BigTV English

BB Telugu 8: నామినేషన్స్ వేళ కంటెస్టెంట్స్ కి భారీ షాక్.. ఆఖరి వారం నామినేషన్స్ లిస్ట్ వైరల్..!

BB Telugu 8: నామినేషన్స్ వేళ కంటెస్టెంట్స్ కి భారీ షాక్.. ఆఖరి వారం నామినేషన్స్ లిస్ట్ వైరల్..!

BB Telugu 8:బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (BB Telugu 8)ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఇక మిగిలి ఉంది రెండు వారాలు మాత్రమే. అందులో ఆఖరి నామినేషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. ఇకపోతే నిన్నటితో 13వ వారం ముగిసింది. అనూహ్యంగా డబుల్ ఎలిమినేషన్స్ తో కంటెస్టెంట్స్ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓటింగ్ బట్టి చూస్తే లీస్టులో టేస్టీ తేజ, అవినాష్ ఉన్నారు. కానీ అవినాష్ టికెట్ టు ఫినాలే రేస్ గెలిచి మొదటి ఫైనలిస్టుగా మారారు. దాంతో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు అవినాష్. ఇక టేస్టీ తేజ శనివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అవ్వగా, వీరిద్దరి తర్వాత తక్కువ ఓట్లు అందుకున్న పృథ్వీను నిన్న ఎలిమినేట్ చేశారు. మొత్తానికి అయితే అవినాష్ కోసం పృథ్వీను ఎలిమినేట్ చేశారని, పృథ్వీ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ బిగ్ బాస్ పై పృథ్వీ అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇదిలా ఉండగా 14వ వారానికి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు ప్రారంభం అయింది. అయితే ఈరోజు నామినేషన్ ప్రక్రియ కాస్త కొంచెం భిన్నంగా సాగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం హౌస్ లో 7 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. టికెట్ టు ఫినాలే రేసులో మొదటి ఫైనలిస్టుగా నిలిచిన అవినాష్ తో పాటు గౌతమ్, రోహిణి, ప్రేరణ, నబీల్, నిఖిల్, విష్ణుప్రియ హౌస్ లో కొనసాగుతున్నారు. ఈ ఏడు మందిలో ఈవారం ఒకరు ఎలిమినేట్ కానున్నారా? మరి ఇద్దరి ఎలిమినేట్ కానున్నారో తెలియదు కానీ మొత్తానికి ఫైనల్ కు 5 మంది చేరుకోబోతున్నారు. ఐదు మందిలో ఇద్దరు మాత్రమే ఒకరు రన్నర్ గా, ఒకరు విన్నర్ గా నిలవనున్న విషయం తెలిసిందే.

ఇకపోతే తాజాగా 92వ రోజుకు సంబంధించి ప్రోమోను విడుదల చేయగా, ఆ ప్రోమోలో తమ కామెడీతో గౌతమ్, అవినాష్ కడుపుబ్బా నవ్వించారు. నబీల్, అవినాష్, ప్రేరణ, గౌతమ్, రోహిణి ఒకచోట చేరి ముచ్చట్లు పెట్టుకోగా.. అందులో అవినాష్ ఒక ఇంగ్లీష్ స్టోరీ చెబుతూ అందరినీ నవ్వించారు. ఇక ఆయన స్టోరీ వినలేక అక్కడి నుంచి కంటెస్టెంట్స్ కూడా వెళ్లిపోయి ఆడియన్స్ కి నవ్వు తెప్పించారు. ఇక తర్వాత గౌతమ్ రోహిణీ ని పిలుస్తూ.. చాలా రోజుల నుంచి నువ్వు హెల్తీ బాయ్ అని నన్ను పిలుస్తున్నావు. ఈ హెల్ది బాయ్ ఫస్ట్ టైం నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాడు అంటూ చెప్పగా, వెనకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రొమాంటిక్ గా ప్లే చేశారు బిగ్ బాస్. ఇక దాంతో చూసి ఆడియన్స్ కూడా ప్రపోజ్ చేయబోతున్నారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. రోహిణి కూడా సిగ్గు పడిపోయింది. కానీ గౌతమ్ మాట్లాడుతూ.. ఎప్పటినుంచో నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.. కానీ ఆ ఫీలింగ్స్ ని నేను బయటకి చెప్పలేకపోయాను.. అని గౌతమ్ చెబుతూ ఉండగా. మధ్యలో నబీల్ కలగజేసుకొని, అంటే నామినేషన్స్ ప్రక్రియ లేట్ అయితాందని కొంపతీసి నామినేట్ చేయడం లేదు కదా అన్నారు.


ఆ తర్వాత గౌతమ్ మాట్లాడుతూ.. ఈ హౌస్ లో ఉన్న అమ్మాయిలందరూ నా అక్కలు.. నీకు ఎప్పటికీ ఒక సోదరుడు ఉంటాడని మర్చిపోకు అని చెప్పగానే వెంటనే రోహిణి సీరియస్ అవుతూ.. ఎవర్రా నీకు అక్క అంటూ ఫైర్ అవుతూ కామెడీ పండించారు. ఇక బిగ్ బాస్ మాట్లాడుతూ.. ఈ సీజన్లో ఆఖరి నామినేషన్ ఇప్పుడు మొదలు కాబోతోంది. ఇప్పుడు మీరు ఆడియన్స్ యొక్క నిర్ణయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవినాష్ మినహా మిగతా ఇంటి సభ్యులంతా ఆఖరి సారి ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు నేరుగా నామినేట్ అయ్యారు అంటూ భారీ షాక్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ విషయం తెలిసి కంటెస్టెంట్స్ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Related News

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Bigg Boss 9: ఎన్టీఆర్ షోలో మర్యాద మనీష్.. గుండు సీక్రెట్ రివీల్ చేస్తూ!

Bigg Boss Telugu 9: సంజన సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చిన మనీష్.. వరస్ట్ ప్లేయర్ శ్రీజ, ప్రియకు బిగ్ బాంబ్!

Bigg Boss Telugu 9 Day 13: సంజన, ఫ్లోరా గుట్టురట్టు చేసిన నాగార్జున.. ఆమె జైలుకి, హౌజ్ మేట్స్ కి బిగ్ ట్విస్ట్

Bigg Boss 9 Promo: పాపం మరీ అంత బోర్ కొట్టేసిందా? కాస్త వారితో కూడా మింగిల్ అవ్వమ్మా?

Big Stories

×