David Warner unsold: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో చాలామంది కోట్లల్లో అమ్ముడు అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే… అమ్ముడు పోనీ ప్లేయర్లు కూడా… తెరపైకి వస్తున్నారు. అయితే ఈ లిస్టులోకి డేంజర్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ చెరిపోయాడు. అతని ఏ జట్టు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో un sold ప్లేయర్ గా డేవిడ్ వార్నర్ మిగిలాడు.
Also Read: Mohammad Siraj: తెలంగాణ DSP కు గుజరాత్ బంపర్ ఆఫర్.. ఏకంగా 12.25 కోట్లు
Also Read: Kl Rahul: ఢిల్లీ జట్టులోకి కేఎల్ రాహుల్..గతంలో కంటే రూ.3 కోట్లు డౌన్ ?
గత మినీ వేలంలో 6.25 కోట్లకు ఢిల్లీ డేవిడ్ వార్నర్ ను కొనుగోలు చేశారు. కానీ ఈసారి మాత్రం అతన్ని ఎవరు కొనుగోలు చేయలేదు. ఇక మరొక ప్లేయర్ దేవదత్ పడిక్కల్ కూడా అన్ సోల్డ్ ప్లేయర్గా మిగిలిపోయాడు. గతంలో 7.75 కోట్లు పలికిన దేవదత్… ఈసారి ఎవరికీ నచ్చలేదు.
Also Read: Mohammed Shami: SRH లోకి మహమ్మద్ షమీ.. ఎన్ని కోట్లు అంటే?
ఇది ఇలా ఉండగా… డేవిడ్ వార్నర్ ఒకప్పుడు అద్భుతంగా ఆడేవాడు. కానీ… హైదరాబాద్ జట్టును వీడిన తర్వాత అతని ఆట తీరు పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ విడిచిపెట్టిన తర్వాత ఢిల్లీలోకి వచ్చాడు. ఢిల్లీ కెప్టెన్సీ ఇస్తారని అనుకున్న.. రిషబ్ పంతు కారణంగా అతనికి దక్కలేదు.
అయితే రిషబ్ పంత్ కు యాక్సిడెంట్ అయిన సమయంలో ఢిల్లీ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ వ్యవహరించాడు. కానీ అప్పుడు ఢిల్లీ మెరుగైన ఫలితాలను రాబట్ట లేకపోయింది. కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ దారుణంగా విఫలమయ్యాడు. ఇక మొన్నటి సీజన్లో కూడా ప్లేయర్ గా కూడా పెద్దగా రాణించలేదు డేవిడ్ వార్నర్. అటాకింగ్ చేసే డేవిడ్ వారం మొత్తం డిఫెన్స్ ఆడుతున్నాడు. అందుకే… అతన్ని ఈసారి ఎవరు కొనుగోలు చేయలేదు.
కాగా మార్క్యూ సెట్ 1 లో తోపు ప్లేయర్స్ ఉన్నారు. అర్ష్‌దీప్ సింగ్ రూ.2 కోట్ల బేస్ ధర. రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్‌ని ఉపయోగించి పంజాబ్ కింగ్స్ ₹18 కోట్లకు కొనుగోలు చేసింది. కగిసో రబడ (దక్షిణాఫ్రికా) , రూ.2 కోట్ల బేస్ ధర, అయితే ₹10.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (భారతదేశం) బేస్ ధర ₹2 కోట్లు అయితే పంజాబ్ కింగ్స్ ₹26.75 కోట్లకు విక్రయించుకుంది. IPL వేలం చరిత్రలో రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
Also Read: Mohammad Siraj: తెలంగాణ DSP కు గుజరాత్ బంపర్ ఆఫర్.. ఏకంగా 12.25 కోట్లు
జోస్ బట్లర్ (ఇంగ్లండ్) బేస్ ధర ₹2 కోట్లు అయితే, ₹15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), బేస్ ధర ₹2 కోట్లు అయితే , ఢిల్లీ క్యాపిటల్స్ 11.75 ₹కోట్లకు సొంతం చేసుకుంది. రిషబ్ పంత్ (భారతదేశం) బేస్ ధర ₹2 కోట్లు అయితే, లక్నో సూపర్ జెయింట్స్ ₹27 కోట్లకు సొంతం చేసుకుంది. దింతో IPL వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అయ్యర్ రికార్డును నిమిషాల్లో బద్దలు కొట్టాడు.