White Hair Tips: ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు రావడం సర్వసాధారణం అయిపోయింది. బయట కాలుష్యం, దుమ్మూ, సరైన పోషకాహారం తినకపోవడం ఇతర కారణాలు కావచ్చు. వీటివల్ల ప్రతి ఒక్కరు జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా తెల్లజుట్టు వస్తే వృద్ధప్యానికి సంకేతం అంటారు. కానీ ఇప్పుడు చిన్నతనంలోనే ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. తెల్ల జుట్టు అప్పుడే వచ్చేసిందన్న బాధ ఎక్కువగా ఉంటుంది.
దీంతోపాటు ప్రక్కవాళ్లు చూస్తే ఏమనుకుంటారో అని ఒక టెన్షన్. ఇక తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి బయట మార్కెట్లో రకరకాల ప్రొడక్ట్స్ కొంటారు. ఇవి రసాయనాలతో తయారుచేయబడినవి కనుక జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. మరికొంత మంతి జుట్టుకు ఎక్కువగా హెన్నా పెడుతుంటారు. దీని వాడకం శాస్వత పరిష్కారం కానప్పటికి కొంతకాలం తెల్లజుట్టు కనపడకుండా చేస్తుంది. అయితే చాలా మంది ప్రతిసారి హెన్నాపెట్టి విసుగిపోయుంటారు. అలాంటి వారి కోసం హెన్నాతో పనిలేకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చే నాచురల్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చాం.
తయారు చేసుకునే విధానం..
మీ తెల్ల జుట్టు నల్లగా కావాలంటే ఈ విధంగా చేయండి. ఒక ఉల్లి గడ్డ పొట్టు, ఒక వెల్లుల్లి పొట్టు తీసుకుని, స్టవ్ వెలిగించి కడాయిపెట్టి అందులో ఈ తొక్కలను వేసి బాగా నల్లగా వచ్చేంత వరకు వేగనివ్వండి. ఆ తర్వాత వీటిని మెత్తగా పొడిలాగా చేసుకోండి. ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టీ స్పూన్ ఆవాల నూనె వేసి బాగా మిక్స్ చేసి మీ జుట్టు కురులకు అప్లై చేయండి. గంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
కాఫీపొడితో తెల్ల జుట్టు నల్లగా మార్చండి..
కాపీపొడి హెన్నాకంటే బాగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక కప్పు కండీషనర్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ కాఫీపొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి.. అరగంట పాటు అలానే ఉంచండి. ఆ తర్వాత షాంపూని వాడకుండా జుట్టును మాత్రమే కడిగేయండి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
Also Read: నడుము వరకు పొడవాటి జుట్టు పెరగాలంటే.. కరివేపాకును ఇలా వాడండి
అలాగే దీంతో పాటు మరోవిధానం ఉంది. కాఫీ పొడిలో అలోవెర జెల్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. కాఫీపొడిలో ఉండే అనేక రకాల పోషకాలు జుట్టుకు తగినంత పోషణను అందిస్తాయి. అలాగే జుట్టు సిల్కీగా, మెరిసేలా చేస్తుంది కూడా.. కాఫీ పొడి జుట్టుకు మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి అద్భుతంగా పనిచేస్తుంది.
బ్లాక్ టీతో హెయిర్ మాస్క్
తెల్ల జుట్టు నల్లగా మార్చే బెస్ట్ హెయిర్ మాస్కుల్లో బ్లాక్ టీ ఒకటి. ఇది జుట్టుకు సహజమైన రంగును అందిస్తుంది.
వాడే పద్ధతి..
ముందుగా బ్లాక్ టీని నీటిలో మరిగించండి.. ఆతర్వాత చల్లార్చి జుట్టు కుదుళ్ళకు పట్టించి.. గంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు నల్లగా ఉండటంతో పాటు ఒత్తుగా పెరుగుతుంది కూడా.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.