Yashmi Gowda: ఒకప్పుడు బుల్లితెర సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయింది కన్నడ బ్యూటీ యష్మీ గౌడ (Yashmi Gowda). ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగు పెట్టింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మొదటి నుంచి హౌస్ లో తన ఆట తీరుతో అందరిని మెప్పిస్తోంది. బిగ్ బాస్ కి ముందు సీరియల్స్ వరకే పరిమితమైన ఈమె బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అందరిలో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. టైటిల్ ఫేవరెట్ గా దూసుకుపోతున్న యష్మీ గౌడ ఇండస్ట్రీ లోకి రాకముందు మోడలింగ్ చేస్తూ కెరియర్ మొదలుపెట్టి, కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడే తన ఫ్రెండ్ తో కలిసి ఆడిషన్ కి వెళ్ళిందట.
తెలుగు సీరియల్స్ తో భారీ గుర్తింపు..
అలా ‘విద్యా వినాయక’ అనే సీరియల్ లో అవకాశం అందుకుంది.2017 లో ఇదే సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి తన నటనతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించింది. అలా తెలుగులో ‘నాగభైరవి’, ‘స్వాతి చినుకులు’, ‘త్రినయిని’, ‘కృష్ణా ముకుందా మురారి’ వంటి సీరియల్స్ చేసింది. ఇక ‘స్వాతి చినుకులు’ సీరియల్ ఈమెకు భారీ పాపులారిటీ అందించింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈమె హౌస్ లోకి రాకముందు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన బ్రేకప్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
యష్మి గౌడ బ్రేకప్ స్టోరీ..
యష్మీ గౌడ మాట్లాడుతూ.. ” నేను కూడా అందరి అమ్మాయిలు లాగే నేను కూడా ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. అతడు కూడా నన్ను ఇష్టపడ్డాడు. ఇద్దరం కలిసి మా ఆలోచనలను పంచుకునే వాళ్ళము. అయితే ఒకరోజు ఉన్నట్టుండి.. నా దగ్గరకు వచ్చి మనం ఇది ఆపేద్దాం. నువ్వు ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయివి కావడంతో నీతో పెళ్లి మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు అని అన్నాడు. అయితే అప్పటివరకు నేను ఇండస్ట్రీ అమ్మాయిని తెలిసి, నాతో ప్రేమలో ఉన్న ఆ వ్యక్తి సడన్గా ఇలాంటి రీసన్ చెప్పడం నాకు అర్థం కాలేదు. ఇక దీంతో నేను అతడి గురించి ఆలోచించడం మానేశాను అన్నింటినీ యాక్సెప్ట్ చేశాను. నన్ను వదిలించుకోవడానికి ఈ రీజన్ చెప్పాడు అనుకుని ఆ తర్వాత నుంచి అతడికి దూరంగా జరిగాను.
యష్మీ ధైర్యానికి నెటిజన్స్ ఫిదా..
అయితే నా బ్రేకప్ గురించి నేను ఏ రోజు కూడా భయపడలేదు. ఎందుకంటే వేరే వాళ్లకు ఇలా జరగకూడదు అని, నాకు ఇలాంటి అబ్బాయే ఉండాలని లేదు.మనసుకు నచ్చిన వాడు కనిపిస్తే ఆటోమేటిగ్గా ఆ లవ్ ఫీల్ వస్తుంది. ఇక నాకు కాబోయే భర్త ఎలాంటి వాడైనా పర్లేదు. కానీ అవమానించకుండా గౌరవంగా చూసుకుంటే చాలు” అంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చింది యష్మి గౌడ .సాధారణంగా లవ్లో బ్రేకప్ అయితే అటు అమ్మాయి లైనా , ఇటు అబ్బాయిలైనా ఎంత డిప్రెషన్ లోకి వెళ్లిపోతారో అందరికీ తెలుసు. కానీ యష్మీ మాత్రం ధైర్యంగా ముందడుగు వేయడం చూసి ఈమె ధైర్యానికి నెటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారు ఇప్పుడు తన ఆట తీరుతో అందరి మమన్ననలు పొందింది ఈ కన్నడ బ్యూటీ.