BigTV English
Advertisement

BB Telugu 8 Promo: మరో కొత్త టాస్క్.. ఆఖరి మెగా చీఫ్ ఎవరంటే..?

BB Telugu 8 Promo: మరో కొత్త టాస్క్.. ఆఖరి మెగా చీఫ్ ఎవరంటే..?

BB Telugu 8 Promo:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్(Bigg Boss). ఇప్పుడు ఎనిమిదవ సీజన్ జరుపుకుంటుంది. తాజాగా 11 వారాలు పూర్తి కాగా.. 12వ వారం కూడా దాదాపు చివరి దశకు చేరుకుందని చెప్పవచ్చు. మరోవైపు ఆఖరి మెగా చీఫ్ అవ్వడానికి కంటెస్టెంట్స్ దారుణంగా గొడవ పడుతున్నారు. అంతేకాదు ఒకరి క్యారెక్టర్ ను మరొకరు బ్యాడ్ చేస్తూ మొత్తానికి అయితే కంటెస్టెంట్స్ ఇలా బిహేవ్ చేయడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. టాస్క్ లలో గెలవడానికి రహస్యంగా ఉంచాల్సిన విషయాలను కూడా పబ్లిక్ చేస్తున్నారు అంటే ఇదంతా బిగ్ బాస్ స్ట్రాటజీ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.


ప్రోమోల ద్వారా షోపై హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్. అందులో భాగంగానే తాజాగా ఆఖరి మెగా చీఫ్ కోసం వరుస టాస్క్ లు పెడుతూ.. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు సృష్టిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ‘ఆటోలో ప్రయాణం’ టాస్క్ పూర్తవుగానే ‘తెడ్డు మీద గ్లాస్’ అనే మరో టాస్క్ తో వచ్చారు బిగ్ బాస్. ఈ క్రమంలోనే తాజాగా 82వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమోని విడుదల చేశారు. మరి ఆ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం..

ప్రోమో విషయానికి వస్తే.. పోటీదారులు మెగా చీఫ్ అవ్వడానికి బిగ్ బాస్ ఇస్తున్న తదుపరి టాస్క్ తెడ్డు మీద గ్లాస్. ఎప్పటిలాగే ఈ టాస్క్ ను యష్మీ, రోహిణి,విష్ణు ప్రియ, పృథ్వీ , టేస్టీ తేజ ఛాలెంజ్ గా తీసుకొని టాస్క్ ఆడారు. తెడ్డు సహాయంతో గ్లాసులో రంగు నీళ్లు నింపి అటువైపుగా ఉన్న జార్లో వేయాల్సి ఉంటుంది. అలా కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇక తర్వాత మధ్యలో యష్మి గ్లాసెస్ మొత్తం పడిపోయాయి.. దీంతో టేస్టీ తేజ మాట్లాడుతూ.. ముందు నుంచే స్టార్ట్ చేసేవాళ్ళం కదండీ అనగా యష్మి మాట్లాడుతూ.. ఇలాంటి గలీజ్ ఆటలు ఆడాలంటే చాలా కష్టం అంటూ కామెంట్ చేసింది. వెంటనే విష్ణు ప్రియ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తర్వాత సాండ్ విషయంలో నబీల్ యష్మి మధ్య గొడవ ఏర్పడింది. యష్మి సంచాలకుగా వ్యవహరించగా, నా బిల్ తేజ విషయంలో ఆయనకు సపోర్ట్ చేస్తూ..ఆమెను అడ్డు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక తర్వాత పృథ్వీ , టేస్టీ తేజ, రోహిణి ఒక టాస్క్ ఆడారు. ఒక కట్టికి చివర్లో చివర్లో కుండ పెట్టి, ఒక లెగ్ సహాయంతో దానిని బ్యాలెన్స్ చేయాలి. మిగతా కంటెస్టెంట్స్ వచ్చి.. ఆ కుండలో ఇసుక పోయాలి. కానీ అందులో టేస్టీ తేజ , పృథ్వి ఓడిపోగా చివరిగా రోహిణి మిగిలింది. అలా మొత్తానికైతే ఆఖరి మెగా చీఫ్ గా ఎంపికైంది రోహిణి. మొత్తానికి అయితే తన కలను నెరవేర్చుకుని, సెమీఫైనల్ కి చేరుకుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రోహిణి కష్టానికి ఫైనల్ గా ప్రతిఫలం లభించింది అని చెప్పవచ్చు.


Related News

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజా జన్మలో సపోర్టింగ్ టాస్క్ అడగదు… నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Big Stories

×