BigTV English

BB Telugu 8 Promo: ఆఖరి మెగా చీఫ్.. కంటెస్టెంట్స్ మధ్య అగ్గి రాజేసిన బిగ్ బాస్..!

BB Telugu 8 Promo: ఆఖరి మెగా చీఫ్.. కంటెస్టెంట్స్ మధ్య అగ్గి రాజేసిన బిగ్ బాస్..!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇకపోతే 11వ వారం ఫ్యామిలీ వీక్ పూర్తయింది. 12వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగిసింది.ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8 మాజీ కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగుపెట్టి, ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేసి, అందరిని ఆశ్చర్యపరిచారు.ముఖ్యంగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా కన్నడ బ్యాచ్ ను టార్గెట్ చేస్తూ.. నామినేట్ చేయడం జరిగింది . అలా ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వి, నబీల్ ఇలా ఐదు మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ నెలకొంది.


ఇదిలా ఉండగా తాజాగా 12వ వారం 80వ రోజుకు సంబంధించి ప్రోమో ని విడుదల చేశారు. ఇందులో సేవ్ ద టీచర్ట్ అనే చాలెంజ్ తో ఆఖరి మెగా చీఫ్ అయ్యే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. ఈ మేరకు ఒక ప్రోమోని విడుదల చేయగా.. అందులో కంటెస్టెంట్ మధ్య గొడవ తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ప్రోమోలో ఏముందని విషయానికి వస్తే..ఈ సీజన్ లో ఆఖరి మెగా చీఫ్ అయి, సెమీ ఫినాలే వీక్ లో మీ స్థానాన్ని పదిల పరుచుకునే సమయం ఆసన్నమైంది. ఇంట్లోకి ఒకరి పేరుతో ఒక టీ షర్ట్ వస్తుంది. ఎవరైతే తమ టీ షర్టుని ఎండ్ బజర్ వరకు సేవ్ చేసి దానిని బొమ్మకి ధరింప చేస్తారో వారు మెగా చీఫ్ పోటీదారులు అవుతారు. అంటూ టాస్క్ ప్రారంభించారు. అందులో భాగంగానే ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు చెబుతూ పైనుంచి విసిరేశారు బిగ్ బాస్.

ఆ టీషర్ట్ కోసం కంటెస్టెంట్స్ పెద్ద పోటీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ ఫిజికల్ టాక్స్ లో చాలామంది కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. కానీ ఇప్పటివరకు ఒక్కరు కూడా ఆ టీషర్టుని బొమ్మకు ధరించలేకపోయారు. ముఖ్యంగా ఒక్కొక్క పేరు పైన వచ్చే టీషర్టు ను చింపేశారు కూడా. టాస్క్ లో భాగంగా మొదట ప్రేరణ టీ షర్టు గార్డెన్ ఏరియాలోకి రావడంతో ప్రేరణ తన టీ షర్టును కాపాడుకునే ప్రయత్నం చేయగా.. నబీల్ , యష్మి దానిని చింపేశారు. ఇక తర్వాత గౌతమ్ టీ షర్టుని విసిరేశారు బిగ్ బాస్.. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరూ కూడా పోటీపడి మరీ గౌతమ్ టీ షర్ట్ ని చింపేశారు. నబీల్, యష్మీ టీషర్టు పట్టుకొని చింపేసే ప్రయత్నం చేయడం..మధ్యలో రోహిణి కాపాడే ప్రయత్నం చేసింది కానీ వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత పృథ్వీ టీ షర్టు వేశారు. ఇక యష్మి, విష్ణు ప్రియ గొడవపడ్డారు. విష్ణు ప్రియ సేవ్ చేయాలనుకుంది. కానీ ఆ తర్వాత దానిని చింపేశారు. కానీ యష్మీ, విష్ణు ప్రియ మధ్య గొడవ భారీగానే జరిగింది.


Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×