Indraja Shakar:ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడంతోనే గుడ్ న్యూస్ చెబుతూ ఫ్యాన్స్ ని ఆశ్చర్య పరుస్తున్నారు. అలా టాలీవుడ్ లో ‘క’ అనే మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిన కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) కూడా తాజాగా తండ్రి కాబోతున్నట్టు అఫీషియల్ గా ఈ విషయాన్ని బయటపెట్టారు. 2019లో “రాజావారు రాణిగారు” సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య ఘోరక్ (Rahasya ghorak) ని గత ఏడాది ఆగస్టులో వివాహం చేసుకున్న కిరణ్ అబ్బవరం.. తాజాగా తండ్రి కాబోతున్నాను అనే విషయాన్ని చెప్పి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. అయితే తాజాగా మరో తమిళ లేడీ కమెడియన్ కూడా పండంటి బాబుకు జన్మనిచ్చింది.
పండంటి బాబుకు జన్మనిచ్చిన ఇంద్రజ శంకర్..
ఆమె ఎవరో కాదు.. తమిళ హీరో విజయ్ దళపతి (Vijay dhalapathy) హీరోగా నటించిన ‘బిగిల్’ సినిమాలో నటించిన ఇంద్రజ శంకర్ (Indraja shankar). ఈమె లేడీ కమెడియన్ మాత్రమే కాదు.. తమిళ నటుడు రోబో శంకర్ (Robo Shankar) కూతురు. అలాగే గత ఏడాది తమ ఫ్యామిలీకి ఎంతో సన్నిహితుడు అయినటువంటి డైరెక్టర్ కార్తీక్ (Karthik)ని ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఇంద్రజ శంకర్ పెళ్లయ్యాక కూడా పలు సినిమాల్లో,పలు టీవీ షోలలో పాల్గొని ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంది. అయితే బుల్లితెర మీద ఓ షో చేస్తున్న క్రమంలోనే తాను గర్భవతిని అయ్యానంటూ గుడ్ న్యూస్ చెప్పి, ఆ షో నుండి తప్పకుంది ఇంద్రజ. ఇకపోతే సినిమాల్లో యాక్టివ్ గా లేకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన బేబీ బంప్ ఫోటోలను, వీడియోలను, సీమంతం ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకి టచ్ లోనే ఉంది. అయితే తాజాగా ఇంద్రజ శంకర్ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా ఇంద్రజ శంకర్ భర్త కార్తీక్ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఇక ఈ పోస్టులో ఏముందంటే.. ఇంద్రజ శంకర్ తన భర్త కార్తీక్ ఇద్దరి చేతులతో పాటు తమకి పుట్టిన బాబు చేయి కూడా కనిపిస్తోంది. అలా ముగ్గురు చేతులకు సంబంధించిన ఫోటో పెట్టి బ్లెస్స్డ్ విత్ బేబీ బాయ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఇంద్రజ శంకర్ కి బాబు పుట్టాడు అని చాలామంది సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియాలోని ఆమె అభిమానులు కూడా కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ కార్తీక్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
పాగల్ ద్వారా తెలుగు తెరకు పరిచయం..
ఇక ప్రముఖ తమిళ నటుడు రోబో శంకర్ కూతురుగా ఇండస్ట్రీలో ఫేమస్ అయిన ఇంద్రజ శంకర్, పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆమె కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ తన యాక్టింగ్ తో ఎంతోమందిని ఆకట్టుకుంది.అలా బిగిల్, విరుమాన్ వంటి తమిళ సినిమాల్లో చేసింది. అలాగే విశ్వక్ సేన్ (Vishwak sen ) నటించిన ‘పాగల్’ అనే తెలుగు సినిమాలో కూడా విశ్వక్ సేన్ లవర్స్ లో ఒకరిగా నటించింది. సినిమాలతో పాటు మరోవైపు బుల్లితెర పై పలు షోలలో కూడా ఇంద్రజ శంకర్ పాల్గొనేది.