BigTV English

Bigg Boss AgniPariksha: ఆదిరెడ్డి రివ్యూపై శ్రీజ దమ్ము రియాక్షన్.. ఇకనైనా మారండయ్యా!

Bigg Boss AgniPariksha: ఆదిరెడ్డి రివ్యూపై శ్రీజ దమ్ము రియాక్షన్.. ఇకనైనా మారండయ్యా!

Bigg Boss AgniPariksha: బిగ్ బాస్ సీజన్ 9 కోసం ఈసారి సరికొత్తగా షోపై హైప్ పెంచడం కోసం కామనర్స్ ని కూడా హౌస్ లోకి తీసుకురాబోతున్నారు. అంతేకాదు ఈసారి రెండు హౌస్ లు ఉంటాయని కూడా హోస్ట్ నాగార్జున చెప్పుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ 9లోకి కామనర్స్ ఎంట్రీ కోసం ఓ 45 మందిని సెలెక్ట్ చేసి.. అందులో 5 మందిని హౌస్ లోకి పంపడానికి అగ్నిపరీక్ష పేరుతో టెస్ట్ పెట్టారు. అయితే ఈ అగ్నిపరీక్ష షోకి కూడా అభిజిత్,బిందు మాధవి, నవదీప్ లను జడ్జిలుగా.. శ్రీముఖిని యాంకర్ గా పెట్టి ఈ మినీ షో రన్ చేస్తున్నారు. ఈ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన వారు డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు. అయితే అగ్నిపరీక్ష షోలో మంచి హైప్ తెచ్చుకున్న కామనర్ గా శ్రీజ దమ్ము పేరు తెచ్చుకుంది.


అగ్ని పరీక్షలో పటాస్ లా పేలిన శ్రీజ దమ్ము..

ఈమె చూడ్డానికి చిన్నపిల్లలా ఉన్నప్పటికీ.. ఇచ్చిన టాస్కుల్లో ఒక పటాస్ లాగా పేలింది. పెట్టిన ప్రతి ఒక్క టెస్ట్ లో పాస్ అవ్వడమే కాకుండా చాలా తెలివితో ఆడింది. శ్రీజ ఆట చూసిన చాలామంది నెటిజన్స్ మెచ్చుకున్నారు కూడా.. ప్రస్తుతం ఈమె హౌస్ లోకి ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలామంది యూట్యూబర్స్ ఆమెతో ఇంటర్వ్యూలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు. ఇందులో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీజ ఆదిరెడ్డి రివ్యూ పై షాకింగ్ కామెంట్లు చేసింది.. ఆదిరెడ్డి రివ్యూ గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతారని ఇంటర్వ్యూవర్ శ్రీజ ని అడగగా..

ఆదిరెడ్డి రివ్యూల పై శ్రీజ రియాక్షన్..


ఆది రెడ్డి గారు బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుండే రివ్యూ ఇస్తూ ఫేమస్ అయ్యారు. ఆయన నా గురించి ఇచ్చిన రివ్యూ కి నేనేమీ ఫీల్ అవ్వడం లేదు.ఎందుకంటే ఆయన మంచి ఉంటే మంచి.. చెడు ఉంటే చెడు చెప్పేస్తారు. ఏదైనా పాజిటివ్, నెగిటివ్ రెండు చెబుతారు. ఇక ఆదిరెడ్డి ఇచ్చిన రివ్యూని మా వాళ్ళు చూసి నీ గురించి ఎంత అద్భుతంగా చెప్పాడో చూడు అని నన్ను అన్నారు. ఇక ఆయనే కాకుండా కొంతమంది యూట్యూబర్లు కూడా నా గురించి చెప్పిన వీడియోలు చేస్తుంటే మా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటూ శ్రీజ దమ్ము చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ లోకి వెళ్ళాక మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు.. మీ స్ట్రాటజీ ఏంటి అని అడగగా.. స్ట్రాటజీ అంటూ ఏమీ లేదు. ఫ్లోలో ఏది జరిగితే అది చేసేయడమే.

హౌస్ లో సత్తా చాటబోతున్న ముద్దుగుమ్మ..

ఇలా ఉండాలి అలా ఉండాలి అని మాస్క్ వేసుకొని ఏమి చేయను. డైరెక్ట్ గా అటాక్ చేయడమే. టాస్క్ ఇస్తే చేయడం.. గేమ్స్ ఆడటం..ఇలా ప్రతి ఒక్కటి ఫ్లోలోనే జరిగిపోతాయి. నాకంటూ స్ట్రాటజీ ఏమీ లేదు. రియాల్టీ గానే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి వెళ్లి వచ్చాక వైజాగ్ లో తిరిగేటప్పుడు నన్ను చాలామంది గుర్తు పడుతున్నారని,ఆ టైంలో చాలా హ్యాపీగా ఉంది అంటూ శ్రీజ దమ్ము చెప్పుకొచ్చింది.. మరి ఈ వైజాగ్ చిన్నది బిగ్ బాస్ సీజన్ 9 లో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే రివ్యూ ఇచ్చే వారిపై శ్రీజా చేసిన కామెంట్లు చూసి కొంతమంది నెటిజెన్స్ ఇకనైనా మారండి అంటూ కామెంట్లు చేస్తున్నారు ఎందుకంటే ఈమె మంచిని, చెడును రెండింటిని సమానంగా తీసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఎవరైనా నెగిటివ్ రివ్యూ ఇస్తే కొంత మంది తట్టుకోలేరు. అందుకే ఇలాంటి వాళ్లు ఈమె మాటలు ఇకనైనా దృష్టిలో పెట్టుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:Bigg Boss AgniPariksha: అగ్ని పరీక్ష అంటూ అవమానిస్తున్నారు.. బిగ్ బాస్‌పై సిద్దిపేట్ మోడల్ ఫైర్

Related News

Bigg Boss AgniPariksha: అగ్ని పరీక్ష అంటూ అవమానిస్తున్నారు.. బిగ్ బాస్‌పై సిద్దిపేట్ మోడల్ ఫైర్

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ నుంచి బిగ్ సర్ప్రైజ్… మరో మూడు రోజుల్లోనే

Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్లోకి మరో లేడీ విలన్.. శోభాను మించి మెప్పిస్తుందా?

Bigg Boss AgniPariksha: 15 కాస్త 13 అయింది.. ట్విస్ట్ తో నరాలు తెగిపోయేలా ఉన్నాయే!

Bigg Boss Agnipariksha : మొన్న ఎవడ్రా.. ఇప్పుడేమో ఇలా.. మనకేంటిరా ఈ ఖర్మ..

Big Stories

×