BB Telugu 8 Hariteja : ఒకప్పుడు యాంకర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హరితేజ (Hariteja ) అప్పుడప్పుడు పలు చిత్రాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయింది. తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకునే ఈమె కామెడీతో కూడా కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోషూట్స్ తో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక అలా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ 3 వరకు వచ్చింది. కంటెస్టెంట్స్ లో పోటీపడి ఆడడంలో కానీ, తోటి కంటెస్టెంట్స్ తో ప్రవర్తించే తీరులో కానీ చాలా టాప్ క్లాస్ లో ఉండేది హారితేజ. అంతేకాదు అందరూ మెచ్చిన కంటెస్టెంట్ కూడా ఈమె కావడం గమనార్హం.
ముఖ్యంగా సీజన్ 1 లో నవదీప్ తో సమానంగా ఎంటర్టైన్మెంట్ పంచిన కంటెస్టెంట్ కూడా హరితేజనే. అందుకే టాప్ 3 వరకు వెళ్ళింది. అలాంటి కంటెస్టెంట్ వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా అంచనాలు ఉండడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలోనే ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టిన హరితేజ పై అంచనాలు భారీగా పెరిగి పోయాయి. కానీ అంచనాలకు తగ్గట్టుగా హరితేజ అస్సలు ఉండడం లేదు. టాస్క్ లలో ఊహించని రేంజ్ లో ఆమె ఆడడం లేదు. అదేవిధంగా ఆమె ప్రవర్తనలో కూడా మొదటి సీజన్ తో పోల్చుకుంటే చాలా మార్పులే వచ్చాయి. ఈమెలో అసూయ, స్వార్థం వంటి లక్షణాలను ప్రజలు ఇప్పుడు తీసుకోలేకపోతున్నారు. కిల్లర్ గర్ల్స్ టాస్క్ లో యష్మీ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది అనే విమర్శలు వచ్చాయి. అదే విధంగా ప్రేరణపై కూడా పీకల వరకు కోపం పెంచుకోవడం, వీళ్లిద్దరి గురించి వెనుక నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఇలాంటివి అన్నీ చేయడంతో ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు.
ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈమెలో పాజిటివ్ అంశాలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాట మార్చడంలో బిగ్ బాస్ హిస్టరీలోనే ఈమెని మించిన వాళ్లు లేరని, తనను తాను నిరూపించుకుంది హరితేజ. ఒకప్పుడు ఈమె అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఈమెపై అభిమానులలో కూడా చిరాకు కలిగేలా చేస్తున్నాయి. ఉదాహరణకు తాజాగా బిగ్ బాస్ ఇంటికి దారేది టాస్క్ లో మొదటి లెవెల్ లో హరితేజ టీం గెలవగా.. రెండవ స్థానంలో యష్మీ టీం నిలిచింది. కానీ ఎల్లో కార్డ్ ను మాత్రం యష్మీ టీం కి ఇవ్వడంతో.. యష్మీ.. మేము కష్టపడి రెండవ స్థానంలో వచ్చాము. మేమంతా నామినేషన్ లో ఉన్నాం. దయచేసి మా కష్టాన్ని గుర్తించి మీరు ఎల్లో కార్డు ఇవ్వకండి అంటూ బ్రతిమలాడుకున్నా .. హరితేజ ఒప్పుకోలేదు. ఇక దీన్ని బట్టి చూస్తే హరితేజలో స్వార్థం ఏ రేంజ్ లో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు ఇంత నెగెటివిటీ పెంచుకున్న హరితేజ బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించలేదేమో అని అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు.