆయ్’. జి2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీతో అంజి కె మణిపుత్ర డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఇందులో నైని సారిక హీరోయిన్ గా నటించగా, చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘ఆయ్’ మూవీ మిస్టర్ బచ్చన్, ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ సినిమాలకు పోటీగా థియేటర్లలోకి దిగి, మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. పల్లెటూరి వాతావరణం, చిన్ననాటి స్నేహం ప్రధానంగా సాగే ఈ సినిమాలో వెటకారం కలిసిన డైలాగ్స్, కామెడీ, అనుబంధాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ముఖ్యంగా రాజ్ కుమార్ కసిరెడ్డి కామెడీ బాగుంటుంది. ఇక క్లైమాక్స్ ని అస్సలు మిస్ కావొద్దు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ మరో ఎత్తు. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ ఇప్పటిదాకా ఎవరైనా సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి.

 

Tags

Related News

OTT Movie : స్టార్ హీరోలెవ్వరూ చేయని సాహసాలు… హర్రర్ నుంచి సస్పెన్స్ దాకా మమ్ముట్టి కెరీర్ బెస్ట్ మూవీస్ ఇవే

OTT Movie : ఆడవాళ్లందరినీ వదిలేసి బొమ్మతో… చివరికి ఆ పని కూడా దాంతోనే… ఊహించని ట్విస్టులున్న థ్రిల్లర్ మూవీ

OTT Movie : ఈ అమ్మాయిని ప్రేమిస్తే కుక్క చావే… మగవాళ్ళను దగ్గరకు రానివ్వని దెయ్యం… గుండె గుభేల్మనిపించే హర్రర్ మూవీ

OTT Movie : క్షుద్ర పూజలతో మేల్కొలుపు… అంతులేని ఆకలున్న దెయ్యం ఇది… కామెడీతో కితకితలు పెట్టే తెలుగు హర్రర్ మూవీ

Chiranjeevi : భారీ ధరకు అమ్ముడుపోయిన మెగా 157 ఓటీటీ హక్కులు.. అక్కడే స్ట్రీమింగ్!

Telugu Web Series: ప్రేమలో తొందరపాటు.. ప్రియుడిని ముక్కలు చేసి డ్రమ్ములో వేసే ప్రియురాలు, కొత్త సీరిస్ సిద్ధం

Big Stories

×