BigTV English

White Hair: హెన్నాలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జన్మలో తెల్లజుట్టు రాదు

White Hair: హెన్నాలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జన్మలో తెల్లజుట్టు రాదు

White Hair: ప్రస్తుతం తెల్లజుట్టు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. తెల్ల జుట్టు సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది బయట మార్కెట్‌‌లో దొరికే హెయిర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వీటిని రసాయనాలతో తయారు చేస్తుంటారు. అందువల్ల సైడ్ ఎపెక్ట్స్ కూడా వస్తుంటాయి. అందుకే నేచురల్ ప్రొడక్ట్స్ వాడటం మంచిది.


ముఖ్యంగా హెన్నా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీ జుట్టును నల్లగా మార్చడానికి మీరు ఎలాంటి రసాయన ఉత్పత్తులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. హెన్నాలో కొన్ని రకాల పదార్థాలు కలిపి జుట్టుకు వాడటం వల్ల మంచి మీ జుట్టు నల్లగా , ఒత్తుగా మారుతుంది.

నల్లటి జుట్టు సహజంగా: నెరిసిన జుట్టును దాచడానికి చాలా మంది జుట్టుకు హెన్నా అప్లై చేస్తుంటారు. ఎందుకంటే హెన్నా సహజంగా జుట్టుకు రంగు వేయడానికి ఉత్తమ మార్గం. ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా జుట్టుకు పోషణనిస్తుంది. అంతే కాకుండా జుట్టుకు హెన్నా కూడా హాని కలిగించదు. అదే సమయంలో.. ఈ హెన్నా అనేక జుట్టు సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.


హెయిర్ కేర్: హెయిర్ మెరిసేలా ,ఒత్తుగా ఉండేలా చేయడానికి ఈ హోంమేడ్ హెన్నా హెయిర్ మాస్క్‌ని ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన , మెరిసే జుట్టు కోసం ఈ ఇంట్లో తయారు చేసిన హెన్నా పౌడర్ హెయిర్ మాస్క్‌ని ప్రయత్నించండి. అయితే హెన్నాలో కొన్ని పదార్థాలను మిక్స్ చేసి జుట్టుకు రాసుకుంటే తెల్లజుట్టు నల్లగా, మెరిసేలా చేయడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతుందని మీకు తెలుసా. తెల్ల జుట్టును నేచురల్‌గా నల్లగా మార్చుకోవడానికి హెన్నాలో కొన్ని పదార్థాలను కలిపి మిక్స్ చేసి అప్లై చేయాలి. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఉసిరి, హెన్నా హెయిర్ ప్యాక్:
జుట్టుకు ఉసిరి పౌడర్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీని ద్వారా జుట్టు నల్లగా మారుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి జుట్టును సహజంగా నల్లగా మారుస్తుంది. ఉసిరి హెన్నాలో కలిపి కూడా ఉపయోగించవచ్చు. ఇది జుట్టు సహజంగా నల్లగా చేస్తుంది.

ఉసిరి పౌడర్ ఇలా వాడండి: 

హెన్నాతో వెంట్రుకలు నల్లబడాలంటే ముందుగా ఉసిరి పౌడర్ తీసుకుని జుట్టుకు కావాల్సినంత హెన్నా పౌడర్ ను తీసుకుని అందులో ఉసిరి పౌడర్ వేసి, తగినంత నీరు వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత హెన్నా పేస్ట్ సిద్ధం చేయండి. అనంతరం జుట్టుకు అప్లై చేసి ఆరనివ్వాలి. హెన్నా పూర్తిగా ఆరిపోయినప్పుడు షాంపూతో వాష్ చేయండి. ఇలా నెలకు రెండు సార్లు ఉపయోగిస్తే జుట్టు నల్లగా మారుతుంది. ఇలా చేస్తే.. ఎలాంటి హెయిర్ ప్రొడక్ట్స్ అవసరం లేదు.

Also Read: వీటిని వాడితే.. ఎంతటి తెల్ల జుట్టు అయినా క్షణాల్లోని నల్లగా మారడం ఖాయం

బ్రాహ్మీ పొడి:
ముందుగా ఒక గిన్నెలో హెన్నా పౌడర్ తీసుకోండి. ఇప్పుడు అందులో 2 స్పూన్ల బ్రహ్మీ పౌడర్ వేయాలి. తర్వాత అందులో నీళ్లు పోసి చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. దీని జుట్టుకు అప్లై చేయాలి. మీరు హెన్నాను అప్లై చేసినప్పుడు, జుట్టు జిడ్డుగా ఉండకూడదని గుర్తుంచుకోండి. ఇలా ఉంటే.. హెయిర్ నల్లగా మారడానికి సమయం పడుతుంది. దీని తర్వాత జుట్టును షాంపూతో కడగాలి. తరుచుగా ఇలా చేయడం వల్ల మీ జుట్టు సహజంగా నల్లగా మారుతుంది. ఇలా నెలకు రెండుసార్లు చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×