E-Paper
Advertisement

BB Telugu 8 Promo: నామినేషన్ రచ్చ మొదలు.. ఇలాంటి గొడవ ఎక్కడ చూడలేదు భయ్యా..!

BB Telugu 8 Promo: నామినేషన్ రచ్చ మొదలు.. ఇలాంటి గొడవ ఎక్కడ చూడలేదు భయ్యా..!
Advertisement

BB Telugu 8 Promo: బుల్లితెర ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss) ఇప్పుడు తెలుగులో ఎనిమిదవ సీజన్ మొదలయ్యింది. తాజాగా నిన్నటితో నయనీ పావని (Nayani Pavani)ఎలిమినేట్ కాగా.. ఇక ఈ వారానికి సంబంధించి నామినేషన్స్ రచ్చ మొదలయింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు నామినేషన్స్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు విడుదల చేశారు. మరి ఈ నామినేషన్స్ రచ్చ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం.

ప్రోమో విషయానికి వస్తే.. ఈ నామినేషన్స్ అతి ముఖ్యమైనవి.. ఎందుకంటే ఈరోజు మీరు కేవలం ఒక నామినేషన్ మాత్రమే చేయాలి. ఎవరినైతే ఈ ఇంట్లో నుంచి పంపిద్దాం అనుకుంటున్నారో.. స్పష్టంగా ఆలోచించి నిర్భయంగా మాట్లాడండి. అంటూ బిగ్ బాస్ తెలిపారు. ఇక నామినేషన్స్ ప్రక్రియ మొదలవగానే పృథ్వీ ముందుకొచ్చి.. రోహిణి ను నామినేట్ చేశారు. “మీరు నెక్ ఫాంటసీ అనే వర్డ్ వాడారు” అంటూ రోహిణి గురించి చెప్పాడు పృథ్వి. దీంతో రోహిణి మాట్లాడుతూ.. “మీరు హోల్డ్ చేయడానికి ఎక్కువగా నెక్ దగ్గరికి వెళ్తున్నారు. అందుకే అలా చెప్పాను” అని చెప్పగా.. ఫాంటసీ అంటే అర్థం ఏంటీ..? అని పృథ్వి అడిగారు. ఇక దీంతో రోహిణి పృథ్వి ఫాంటసీ అంటే బాడ్ వర్డ్ హా.. మేము ఫాంటసీలో బ్రతుకుతున్నామని చెబుతాము కదా అంటూ తన సమాధానం తెలిపింది.

Advertisement

ఇక హరితేజ వచ్చి ప్రేరణను నామినేట్ చేసింది..” మీరు ప్రతిసారి ఫేక్ ఫేక్ అని చెబుతున్నారు.. ఈ పదం మీకు చాలా చిన్నదై ఉండవచ్చు.. కానీ ఎదుటివారికి ఆ పదం చాలా పెద్ద పదం. నోరు బాగుంటే ఊరు బాగుంటది”. అని చెప్పింది. ఇక నేనెప్పుడు ఆ పదం అన్నాను అని ప్రేరణ అనగానే..” ఆ మాట నా చెవిన పడగానే.. ఐగిరి నందిని అనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నాకు వినిపించింది” అంటూ ఫైర్ అయిపోయింది హరితేజ. ఆ తర్వాత ప్రేరణ కూడా తనదైన స్టైల్ లో రెచ్చిపోయి.. తనలోని మహానటిని వెలికితీసింది. హరితేజ కూడా మాట్లాడుతూ.. మీరు నన్ను ఫేక్ అని మాట్లాడలేదని నిరూపిస్తే.. అంటూ చెపుతూ ఉండగానే ప్రేరణ అబ్బా అంటూ మహానటిలా నటించింది. ఇక తర్వాత ప్రేరణ మీరు నాకు రికార్డింగ్ తెచ్చి చూపించండి అని అడగ్గా.. హరితేజ అయ్యో దేవుడా అంటూ మొదలెట్టింది.

ఇక అసలు రచ్చ ఇక్కడే మొదలైంది. నిఖిల్ వర్సెస్ గౌతమ్.. ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరిపోయింది. అశ్వద్ధామ పాయింట్ గురించి మళ్లీ బయటకు తీస్తూ నిఖిల్ గౌతమ్ ను నామినేట్ చేశాడు. ఇక నువ్వు పిలుచుకో మచ్చా అంటూ నిఖిల్ తో చెప్పాడు గౌతమ్.ఇక ఎవడు ఏం చెప్పినా ఇప్పుడు అన్నీ తీసేస్తున్నాను.. ఇప్పుడు చెప్తున్నా అశ్వద్ధామ ఈజ్ బ్యాక్ అంటూ చాలా గట్టిగా అరిచాడు గౌతమ్. మొత్తానికి అయితే ఈ నామినేషన్ రచ్చ చాలా గట్టిగా మొదలైంది అని చెప్పవచ్చు.

Advertisement

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×