NEET Student Incident: దేశవ్యాప్తంగా నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు.. ఆగడం లేదు.. జైపుర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నీట్ కోచింగ్ తీసుకుంటున్న ఒక విద్యార్థిని చదువుపట్ల భయంతో ఆమె బలవన్మరణానికి ప్రయత్నం చేసింది. కోచింగ్ సెంటర్ బిల్డింగ్ పైకి ఎక్కిన ఆ యువతి.. కిందికి దూకేస్తానని తీవ్ర బెదిరింపులు చేసింది. ఈ ఘటన జైపుర్‌లోని గురుక్రిప కోచింగ్ సెంటర్‌లో చోటుచేసుకుంది. ర్యాంక్ వస్తుందో లేదో.. ఆమె తల్లదండ్రులు తిడతారేమో అనే భయంతో సూసైడ్ చేసుకోడానికి ప్రయత్నించిందని సమాచారం.
వివరాల్లోకి వెళితే.. జైపుర్‌లోని గురు క్రిప కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకుంటున్న ఈ విద్యార్థి కొన్ని రోజులుగా కోచింగ్ సెంటర్‌లో పెట్టే టేస్టులకు అటెండ్ అవ్వలేదు. నాకు ర్యాంక్ రాదేమో అని భయంతో తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఇంతలోనే అమె తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్ వద్దకు వచ్చారు. దీంతో కోచింగ్ సెంటర్ సభ్యులు ఆమె గురించి చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో అసలే డిప్రెషన్ లో ఉన్న ఆ అమ్మాయి.. తల్లదండ్రులు కూడా తిట్టడంతో సూసైడ్ చేసుకోడానికి ప్రయత్నించిందని చెబుతున్నారు.
అయితే సూసైడ్ చేసుకోడానికి బిల్డింగ్ పైకి ఎక్కిన ఆ యువతిని అక్కడ ఉన్న స్థానికులు చూసి.. మెల్లగా ఆమె వద్దకు వెళ్లి.. బలవంతంగా వెనక్కి తీసుకువచ్చారు. తర్వాత వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇంటికి పంపించారు. ఈ ఘటన అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీయడంతో వైరల్ గా మారింది ఇప్పుడు.. అయితే నీట్ పరీక్షల ఒత్తిడి తట్టుకోలేకనే ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించిందని యువతి తెలిపింది.
Also Read: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఇచ్చాపురం డిగ్రీ కాలేజ్
ఈ ఘటన వల్ల తల్లదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ఇష్టం లేని చదువులు చదవలేక.. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక.. చాల మంది యువకులు, యువతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇష్టం లేక కొందరు.. ఎంత చదివినా అది బుర్రకెక్కక మరికొందరు.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అదే సమయంలో నీట్ అంటే పరీక్షల ఒత్తిడి, మార్కుల టెన్షన్ ఉంటుంది. వాటిని తట్టుకోలేక.. నీట్‌లో సీటు రాదనే భయాలు.. రిజల్ట్స్ భయాలతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
కావున తల్లిదండ్రులు పిల్లలను అర్ధం చేసుకొని వారికి నచ్చిన చదువులను చదివిస్తు.. వారిని నచ్చిన మార్గంలో వెళ్లనిస్తే ఎన్నో ఆత్మహత్యలు ఆగుతాయి. అలాగే వారు చెడు మార్గంలో వెళితే ఆపండి.. అంతేకాని మీ ఇష్టాలను వారి మీద రుద్దకండి.. దీని వల్ల పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇలాంటి ఘటనలు చూసి అయిన తల్లదండ్రులు మారాలని విద్యార్థులు కోరుకుంటున్నారు.