AgniPariksha: దాదాపు 45 మంది సామాన్యులకు చిత్ర విచిత్రమైన టాస్క్ లు నిర్వహించి.. అందులో శారీరకంగా, మానసికంగా , ఎమోషనల్ గా వారిలోని బలాబలాలను బయటకు తీసి ఐదు మందిని బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్ లోకి పంపించబోతున్నారు. అందులో భాగంగానే ‘అగ్నిపరీక్ష’ అంటూ ఒక మినీ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 22న ప్రారంభమైన ఈ షో సెప్టెంబర్ 5 వరకు జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే 10 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షోలో.. అటు సామాన్యులు కూడా ఎవరికి వారు తమ స్ట్రాటజీ చూపిస్తూ హౌస్ లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో ఒక మోసం – నర్సయ్య తాత
ఇదిలా ఉండగా తాజాగా అగ్నిపరీక్ష షోలోకి అడుగుపెట్టిన 45 మందిలో ఒక వ్యక్తి ఇప్పుడు జడ్జ్ నవదీప్ పై ఫైర్ అవుతూ బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంతా మోసం అంటూ సంచలన కామెంట్లు చేశారు. అందుకు సంబంధించిన ఇంస్టాగ్రామ్ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఆయన ఎవరో కాదు ANN నర్సయ్య. జానపద కళలకు ఊపిరి పోస్తూ.. అగ్నిపరీక్ష షోలో రైతులకు సంబంధించిన పాటలు పాడడమే కాకుండా తన శారీరక ప్రదర్శన కూడా ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే అలాంటి ఈయన హౌస్ లో ఒదగలేడు అని చెప్పి బయటకు పంపించిన విషయం తెలిసిందే.
నవదీప్ గుట్టు రట్టు చేసిన నర్సయ్య తాత..
అలాంటి ఈయన ఇప్పుడు నవదీప్ గుట్టు విప్పుతూ అగ్నిపరీక్ష షోపై సంచలన కామెంట్ చేశారు. ఇకపోతే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయన బిగ్ బాస్ అగ్ని పరీక్ష పై నవదీప్ పై ఫైర్ అవుతూనే పాట రూపంలో తన ఆగ్రహాన్ని వెల్లడించారు. నర్సయ్య మాట్లాడుతూ.. “నవదీప్ మత్తులో ఒక తోపు లాంటివాడు.. నీ నక్కజిత్తుల బుద్ధి ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. తెలుగు భాష పైన నీకెప్పుడూ చిన్న చూపే.. ముఖ్యంగా నీ చూపు అంతా కూడా అమ్మాయిల పైనే ఉంటుంది. ఇక మీ అందరికీ నేను చెప్పేది ఏమంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి నేను అడుగుపెట్టగానే ఆయనకు నేను వేసుకున్న గోసి, గొంగలు చూడగానే గచ్చు వాసన కొట్టిందట. అందుకే నన్ను వెనక్కి పంపించేశారట..చూసే ఆడియన్స్ నా బాధను అర్థం చేసుకొని కామెంట్ రూపంలో నవదీప్ కి సిగ్గు వచ్చేలా చేయండి. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఒక మోసం .” అంటూ నర్సయ్య కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లకు నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..
ఈ వీడియో పై నెటిజన్స్ ఎవరికి వారు తమకు నచ్చిన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. కొంతమంది నవదీప్ తెలంగాణ అబ్బాయి నోరు జారి కామెంట్లు చేసి ఉంటాడు అంటూ కామెంట్లు చేయగా.. మరి కొంతమంది నవదీప్ కి పల్లెటూరు వాళ్లంటే అసలు నచ్చదు.ఏ క్వాలిఫికేషన్ తో అతడికి అగ్ని పరీక్షలు షో లో జడ్జిగా అవకాశం ఇచ్చారో చెప్పాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది నరసయ్య పైనే ఎదురు కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం..నీకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి నువ్వు ఇలా చెబుతున్నావు. ఒకవేళ నీకే అవకాశం ఇచ్చి ఉంటే నువ్వు పొగిడేవాడివే కదా.. నీలాంటి వాడే వాడు కూడా అంటూ ఇలా ఎవరికి వారు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
?utm_source=ig_web_copy_link