BB Telugu 8:గౌతమ్ ను బిగ్ బాస్ బాగా టార్గెట్ చేసిందనే వార్తలు వినిపించడం కంటే చూస్తేనే అర్థమవుతుందని చెప్పవచ్చు. గత సీజన్లో 13 వారాలపాటు కొనసాగిన గౌతమ్ అనూహ్యంగా బయటకు వచ్చారు.అయితే ఈసారి మళ్లీ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి తీసుకొచ్చారు. కానీ ఆయన తన తెలివితేటలతో బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ పై దెబ్బ కొట్టేలా ఆడుతున్నారు. అయినా సరే బిగ్ బాస్ తన కుతంత్రాలతో గౌతమ్ ను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ టీం కి నిఖిల్ విన్నర్ అవ్వాలని ఉందట.. దీనికి తోడు గౌతమ్ నిఖిల్ లాగా స్టార్ మా చానల్లో సీరియల్స్ కూడా చేయడు. పైగా ఈవెంట్స్ లో కూడా పాల్గొనడం లేదు.. ఒకవేళ పాల్గొన్నా కంటెంట్ ఇచ్చిన దాఖనాలు లేవు. కాబట్టి వాళ్ళకి నిఖిల్ ని విన్నర్ ని చేస్తే సీరియల్స్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈవెంట్స్ లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ వస్తుంది. అందుకే గౌతమ్ ను టైటిల్ రేస్ నుంచి తప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇకపోతే గౌతమ్ ని టైటిల్ రేస్ నుంచి తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు బిగ్ బాస్. ఉదాహరణకు ఈవారం రోప్స్ టాస్క్ లో గౌతమ్ ను సంచాలక్ చేసి ఆయనపై నెగెటివిటీ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ గౌతమ్ మాత్రం బిగ్ బాస్ టీం కి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి వాళ్ళ ప్లాన్ ని తన తెలివితేటలతో ఫెయిల్ అయ్యేలా చేశారు. దీంతో బిగ్ బాస్ టీం ఈగో బాగా హర్ట్ అయింది. అందుకే గౌతమ్ ని నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున చేత తిట్టించి ఆయనను నెగటివ్ చేసి ఓటింగ్ గ్రాఫ్ ని కూడా తగ్గించాలని చూశారు. ఈ ప్లాన్ కూడా బ్యాక్ ఫైర్ అయ్యిందని చెప్పడంలో సందేహం లేదు.
ఇకపోతే నేటి ఎపిసోడ్ లో నామినేషన్ లో గౌతమ్ కి తక్కువ స్పేస్ వచ్చేలా భారీ ప్లానింగ్ కూడా వేశారు. అందులో భాగంగానే నిన్నటి ఎపిసోడ్ చివరి 15 నిమిషాలు యాక్షన్ రూమ్ లో కంటెస్టెంట్స్ అందరినీ కూడా పిలిచి, లాడర్ అండ్ స్నేక్ గేమ్ ఆడించారు హోస్ట్ నాగార్జున. ఈ టాస్క్ లో అత్యధికంగా పృథ్వీ, నిఖిల్, గౌతమ్ లకు స్నేక్ వచ్చింది. చివర్లో స్నేక్ వచ్చిన ఈ ముగ్గురిలో ఒకరిపై బిగ్ బాంబు పడనుంది అని తెలిపాడు. కానీ రివీల్ చేయలేదు. అయితే నేటి ఎపిసోడ్ లో యష్మీ కాస్త ఎలిమినేట్ కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. యష్మీ ను వెళ్లే ముందు ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిపై ఆ బాంబును ప్రయోగించమని చెబుతాడు నాగార్జున. ముగ్గురిలో ఇద్దరు కన్నడ బ్యాచ్.. పైగా ఆమె స్నేహితులు కూడా.. దీంతో వారిద్దరిపై ఆమె వేటు వెయ్యదు. మిగిలిన వాడు గౌతం మాత్రమే.. పైగా హౌస్ లో గౌతమ్ తో యష్మీ కి వ్యతిరేకత కూడా బాగా ఏర్పడింది. అందుకే ఇప్పుడు గౌతమ్ ని యష్మీ ను ఊహించినట్టే నేరుగా నామినేషన్స్ లోకి పంపింది. దీంతో గౌతమ్ ను రేపు వారం నామినేషన్స్ లో ఎవరు నామినేట్ చేయలేరు. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో ఒకరి మీద ఒకరికి పాయింట్స్ కూడా లేవు. అందరికీ గౌతమ్ తోనే సమస్య కాబట్టి.. ఒకవేళ నామినేషన్స్ లోకి వచ్చినా ఈయనకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే బయట ఓటింగ్ ఈయనకే ఎక్కువగా పడుతుంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేస్తారో చూడాలి.