Immunity Booster: శరీరాన్ని బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడం చాలా ముఖ్యం. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పోషకాహారం తీసుకోవాలి. ఇదిలా ఉంటే చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు రోగనిరోధక శక్తి తగ్గడానికి ప్రధాన కారణాలు. ఇవే కాకుండా, కొన్నిసార్లు మందుల వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో రోగనిరోధక శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి మనలను రక్షిస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచే మార్గాలు ఇవే !
1. ఆరోగ్యకరమైన ఆహారం:
విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారం: మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, నట్స్ చేర్చండి. ఈ ఆహారాల్లో విటమిన్ సి, ఇ, ఎ, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఫలితంగా వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ప్రోటీన్:పెరుగు, పాలు, గుడ్లు, చేపలు, మాంసంలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఈ ఆహారాలు శరీరాన్ని బాగు చేయడంతో పాటు కొత్త కణాలను సృష్టించడంలో సహాయపడతాయి.
ధాన్యాలు: బ్రౌన్ రైస్, ఓట్స్, బార్లీ వంటి ధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
2. ఆరోగ్యకరమైన జీవనశైలి:
తగినంత నిద్ర: రోజు 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్రలోనే శరీరం రీప్రెష్ అవుతుంది. ఫలితంగా మీ రోగనిరోధక శక్తి బలపడుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి
వ్యాయామం: రెగ్యులర్ వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
ఒత్తిడిని తగ్గించండి: ఒత్తిడి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. మీ దినచర్యలో యోగా, ధ్యానం లేదా ఇతర ఒత్తిడిని తగ్గించే కార్యకలాపాలను చేర్చుకోండి.
Also Read: ఇవి వాడితే.. మీ ముఖం వజ్రంలా మెరిసిపోతుంది తెలుసా ?
నీరు త్రాగండి: తగినంత మొత్తంలో నీరు త్రాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అంతే కాకుండా టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
ధూమపానం, మద్యపానం మానుకోండి: ధూమపానం, మద్యపానం రోగనిరోధక వ్యవస్థకు హాని కలిగిస్తుంది. అందుకే వాటికి దూరంగా ఉండాలి.
పాలు, పెరుగు: వీటిలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి . అంతే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
పసుపు: పసుపులో ఉండే కుర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది మంటను తగ్గిస్తుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఆయుర్వేద మూలికలు: అశ్వగంధ, తులసి, గిలోయ్ వంటి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడే అనేక మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయి. వీటిని తరుచుగా తినడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.