Olive Oil For Skin: శతాబ్దాలుగా ఆలివ్ ఆయిల్ ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. ఆహారంలో వాడటమే కాకుండా, చర్మానికి, జుట్టు సంరక్షణకు కూడా దీనిని ఉపయోగిస్తారు. ఆలివ్ ఆయిల్‌తో శరీరాన్ని మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా అవును, ఆలివ్ నూనెలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా కలిగిస్తుంది. ఆలివ్ ఆయిల్‌ను స్కిన్ కేర్‌లో భాగంగా చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలివ్ ఆయిల్ ప్రత్యేకతలు:
ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఇ, కె, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ చర్మానికి పోషణ అందించడంతో పాటు చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడతాయి.
ఆలివ్ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు:
1. చర్మానికి తేమను అందిస్తుంది- ఆలివ్ ఆయిల్ చర్మానికి లోతైన తేమను అందిస్తుంది.ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల చర్మం పొడిగా, నిర్జీవంగా మారకుండా ఉంటుంది. ఇది చలికాలంలో చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో చర్మం మరింత పొడిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆలివ్ ఆయిల్ వాడిడే చర్మం స్మూత్ గా మారుతుంది.
2. ముడుతలను తగ్గిస్తుంది- ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. అంతే కాకుండా ఇది ముడతలను తగ్గిస్తుంది. తరుచుగా ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
3. మంటను తగ్గిస్తుంది- ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది చర్మంపై మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
4. స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది – ఆలివ్ ఆయిల్‌తో రెగ్యులర్ మసాజ్ చేయడం వల్ల చర్మపు రంగు మెరుగుపడుతుంది. అంతే కాకుండా స్కిన్ పై ఉన్న మచ్చలు కూడా తగ్గుతాయి.
5. తామర, సోరియాసిస్- ఆలివ్ నూనె తామర, సోరియాసిస్ చర్మ వ్యాధులు ఉన్న వారు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండింటినీ తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
జుట్టు కోసం:
జుట్టును బలపరుస్తుంది- ఆలివ్ ఆయిల్ జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది- ఇది జుట్టుకు లోతుగా పోషణనిస్తుంది. జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది.
దురద , చుండ్రును తగ్గిస్తుంది- ఆలివ్ ఆయిల్ స్కాల్ప్ ను ఉపశమనం చేస్తుంది. అంతే కాకుండా చుండ్రును తగ్గిస్తుంది.
శరీరం కోసం:
కండరాలకు ఉపశమనాన్ని ఇస్తుంది- ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల కండరాలలో నొప్పి, అలసట తగ్గుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ప్రసరణను మెరుగుపరుస్తుంది- ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది రక్తపోటుకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది- ఈ ఆయిల్ మసాజ్ యొక్క రిలాక్సింగ్ ప్రభావం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: హెన్నాలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జన్మలో తెల్లజుట్టు రాదు
ఆలివ్ నూనెతో మసాజ్ చేయడం ఎలా ?
నూనెను వేడి చేయండి- ఆలివ్ నూనెను కాస్త వేడి చేయండి. తద్వారా ఇది చర్మంలోకి సులభంగా శోషించబడుతుంది.
మసాజ్ చేయండి- చేతులతో చర్మానికి మసాజ్ చేయండి.
కనీసం 15 నిమిషాలు మసాజ్ చేయండి – మెరుగైన ఫలితాల కోసం, కనీసం 15 నిమిషాలు మసాజ్ చేయండి.
వారానికి 2-3 సార్లు చేయండి – వారానికి 2-3 సార్లు ఈ ఆయిల్ వాడటం వల్ల మీకు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.