BigTV English

BB Telugu 8: ఈవారం ఎలిమినేషన్.. తెలివిగా తప్పించుకున్న వైల్డ్ కార్డు.. అతనిపై వేటు..!

BB Telugu 8: ఈవారం ఎలిమినేషన్.. తెలివిగా తప్పించుకున్న వైల్డ్ కార్డు.. అతనిపై వేటు..!

BB Telugu 8.. బిగ్ బాస్(Bigg Boss)అంటేనే ట్విస్ట్ లు.. అటు ఆడియన్స్ కూడా ఊహించని సరికొత్త టాస్క్ లు, గేమ్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 8వ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇటీవలే 11వ వారం ఫ్యామిలీ వీక్ అంటూ పూర్తి కాగా.. 12వ వారం నామినేషన్ ప్రక్రియ అనూహ్యంగా ప్రారంభమై, అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, ప్రేక్షకులను మెప్పించలేక ఎలిమినేట్ అయిన.. ఎక్స్ కంటెస్టెంట్స్ ను మళ్లీ హౌస్ లోకి తీసుకొచ్చి, వారితో ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేసేలా చేసారు బిగ్ బాస్.


అయితే ఇలా వచ్చిన వారికి బిగ్ బాస్ కావాలనే టాస్క్ ఇచ్చారా? లేకపోతే వీరంతా కూడా మాట్లాడుకొని కన్నడ బ్యాచ్ ని టార్గెట్ చేశారా అనే విషయం తెలియదు కానీ.. ప్రతి ఒక్కరు కూడా కన్నడ బ్యాచ్ ని నామినేట్ చేయడం జరిగింది. అందులో నబీల్ మాత్రం తెలుగు బ్యాచ్ కావడం గమనార్హం. ఇక అలా ఈవారం నామినేషన్స్ లోపు నబీల్, యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ ఇలా ఐదు మంది నామినేషన్స్ లోకి వచ్చారు. ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ను ఒక్కరిని కూడా టచ్ చేయలేదు ఎక్స్ కంటెస్టెంట్స్. ఇకపోతే ఓటింగ్ విషయానికి వస్తే.. ప్రేరణ మొదటి స్థానంలో నిలవగా.. యష్మీ రెండవ స్థానంలో ఉంది. నబీల్ మూడవ స్థానంలో ఉండగా.. నాల్గవ స్థానంలో నిఖిల్, ఐదవ స్థానంలో పృథ్వీ కొనసాగుతున్నారు.

అయితే ఇక్కడ తెలివిగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. 12వ వారం నామినేషన్ లో భాగంగా ఓట్లు సరిగ్గా పడక లీస్టులో ఉన్నారు అవినాష్. దీంతో ఈవారం ఎలిమినేట్ అవుతారని దాదాపు అందరూ అనుకున్నారు. అన్నట్టుగానే ఆయన ఎలిమినేట్ అయ్యాడు. కానీ ఫ్యామిలీ వీక్ ను కాస్త ఎమోషనల్ చేయడానికి ఇష్టపడని బిగ్ బాస్.. నబీల్ దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని ఉపయోగించాలనుకున్నారు. బిగ్ బాస్ ప్లాన్ వర్కౌట్ అయింది. నబీల్ వెంటనే తన ఎవిక్షన్ పాస్ ను త్యాగం చేస్తూ.. అవినాష్ ను కాపాడాడు. అలా అవినాష్ ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.


అయితే ఇక ఇప్పుడు 12వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది. కచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఈ వారం ఎక్స్ హౌస్ మేట్స్ చేసిన నామినేషన్స్ కారణంగా మొత్తానికి నామినేషన్స్ లోకే రాలేదు అవినాష్. అలా రెండు వారాలు ఆయన నామినేషన్స్ నుంచి తప్పించుకొని సేవ్ అవడం అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న పృథ్వీ లీస్ట్ లో ఉన్నారు. మొత్తానికైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన అవినాష్ తెలివిగా తప్పించుకున్నారు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×