Akshay kumar:ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay kumar) తాజాగా తాను నటించిన ‘స్కై ఫోర్స్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హిందీ బిగ్ బాస్ సీజన్ 18 (Bigg boss 18) గ్రాండ్ ఫినాలేకి విచ్చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman khan) హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి అక్షయ్ కుమార్ తో పాటు వీర్ పహారియా (Veer paharia) చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అయితే కార్యక్రమం ఇంకా ప్రారంభం కాకముందే అక్షయ్ షో నుంచి బయటకు రావడంతో.. ఈ విషయం కాస్త వివాదాస్పదమయింది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఆలస్యం వల్లే అక్షయ్ బయటకు వచ్చేసారు అనే వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి.దీంతో అక్షయ్ కుమార్ కి పెద్ద ఎత్తున అవమానం జరిగింది అంటూ ఎక్స్ లో పోస్టులు దర్శనమిచ్చాయి.
రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన అక్షయ్ కుమార్..
ఇక వార్తలు గత రెండు రోజులుగా తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఈ వార్తలు కాస్త అక్షయ్ కుమార్ వరకు చేరడంతో.. ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని క్లారిటీ ఇచ్చారు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. “సల్మాన్ ఖాన్ సెట్ కి 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. అయితే ఆయన ఆలస్యంగా రావడం వల్ల నేను బయటకు రాలేదు. నా సినిమా షూటింగ్ కి టైం కావడంతోనే బిగ్ బాస్ సీజన్ 18 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మొదలు పెట్టకముందే వచ్చేసాను. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో మాట్లాడాను. నేను వచ్చేసినా సరే నా సినిమా స్కై ఫోర్స్ చిత్రాన్ని ప్రచారం చేయడం కోసం వీర్ పహారియా బిగ్ బాస్ సెట్ లోనే ఉన్నారు. ఆయన మా సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొని సినిమాపై హైప్ తీసుకొచ్చారు” అంటూ అక్షయ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.మొత్తానికైతే సల్మాన్ ఖాన్ ఆలస్యంగా రావడం వల్ల అక్షయ్ కుమార్ బయటకు వెళ్ళిపోయాడు అంటూ వచ్చిన వార్తలకు చెక్ పడింది అని చెప్పవచ్చు.
రియల్ హీరో అంటూ సైఫ్ పై ప్రశంస..
అదే ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్(Saif Alikhan) పై జరిగిన కత్తిదాడి గురించి కూడా మాట్లాడారు.. “సైఫ్ అలీఖాన్ ఈ దాడి నుంచి చాలా సురక్షితంగా బయటపడడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రమాదం నుంచి కోలుకోవడంతో ఇండస్ట్రీ కూడా ఊపిరి పీల్చుకుంది. తన కుటుంబం కోసం పోరాడిన రియల్ హీరో.. మేమిద్దరం కలిసి గతంలో ‘మే ఖిలాడి తు అనారీ’ అనే సినిమా చేశాము. అయితే మళ్లీ మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా తీయాల్సి వస్తే.. ‘తు ఖిలాడి మే అనారీ’ అని మార్చాలి” అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. మొత్తానికైతే అటు రూమర్స్ కి క్లారిటీ ఇస్తూనే.. మరొకవైపు తోటి నటుడి ధైర్య సాహసాల గురించి మెచ్చుకుంటూ అతడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు అక్షయ్ కుమార్. ఇక మరొకవైపు అక్షయ్ కుమార్ 25 ఏళ్ల తర్వాత ప్రముఖ హీరోయిన్ టబు (Tabu) తో కలిసి ‘భూత్ బంగ్లా’ అనే సినిమాలో నటిస్తున్నారు.