BigTV English

BB Telugu 8 Promo: వీకెండ్స్ మజా.. నవ్వుతూ ఏడిపించిన కంటెస్టెంట్స్..!

BB Telugu 8 Promo: వీకెండ్స్ మజా.. నవ్వుతూ ఏడిపించిన కంటెస్టెంట్స్..!

BB Telugu 8 Promo:తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఊహించని ట్విస్ట్ లతో తికమక పెట్టిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్(Bigg Boss). తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ఎనిమిదవ సీజన్ కూడా చివరి దశకు చేరుకోబోతోంది. ఇక ఈవారం 12వ వారం. మొత్తం ఐదు మంది నామినేషన్స్ లోకి వచ్చారు. అందులో నిఖిల్, నబీల్, ప్రేరణ, యష్మీ, పృథ్వీ.. డేంజర్ జోన్ లో కన్నడ బ్యాచ్ గా , బెస్ట్ ఫ్రెండ్స్ గా గుర్తింపు తెచ్చుకున్న యష్మీ, పృథ్వీ వున్నారు. వాస్తవానికి ఓటింగ్ ప్రక్రియ మొదలైన వెంటనే యష్మీ సెకండ్ స్థానంలో నిలిచింది. కానీ విష్ణుప్రియ తో గొడవ వల్ల లీస్ట్ లోకి వెళ్లిపోయింది. ఇకపోతే లీస్ట్ లో యష్మీ, పృథ్వీ ఉండగా ఈవారం డబుల్ ఎలిమినేషన్స్ అంటూ వార్తలు వచ్చాయి. ఇక యష్మీ కంటే ముందు పృథ్వీ ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా చూపించిన ప్రోమోలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం


తాజాగా ఈరోజు ఉదయం గెస్ ద డైలాగ్ అంటూ కంటెంట్స్ తో ఆట ఆడించిన హోస్ట్ నాగార్జున, ఇప్పుడు కంప్లైంట్ టైం అంటూ మరో కాన్సెప్ట్ తో కంటెస్టెంట్స్ ముందుకి వచ్చారు. ఇకపోతే హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరి గురించి కంప్లైంట్ ను బిగ్ బాస్ కు రహస్యంగా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ కంప్లైంట్ ఎవరు ఎవరిపైన చేశారు అనే విషయాన్ని కంటెస్టెంట్స్ తోనే చెప్పించారు హోస్ట్ నాగార్జున. ఇక ఆ ప్రోమోని తాజాగా విడుదల చేశారు ఇప్పుడు ప్రోమో గురించి చూద్దాం.

ప్రోమో మొదలవగానే.. ఒక్కొక్కరి తలపై నాలుగు బెలూన్స్ ను ముడి వేసి.. కంటెస్టెంట్స్ తలలపై ఉంచారు అవినాష్. ఇక ఈ బెలూన్స్ తలలపై పెట్టే సమయంలో కూడా రోహిణి తన కామెడీని ఇక్కడ ప్రజెంట్ చేసింది. అన్నయ్య ఎంత జాగ్రత్తగా పెడుతున్నారో అంటూ అందరికీ నవ్వు తెప్పించింది. ఆ సమయంలో కూడా పృథ్వీ, విష్ణుప్రియ ఒకరికొకరు చూసుకున్న రొమాంటిక్ యాంగిల్ అందరినీ ఆకట్టుకుందని చెప్పవచ్చు.. హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. “మీరు రాసిన కంప్లైంట్స్ నుంచి.. ఒక్కొక్కరిపై రెండు కంప్లైంట్స్ సెలెక్ట్ చేశారు బిగ్ బాస్. తేజ నీ మీద ఉన్న ఫస్ట్ కంప్లైంట్ ఏంటి?” అంటూ అడిగాడు నాగార్జున.


తేజ అక్కడున్న కార్డు తీసుకొని చదువుతూ..” ఏ విషయం గురించైనా తను మాట్లాడాలనుకున్నప్పుడు, వాటిని మాట్లాడేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. నేనొకటే కరెక్ట్ , నేను చెప్పిందే నిజం” అనే మైండ్ సెట్ నుంచి బయటకు రావాలి” అంటూ బిగ్ బాస్ హౌస్ లోని ఒక కంటెస్టెంట్ తేజ పై కంప్లైంట్ చేశారు. ఈ విషయాన్ని తేజ స్వయంగా చదివి వినిపించారు. “ఈ కంప్లైంట్ హౌస్ లో ఎవరు చేసి ఉంటారు?” అని నాగార్జున అడగగా.. వెంటనే ఒక పిన్ తీసుకొని యష్మీ, విష్ణు ప్రియా తలలపై ఉన్న బెలూన్స్ పగలగొట్టారు టేస్టీ తేజ.అలా ఒక్కొక్క కంటెస్టెంట్ తమపై వచ్చిన కంప్లైంట్స్ గురించి చదివి ఎవరు చేశారో..? వారి తల పైన బెలూన్స్ పగలగొట్టి అందర్నీ నవ్వించారు. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమవ్వగానే యష్మీ ఎలిమినేట్ అయినట్టు చూపించారు. ఇక చివర్లో కంటెస్టెంట్స్ ఏడుపు మొహాలు పెట్టారు.

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×