Telugu Filim Chamber : గత కొద్ది రోజులుగా సినీ కార్మికులకు, సినీ నిర్మాతలకు మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్ పెద్దలు నిర్మాతలు కలిసి అనేకసార్లు కార్మికుల వేతనాల గురించి చర్చలు జరిపారు. తమకు సరైన జీతం రావట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు సమ్మెకు దిగారు. దాంతో కొన్ని రోజులు షూటింగులను నిలిపివేశారు.. మొత్తానికి ఈ సమస్యను పరిష్కరించారు. జీతాల పెంపుకు నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కొన్ని కండీషన్లు కూడా పెట్టారు. ఎట్టకేలకు జీతాలను పెంచేసారు. వేతనాలను పెంచినట్లు తాజాగా ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం ఎవరికి ఎంత పెంచారో ఒకసారి చూసేద్దాం..
సినీ కార్మికులకు గుడ్ న్యూస్..
తెలుగు ఫిలిం ఛాంబర్ సినీ కార్మికుల జీతాలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఆగస్టు 22 న కార్మిక శాఖ సమక్షంలో 13 కార్మిక సంఘాలు మరియు నిర్మాతల మధ్య జరిగిన ఒప్పందం మేరకు 22.5% వరకు వేతనాలు పెంచుతున్నట్లు నూతన వేతన కార్డును నిర్ణయిస్తున్నట్లు ఫిలిం ఛాంబర్ తాజాగా ప్రకటించింది. ఆగస్టు 22 వరకు 15 శాతం పెంపును అమలు చేయాలని నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. సంఘాల వారీగా వేతనాలను సవరిస్తూ నిర్మాతలకు లేఖలు పంపింది..
ఎవరికి ఎంతంటే..?
జీతాలు చాలడం లేదని సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.. మొత్తానికి దిగొచ్చిన నిర్మాతలు జీతాల పెంపుకు ఆమెదం తెలిపారు. తాజాగా ఈ విషయాన్ని ఫిలిం ఛాంబర్ అధికారికంగా ప్రకటించింది. దాని ప్రకారం ఎవరికి ఎంతపెంచారంటే.. జూనియర్ ఆర్టిస్టులను మూడు విభాగాలుగా చేసి ‘ఏ’ కేటగిరిలో రూ.1,420, బి కేటగిరిలో రూ.1,175, సీ కేటగిరిలో రూ.930 ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఉదయం అల్పాహారం సమకూర్చకుంటే రూ.70, మధ్యాహ్నం భోజనం సమకూర్చకుంటే రూ.100 అదనంగా ఇవ్వనున్నారు..
Also Read : ఆ రోజులు ఇంకా గుర్తున్నాయా… పవన్ కళ్యాణ్ ట్వీట్ కి అల్లు అర్జున్ కామెంట్..
అదే విధంగా.. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్‌కు రూ.1,470, హఫ్ కాల్ షీట్‌కు రూ.735 చెల్లించనున్నారు. కాల్ షీట్ సమయం 4 గంటలు దాటిన తర్వాత మాత్రమే పూర్తి వేతనం చెల్లిస్తారని, జీతాలు, పని నిబంధనలకు సంబందించిన సమస్యలు ఉంటే మాత్రం వాటిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కమిటీకి తెలియజేయాలని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు. కమిటీ ఏర్పడే వరకు ప్రతి ఒక్కరూ కార్మిక శాఖ నిర్ణయించిన ఆగస్టు 21 తేదీ నాటి మినిట్స్‌ను అనుసరించాలని నిర్మాతలకు సూచించారు..
చివరగా.. ఇతర అన్నీ వర్కింగ్ కండీషన్స్, అలవెన్సులు 2022లో కుదిరిన ఒప్పందం ప్రకారమే అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు..
మొత్తానికి సినీ కార్మికుల సమ్మెకు ఫలితం దక్కింది. ప్రస్తుతం కార్మికుల సమ్మె వల్ల ఆగిన సినిమాల షూటింగ్ లు నిర్వీరామంగా జరగనున్నాయి.