జగన్‌కు ఒక్క డీల్‌లో వచ్చిన డబ్బులతో ఏపీ ప్రజలకు ఎంత భారంగా మారతాయో? జగన్ ఆలోచించారా? షర్మిల ప్రశ్నించారు. సోలార్ పవర్ ఒప్పందాల్లో మాజీ సీఎం జగన్‌కు అదానీ లంచం 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారన్నారు APCC అధ్యక్షురాలు షర్మిల. లంచం కోసం జగన్ ఏపీ పరువు తీశారని.. జగన్ అవినీతిపరుడని అంతర్జాతీయంగా చర్చ జరుగుతోందన్నారు. అమెరికాలో అదానీ బండారం బయటపడటం దేశానికి, మోడీకి అవమానమన్నారు. దేశంలో విచారణ చేయిస్తారా? అమెరికాలో విచారణకు సహకరిస్తారా? ప్రధాని మోడీ తేల్చుకోవాలన్నారు.
Also Read: క్యా సీన్ హై.. పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స.. కారణం అదేనట!
అంతర్జాతీయ స్థాయిలో దేశ పరువు పోయిందని.. అదానీ దేశ పరువు తీస్తే .. జగన్ ఏపీ పరువు తీశారంటూ విమర్శలు గుప్పించారు. జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూఎస్ఎ గౌతమ్ అదానీపై అభియోగాలు చేసింది. గౌతం అదానీ టీం దేశంలో కొంత మంది సీఎం లకు లంచాలు ఇచ్చినట్టు తెలిపారు. ఇందులో ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు వెల్లడించారు. జగన్ పేరు చెప్పలేదు కాని ఆగస్టు 2021లో ముడుపులు ముట్టాయని తెలిపారు. పవర్ సప్లై లో ఏపీ సీఎంను గౌతం అదానీ జగన్‌ను కలిసి మీకు ఏమి కావాలో ఇస్తామని ప్రామిస్ చేశారు. ఏమి ఇస్తే.. ఏమీ అవుతుందనే డిస్కస్ జరిగినట్టు పేర్కొన్నారు.
తనపై బాలకృష్ణ నివాసం నుంచే దుష్ప్రచారం జరిగిందని జగన్ భావించి ఉంటే.. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు షర్మిల. తనపై ప్రేమ ఉన్నట్టు తన వీడియోను ప్లే చేసి చూపించారు జగన్. తను ఉపయోగపడుతుందంటే.. తండ్రిని, తల్లిని, చెల్లిని వాడుకుంటారని తీవ్రంగా మండిపడ్డారు. మీ సైతాన్ సైన్యంతో నాకు ప్రభాస్‌కు సంబంధం అంటగట్టింది. వాస్తవం కాదా? అని జగన్‌ను ప్రశ్నించారు షర్మిల.
జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మ పై కేసు పెడతారు.. నాన్న పేరు సీబీఐ చార్జి షీట్ లో పెడతారు చెల్లి పై దుష్ప్రచారం చేయిస్తారని మండిపడ్డారు. అదానీపై జేపిసి వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు వైఎస్ షర్మిల. రేవంత్.. అదానీ నీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. ఒక సహచరిగా రేవంత్‌కు విజ్ఞప్తి చేస్తున్న.. అదానీ తో బిజినెస్ చేయొద్దని షర్మిల కోరారు. నేను జగన్మోహన్ రెడ్డినీ ఎత్తి చూపకపోతే నా ఆస్తి నాకు ఇస్తానని అంటున్నారు. కానీ నేను మాట్లాడకుండా ఉండలేను. నేను కాంగ్రెస్ పార్టీ చీఫ్ .. ఇలాంటివి నేను మాట్లాడుకుంటే ఎలా? అంటూ షర్మిలా ఘాటుగా స్పందించారు.