BigTV English

BB Telugu 8: అవినాష్ పనికి రోహిణి కంటతడి..!

BB Telugu 8: అవినాష్ పనికి రోహిణి కంటతడి..!

BB Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరిదశకు వచ్చేసింది. విన్నర్ గా గెలిపించమని ప్రేక్షకులను ఓట్లు అడిగే ఛాన్స్ పొందాలి అంటే తాను పెట్టే టాస్క్ లు గెలవాలని కూడా చెప్పాడు బిగ్ బాస్ (Bigg Boss). అలా మొదట ప్రేరణ(Prerana)తర్వాత నబీల్(Nabeel), ఇక నిన్న విష్ణుప్రియ(Vishnu Priya) ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం పొందారు. ఇక ఆమె ఎలా గెలిచింది..? ఏం మాట్లాడింది? అనేది నిన్న ఎపిసోడ్ లో కూడా హైలెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ విషయానికి వస్తే ఫ్లవర్ ఫ్లాగ్ అనే చాలెంజ్ ఇచ్చారు బిగ్ బాస్ బజార్ మోగినప్పుడు ఫ్లాగ్ పట్టుకున్న వారు ఆ రౌండ్లో ఒకరిని ఛాలెంజ్ నుంచి తప్పించాల్సి ఉంటుంది.


మొదటి రౌండ్ లో గౌతమ్ గెలిచి నబీల్ ను రేస్ నుంచి తప్పించాడు. ఆ తర్వాత రౌండ్లో కూడా గౌతమ్ ఒక్కడు ఒకవైపు, మిగతా వారంతా మరోవైపు అన్నట్టుగానే ఆట ఆడారు. గౌతమ్ దగ్గర నుంచి అందరూ కలిసి జండాలు లాక్కోవాలని చూసినా లాభం లేకపోయింది. అలా మిగతా రెండు రౌండ్లలో కూడా గౌతమ్.. ప్రేరణ, నిఖిల్ లను తీసేశాడు. ఆ తరువాత రౌండ్ లో మిగిలిన వాళ్ళు గౌతమ్ ను లాక్ చేశారు. అతడి దగ్గర నుంచి రోహిణి జెండా తీసుకుంది. స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ గౌతమ్ ను రేస్ నుంచి తొలగించింది. ఆ తర్వాత అవినాష్ విష్ణును రౌండ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. చివర్లో అవినాష్ రోహిణి మాత్రమే మిగిలారు. ఇక స్నేహితురాలిని గెలిపించడం కోసం అవినాష్ జెండా త్యాగం చేయడంతో రోహిణి కంటెండర్ గా నిలిచింది. అంతేకాదు తనకోసం అవినాష్ అలా త్యాగం చేసేసరికి చిన్న పిల్లలా ఏడుస్తూ కంటతడి పెట్టుకుంది.మొత్తానికైతే అవినాష్ తనకు చేసిన మంచిని ఆమె గుర్తించి ఎమోషనల్ అవడంతో అవినాష్ పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే ఆ తర్వాత బిగ్ బాస్ ‘నిలబెట్టు పడగొట్టు’ అని రెండవ ఛాలెంజ్ కి అర్హత లేదనుకున్న వ్యక్తి ఫోటోని వేస్ట్ బాక్స్ లో పడేయాలి. ఇందులో అందరూ వారు తెచ్చుకున్న ఫోటోలు పడేయగా.. గౌతమ్ మాత్రం తాను తీసుకున్న నబీల్ ఫోటో పడేయలేకపోయారు. దీంతో సంచాలక్ రోహిణి నబీల్ ను విజేతగా ప్రకటించింది. అందరూ కూడా గేమ్ సరిగ్గానే ఆడారా అంటూ ప్రశ్నించారు బిగ్ బాస్. దీంతో ఆలోచనలో పడ్డ రోహిణి టాస్క్ ను ప్రేరణ, విష్ణు మినహా ఎవరు సరిగ్గా ఆడనట్లు గుర్తించింది. తర్వాత చర్చోపచర్చలు అనంతరం విష్ణు గెలిచినట్లు ఫైనల్ గా రివీల్ చేసింది. ఇకపోతే రోహిణి విష్ణుప్రియలో ఎవరు ఓటు అప్పీల్ చేయాలో హౌస్ మేట్స్ నిర్ణయించాలని బిగ్ బాస్ చెప్పగా.. అవినాష్ మినహా మిగతా వారందరూ విష్ణుకి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. బిగ్ బాస్ చరిత్రలో మహిళా విజేత కావాలన్నదే నా కోరిక.. అందుకు మీరు సహాయం చేయండి అంటూ ప్రేక్షకులను ఓట్లు వేయాలని అభ్యర్థించింది.


Related News

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Big Stories

×