BigTV English

Chia Seeds Hair Mask: చియా సీడ్స్‌తో హెయిర్ మాస్క్.. ఒక్క సారి వాడారంటే రిజల్ట్ పక్కా

Chia Seeds Hair Mask: చియా సీడ్స్‌తో హెయిర్ మాస్క్.. ఒక్క సారి వాడారంటే రిజల్ట్ పక్కా

Chia Seeds Hair Mask: పొడవాటి, బలమైన జుట్టును కోరుకోని వారెవరూ ఉంటారు చెప్పండి. మారుతున్న జీవనశైలి, అలవాట్ల కారణంగా చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలే సమస్యను ఎదుర్కుంటున్నారు. అలాంటి వారికి చియా సీడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. జుట్టు సంబంధిత సమస్యలు తగ్గించడంలో చియా సీడ్స్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. చియా గింజల్లో పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఈ లక్షణాల కారణంగా, ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తాయి.


పోషకాలు అధికంగా ఉండే చియా విత్తనాలు ఈ రోజుల్లో చాలా మంది ప్రజల దినచర్యలో ముఖ్యమైన భాగంగా చేసుకున్నారు. దీని అద్భుతమైన ప్రయోజనాల కారణంగా వీటిని తినే వారి సంఖ్య చాలా వరకు పెరిగింది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రొటీన్లు వంటి పోషకాలు జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.

ఆరోగ్యానికి చియా గింజలు చేసే మేలు గురించి చాలా మందికి తెలుసు . కానీ చర్మానికి కలిగించే ప్రయోజనాల గురించి తక్కువ మందికే తెలుసు. ఈ రోజు చియా సీడ్స్ జుట్టుకు ఎలా ఉపయోగపడుతుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


డల్ హెయిర్ కోసం హెయిర్ మాస్క్:
కావలసినవి:
చియా సీడ్స్- 4 స్పూన్లు
ఆపిల్ సైడర్ వెనిగర్- 1/ 2కప్పు

తయారు చేసే పద్ధతి: ముందుగా చియా గింజలను ఒక గిన్నెలో నీళ్లలో నానబెట్టి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇప్పుడు నీటిని వేరు చేసి, ఈ గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి, పేస్ట్ లాగా చేయడానికి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను జుట్టు మూలాల నుండి చివర్ల వరకు అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. అరగంట తర్వాత, సాధారణ నీటితో జుట్టును కడగాలి. ఆపై షాంపూతో కడగాలి.
మీ జుట్టు నిస్తేజంగా,పొడిగా కనిపిస్తే, చియా గింజలతో చేసిన ఈ హెయిర్ ప్యాక్ ఖచ్చితంగా సరిపోతుంది.ఇది బలహీనమైన, నిస్తేజమైన జుట్టుకు కొత్త జీవితాన్ని ఇస్తుంది.

హైడ్రేటింగ్ కోసం హెయిర్ మాస్క్:
కావలసినవి:
చియా విత్తనాలు- 4 టేబుల్ స్పూన్లు
అలోవెరా జెల్- 2 టేబుల్ స్పూన్లు
నీరు- తగినంత

తయారు చేసే పద్ధతి: ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో నీరు, చియా గింజలను వేసి రాత్రంతా ఉంచండి.
ఉదయం, ఈ మిశ్రమాన్ని సుమారు 10 నిమిషాల పాటు వేడి చేయండి. దీని తరువాత ఫిల్టర్ చేసి ఒక గిన్నెలో ఉంచి, అవసరాన్ని బట్టి అలోవెరా జెల్ వేసి కలపండి.
ఇప్పుడు సిద్ధం చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో వేయండి. తడి జుట్టు మీద ఈ హెయిర్ జెల్ ఉపయోగించండి. తలకు అప్లై చేసుకున్న తర్వాత సుమారు 20-30 నిమిషాలు అలాగే ఉంచి షాంపూతో వాష్ చేయాలి.

జుట్టు పెరుగుదలకు హెయిర్ మాస్క్:
కావలసినవి:
చియా విత్తనాలు- 1 టేబుల్ స్పూన్
ఆపిల్ సైడర్ వెనిగర్ – 1 టీ స్పూన్
కొబ్బరి నూనె- 4 టీస్పూన్లు
తేనె- 1 టీస్పూన్

Also Read: మీ జుట్టును ఒత్తుగా మార్చే.. బెస్ట్ హెయిర్ మాస్క్ ఇదే !

తయారు చేసే పద్ధతి: ముందుగా ఒక గిన్నెలోకాస్త నీరు, చియా గింజలు వేసి 30 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వీటిలో వెనిగర్, కొబ్బరి నూనె, తేనె కలిపి మిక్స్ చేయాలి. తర్వాత దీనిని జుట్టుపై అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత షాంపూతో వాష్ చేయండి. చియా విత్తనాలు వెంట్రుకల కుదుళ్లు, పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, వాటిని ఉపయోగించడం ద్వారా జుట్టు డ్యామేజ్‌ని కూడా తగ్గించుకోవచ్చు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×