BigTV English

Bigg Boss8 Telugu : గౌతమ్ – నిఖిల్ గొడవను ఫుడ్ తో దూరం చేసిన చెఫ్.. సందడిగా ఫుడ్ ఎపిసోడ్..

Bigg Boss8 Telugu : గౌతమ్ – నిఖిల్ గొడవను ఫుడ్ తో దూరం చేసిన చెఫ్.. సందడిగా ఫుడ్ ఎపిసోడ్..

Bigg Boss8 Telugu : టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మరో వారంలో ఎండ్ కార్డు పడబోతుంది. ఈ వారం టాస్క్ లతో ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేందుకు బిగ్ బాస్ ఏదో ప్రయత్నం చేసాడు కానీ పెద్దగా వర్క్ అవుట్ అయినట్టు లేదు. ఈ వారం నామినేషన్స్ తీసేసాడు. అందరినీ నామినేట్ చేశారు బిగ్ బాస్. బుధవారం ఎపిసోడ్లో ఇచ్చిన టాస్కులు జనాలకు పెద్దగా అర్థం కాలేదు కానీ చెఫ్ సంజయ్ వచ్చిన తర్వాత ఆ ఎపిసోడ్ రసవత్తరంగా మారిందని చెప్పాలి. అయితే మొదటగా క్రాస్ పాత్ టాస్క్ తో ఎపిసోడ్ మొదలవుతుంది. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఓట్ అప్పీల్ చేసుకునేందుకు హౌస్‌మేట్స్‌కి టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న టాస్కుల్లో గెలిచి ప్రేరణ ఓట్ అప్పీల్ చేసుకుంది. ఇక ఈరోజు పెట్టిన టాస్కుల్లో నబీల్ అద్భుతంగా ఆడాడు. కానీ సంచాలక్‌గా ఉన్న ప్రేరణ కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు నబీల్ ఆటలో మిస్టేక్స్ వెతుకుతూ తప్పించే ప్రయత్నం చేసింది.. మొత్తానికి పంతం నెగ్గించుకుంది.


ఇక మొత్తానికి ఆ టాస్క్ లో రచ్చ చేసి ప్రేరణ గెలుస్తుంది. ఓట్ అప్పీల్ చేసుకోవడానికి ‘టర్ఫ్ వార్’ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో అవినాష్ సంచాలక్‌గా ఉండగా మిగిలిన సభ్యులు ఆడారు. ప్రతి రౌండ్‌లో కోర్టు నుంచి ఎవరైతే ముందుగా బయటికొస్తారో ఆ సభ్యుడు ఛాలెంజ్‌ నుంచి తప్పుకుంటాడు అంటూ రూల్స్ చెప్పాడు బిగ్‌బాస్. ఇక ఈ గేమ్ మొదులుకాగానే ప్రేరణన టార్గెట్ చేసి నబీల్-రోహిణి బయటికి తోసేశారు. ప్రేరణ ఔట్ కాగానే నిఖిల్.. గౌతమ్‌ని టార్గెట్ చేసి బయటికి నెట్టబోయాడు. గౌతమ్ ను నిఖిల్ మొత్తానికి బయటకు తోసేసి గెలుస్తాడు. ఆ టాస్క్ లో మొత్తానికి నబీల్, విష్ణు ప్రియా లు గెలుస్తారు.

ఈ ఎపిసోడ్ లో చివరకు గెస్టుగా వరల్డ్ చెఫ్ సంజయ్ వస్తారు. పలు టీవీ ఛానల్స్, యూట్యూబ్‌లో కూడా ఆయన వంట ప్రోగ్రామ్స్ చేసి ఫేమస్ అయ్యారు. ఆయన్ను చూడగానే ఆహా ఈరోజు రుచిగా తినొచ్చు అంటూ తెగ గెంతులేశారు హౌస్‌మేట్స్. మంచి ఫుడ్ మీ చేత వండించాలని ఈరోజు వచ్చేశా అంటూ సంజయ్ అనగానే వావ్ థాంక్యూ వీళ్లు వడ్డింది తినలేక చస్తున్నాం.. అంటూ డైలాగ్ కొట్టింది.. ఇక హౌస్‌మేట్స్‌తో వంట చేయిస్తూ ఫుడ్ గొప్పతనం గురించి సంజయ్ చెప్పారు. ప్రపంచంలో ఏ వస్తువయినా సరే మంటల్లో వేస్తే కాలిబూడిద అయిపోతుంది.. కానీ కేవలం బంగారం, ఆహారం మాత్రమే అద్భుతంగా బయటికొస్తుంది అంటూ చెప్పారు. ఇక మొన్నటి ఎపిసోడ్‌లో గొడవపడిన నిఖిల్-గౌతమ్ ఇద్దరిని ఫుడ్‌తో కలిపేశారు సంజయ్. వీళ్ల మధ్య మొన్న రేగిన మంటను తియ్యగా చేసేద్దామంటూ గౌతమ్-నిఖిల్ చేత ఒకరికి ఒకరు తినిపించుకునేలా చేశారు సంజయ్.. ఇద్దరి మధ్య గొడవలు మొత్తానికి పోయాయని తెలుస్తున్నాయి. ఇక ఈ వారం విచిత్ర టాస్క్ లు అయితే ఉంటాయని అర్థమైంది. ఇక గురువారం టాస్క్ లు ఎలా ఉంటాయో చూడాలి.. విన్నర్ గౌతమ్ అని జనాలు ఫిక్స్ అయ్యారు.


Tags

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×