తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss). ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైంది. ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. ఆరవ వారం ఎవరు ఊహించని విధంగా ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక ఎవరికివారు తమ ఆటతో ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేశారు. కానీ నలుగురు మాత్రం బ్యాచ్ గా ఏర్పడి తమ బ్యాచ్ లో తప్పు చేసినా సరే ఎదుటివారిని టార్గెట్ చేస్తూ అందరి దృష్టిలో పడ్డారు.
అదే కన్నడ బ్యాచ్ గా చెప్పుకుంటున్న యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ.. వీరు నలుగురు ఒకరికొకరు నామినేట్ చేసుకోకుండా తప్పు చేసినా సరే సరిదిద్దుకుంటూ మిగతా వారిని టార్గెట్ చేస్తూ.. నెగిటివిటీ మూటగట్టుకున్నారు. ఇక చాలామంది హౌస్ మేట్స్ వీరి వల్లే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక అందుకే ఇప్పుడు ఎక్స్ హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వడంతో ఒక్కొక్కరిగా కన్నడ బ్యాచ్ కి చుక్కలు చూపిస్తున్నారు. ఇక అందులో భాగంగానే 11వ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్న హౌస్ మేట్స్.. 12వ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పడంతో ఒక్కసారిగా భయపడిపోతున్నారు.
ఇదిలా ఉండగా 12వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగానే మొదటి నామినేషన్స్ లో భాగంగా సోనియా ఆకుల హౌస్ లోకి అడుగుపెట్టి ప్రేరణ, పృథ్వీ లను నామినేట్ చేసి వెళ్లిపోయింది. ఇక తర్వాత బెజవాడ బేబక్క, ఆర్ జె శేఖర్ భాషా కూడా హౌస్ లోకి అడుగుపెట్టి కన్నడ బ్యాచ్ ను టార్గెట్ చేస్తూ నామినేట్ చేశారు. ఇక ఈరోజు నైనిక, ఆదిత్య ఓం హౌస్ లోకి అడుగు పెట్టారు. నైనిక యష్మి, నబీల్ లను నామినేట్ చేయగా.. ఆదిత్య ఓం యష్మీ, ప్రేరణను నామినేట్ చేశారు. వీరిద్దరూ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని, దయచేసి ఇండివిజువల్ గా గేమ్ ఆడి కప్పు కోసం ట్రై చేయమని హింట్ ఇచ్చారు. మరి కన్నడ బ్యాచ్ వీరి సలహాలని తీసుకుంటారా? లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
ఇకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఆదిత్య, నైనిక ఇద్దరు కూడా సందడి చేశారు. ఇక వీరు కూడా కన్నడా బ్యాచ్ ను టార్గెట్ చేయడంతో ఎక్స్ హౌస్ మేట్స్ అంతా కూడా పనిగట్టుకొని మరీ కన్నడ బ్యాచ్ ని పంపించాలని ప్లాన్ చేశారా అన్నట్లు నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు టైటిల్ రేస్ లో నిఖిల్, గౌతమ్ పోటీ పడుతున్నారు. వీరిద్దరి మధ్య కూడా చాలా స్వల్ప తేడా కనిపిస్తోంది. మరి ఇద్దరిలో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలుస్తారో చూడాలి.