BigTV English

CIBIL Score: క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేస్తే సిబిల్‌ స్కోరు తగ్గుతుందా? పూర్తి వివరాలు!

CIBIL Score: క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేస్తే సిబిల్‌ స్కోరు తగ్గుతుందా? పూర్తి వివరాలు!

CIBIL Score: మనలో చాలా మందికి క్రెడిట్‌ కార్డు ఉంటుంది. ఆ కార్డు వల్ల ఒకవైపు ప్రయోజనం ఉంటే, మరోవైపు ఎప్పటికప్పుడు బిల్లు చెల్లించాల్సిన భారం ఉంటుంది. దీంతో కొంతమంది ఈ కార్డు పనికిరాదు, క్లోజ్‌ చేస్తే మంచిదని ఆలోచిస్తారు. కానీ, అలాంటి నిర్ణయం తీసుకునే ముందు ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేస్తే సిబిల్‌ స్కోరు తగ్గుతుందా? దాని ప్రభావం ఎలా ఉంటుంది? అని. నిజంగా క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే సిబిల్ స్కోరు తగ్గుతుందా? లేదా? ఇప్పుడు తెలుసుకుందాం.


సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?

సిబిల్‌ స్కోరు అంటే, మనం ఎప్పటికప్పుడు తీసుకునే లోన్లు, క్రెడిట్‌ కార్డుల బిల్లులు, వాటి రీపేమెంట్లు అన్నీ సిబిల్‌ రిపోర్టులో రికార్డ్‌ అవుతాయి. ఈ రిపోర్ట్‌ ఆధారంగానే మనకు ఒక స్కోరు సుమారు 300 నుంచి 900 మధ్య ఇస్తారు. ఆ స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే, బ్యాంక్‌లు మనకి లోన్‌ ఇవ్వడానికి అంత త్వరగా ఒప్పుకుంటాయి. 750కి పైగా స్కోరు అంటే చాలా మంచి స్కోర్‌గా బ్యాంకులు భావిస్తారు. ఈ స్థాయి స్కోర్‌తో బ్యాంక్ సిబ్బంది మనకు లోన్ వెంటనే ఒకే చేస్తారు.


క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేస్తే ఏమవుతుంది?

మంచి స్కోర్ వున్న కూడా క్రెడిట్ కార్డు ఉపయోగం లేదని మనలో చాలా మంది ఏళ్ల తరబడి వాడుతున్న క్రెడిట్‌ కార్డును ఒక్కసారిగా క్లోజ్‌ చేస్తే, మీ క్రెడిట్‌ హిస్టరీ తగ్గిపోతుంది. దీని ప్రభావం మీరు తీసుకునే లోన్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మీ క్రెడిట్ హిస్టరీని బ్యాంక్‌లు పరిశీలిస్తే పెద్దగా హిస్టరీ లేదని ఆలోచించే అవకాశం ఉంటుంది. ఈ చిన్న నిర్ణయంతో స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.

Also Read: Jio Data Offer: జియో సంచలన ఆఫర్.. రూ.11 తో 10GB డేటా ప్లాన్ పూర్తి వివరాలు ఇదిగో!

క్రెడిట్‌ లిమిట్‌ శాతం

మీ దగ్గర రెండు కార్డులు ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్కటి ఒక లక్ష రూపాయల లిమిట్‌ కలిగివుంటే, మీ దగ్గర మొత్తం రెండు లక్షల లిమిట్‌ ఉంటుంది. అందులో మీరు ప్రతినెలా యాభై వేల రూపాయల వరకు వాడితే, మీ ఖర్చు శాతం 25 శాతం అవుతుంది. కానీ మీరు ఒక కార్డు క్లోజ్‌ చేస్తే లిమిట్‌ ఒక్క లక్షకు పడిపోతుంది. అదే యాభై వేల ఖర్చు చేస్తే శాతం 50కి పెరుగుతుంది. ఇది బ్యాంకులకు మీరు బాగా రిస్క్‌ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఈ కారణంగా సిబిల్‌ స్కోరు తగ్గిపోవచ్చు. ఇక రెండో అంశం, మీ క్రెడిట్‌ హిస్టరీ పొడవు. మీరు ఏళ్ల తరబడి వాడుతున్న పాత క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేస్తే, మీ రిపోర్టులో ఉన్న పాజిటివ్‌ రికార్డు తగ్గిపోతుంది. ఆ కార్డు ద్వారా మీరు బిల్లులు ఎప్పటికప్పుడు టైమ్‌కి చెల్లించిన మంచి హిస్టరీ కూడా క్రమంగా మాయమవుతుంది.

రెండింటికి మించి క్రెడిట్‌ కార్డులు ఉంటే క్లోజ్‌ చేయొచ్చు

మీ దగ్గర 4–5 కార్డులు ఉంటే, వాటిలో రెండు మూడింటి వాడకం లేకపోతే క్లోజ్‌ చేయడం మంచిదే. కానీ కనీసం ఒక పాత క్రెడిట్‌ కార్డు మాత్రం కొనసాగించడం బెటర్‌.

లోన్లు లేదా పెద్ద ఫైనాన్షియల్‌ ప్లాన్స్‌ ముందు క్లోజ్‌ చేయకూడదు

మీరు త్వరలో హోమ్‌ లోన్‌ లేదా కారు లోన్‌ తీసుకోవాలని అనుకుంటే, అప్పుడు క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేస్తే మీ స్కోరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేయడం వల్ల స్కోరు ఒక్కసారిగా పడిపోదు. అది కొంచెం మాత్రమే తగ్గుతుంది. ఒకసారి క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేసిన తర్వాత మీ సిబిల్‌ స్కోరు కొంచెం పడిపోయినా అది శాశ్వతం కాదు. మీరు తరువాత కూడా మీకు ఉన్న ఇతర క్రెడిట్‌ కార్డుల బిల్లులు సమయానికి చెల్లిస్తూ, తీసుకున్న పర్సనల్‌ లోన్లు లేదా ఇతర రకాల లోన్లు సమయానికి చెల్లిస్తూ ఉంటే, మీ స్కోరు క్రమంగా మళ్లీ పెరుగుతుంది.

Related News

Jio Data Offer: జియో సంచలన ఆఫర్.. రూ.11 తో 10GB డేటా ప్లాన్ పూర్తి వివరాలు ఇదిగో!

Gold Rate Dropped: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా దిగొస్తున్న బంగారం ధరలు..

New Gst: కొత్త జీఎస్టీ అమలు అప్పటినుంచే.. భారీగా తగ్గనున్న ఆ వస్తువుల ధరలు, ఇది కదా కోరుకున్నది!

Indian Beer Brands: మన సింబా బీరు ఇక వరల్డ్ ఫేమస్.. ఈ అవార్డును ఊహించి ఉండరు

Smartphones: ఈ వారం లాంచ్‌ కానున్న నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లు! తెలుసుకోవాలని ఉందా?

Big Stories

×