Utpanna Ekadashi 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశీర్ష మాసంలోని కృష్ణ పక్షం ఏకాదశి నాడు ఉత్పన్న ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఉత్పన్న ఏకాదశి నుండి ఏకాదశి ఉపవాసం ప్రారంభమైందని నమ్ముతారు. దీని కారణంగా ఈ రోజుకు ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది.
ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనిషి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా, వ్యక్తి చివరకు అన్ని సుఖాలను అనుభవించి మోక్షాన్ని పొందుతాడట. ఉత్పన్న ఏకాదశి ఉపవాసం ఎలా పాటించాలి. ఉపవాస ప్రాముఖ్యత గురించిన మరిన్ని విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్పన్న ఏకాదశి 2024 ఎప్పుడు: హిందూ క్యాలెండర్ ప్రకారం, మార్గశీర్ష మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి నవంబర్ 26న ఉదయం 01:01 గంటలకు ప్రారంభమవుతుంది. ఏకాదశి తిథి నవంబర్ 27న తెల్లవారుజామున 03:47 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, 26 నవంబర్ 2024న ఏకాదశి ఉపవాసం పాటించాలి.
ఉత్పన్న ఏకాదశి ఉపవాసం విరమణ సమయం- ఉత్పన్న ఏకాదశి ఉపవాసం విరమణ 27 వతేదీన చేయాలి. మధ్యాహ్నం 01:12 నుండి 03:18 మధ్య సమయంలో ఉపవాసాన్ని విరమించాలి.
ఉత్పన్న ఏకాదశి ఉపవాసం ప్రతి సంవత్సరం పాటిస్తారు. ఈ ఉపవాసం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ సంవత్సరం, ఉత్పన్న ఏకాదశి ఉపవాసం మార్గశీర్ష మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు. ఈ రోజున, విష్ణు భక్తులు ఉపవాసం, ఆచారాలతో పూజలు చేస్తారు. ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని పాటించడం చాలా ముఖ్యం. అంతే కాకుండా ఉత్పన్న ఏకాదశి రోజున కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి.
ఉత్పన్న ఏకాదశి రోజున ఏం చేయాలి: ఉత్పన్న ఏకాదశి రోజున శుభ సమయంలో విష్ణువును పూజించండి. మీరు ఈ రోజు ఉపవాసం ఉండకపోతే, సాత్విక ఆహారం తినడానికి ప్రయత్నించండి. ఉపవాసం పాటించే ముందు, ఉపవాసం పాటించాలని మనసులో అనుకోండి. ఉపవాస అన్ని నియమాలను అనుసరించండి. సూర్యోదయం తర్వాత ఉపవాసం విరమించండి. ఈ రోజున భజన-కీర్తన కూడా చేయడం ఉత్తమం.
ఉత్పన్న ఏకాదశి రోజున ఏం చేయకూడదు ?
మత్తును కలిగించే మద్యం- ఉత్పన్న ఏకాదశి రోజున మత్తునిచ్చే మద్యాన్ని తీసుకోకూడదు.
అన్నం- ఉత్పన్న ఏకాదశి రోజున అన్నం తినడం నిషిద్ధం.ఈ రోజు అన్నం తినడం వల్ల అపకారం జరుగుతుందని నమ్ముతారు.
Also Read: మకర రాశిలో శని సడే సతి.. ఈ 5 రాశుల వారికి కష్టాలు తప్పవు
తులసి- తులసి ఆకులు విష్ణువుకు చాలా ప్రీతికరమైనవి. సాధారణంగా తులసి లేకుండా విష్ణు భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించరు. కాబట్టి ఉత్పన్న ఏకాదశి రోజున తులసి ఆకులను ముట్టకూడదు. తెంపకూడదు. ఈ రోజున తులసిని తాకకుండా ఉండాలి.
నల్ల బట్టలు- మత విశ్వాసాల ప్రకారం, ఉత్పన్న ఏకాదశి రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. శ్రీమహావిష్ణువు ఆశీర్వాదం కోసం, ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా శుభప్రదం.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)