BigTV English

Hot Rice: వేడి వేడి తాజా అన్నం కంటే.. చల్లారిన అన్నమే ఆరోగ్యకరమా? అదెలా?

Hot Rice: వేడి వేడి తాజా అన్నం కంటే.. చల్లారిన అన్నమే ఆరోగ్యకరమా? అదెలా?

ఎవరైనా తాజాగా వండిన అన్నమే తినడానికి ఇష్టపడతారు. ఉదయం వండిన చల్లని అన్నం రాత్రికి తినేందుకు ఇష్టపడరు. కానీ అలా తినడమే ఆరోగ్యమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లకు తాజాగా వండిన అన్నం కంటే… పాత అన్నం అంటే రాత్రి వండిన అన్నాన్ని ఉదయం తినడం అనేది ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. తాజాగా వండిన అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుందని, అదే చల్లారిన అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా వరకు తగ్గిపోతుందని చెబుతున్నారు. అలాంటి మిగిలిపోయిన అన్నాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగవని వివరిస్తున్నారు డైటీషియన్లు.


రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టడం లేదా దాన్ని మళ్ళీ వేడి చేసి తినడమో వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా వరకు పడిపోతుంది. కాబట్టి ఉదయం వండిన అన్నాన్ని రాత్రి తినేందుకు ప్రయత్నించండి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉంటుంది కాబట్టి అమాంతం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అన్నం తినాలన్న కోరిక కూడా పెరుగుతుంది. ఎంతోమంది మధుమేహ రోగులు అన్నం తినాలని అనిపించినా కూడా ఆ కోరికను చంపుకొని చపాతీ తింటూ ఉంటారు. అలాంటివారు ఇలా మిగిలిపోయిన అన్నాన్ని అప్పుడప్పుడు తింటూ ఉంటే సమస్య ఉండదు. ముఖ్యంగా చలికాలంలో అన్నం త్వరగా పాడవదు. రాత్రి వండింది ఉదయం వరకు తాజాగానే ఉంటుంది. అలాగే ఉదయం వండినది రాత్రికి కూడా తినడానికి వీలుగానే ఉంటుంది. కాబట్టి చలికాలంలో ఇలా అన్నాన్ని వండి… ఏడు నుంచి ఎనిమిది గంటల తర్వాత తినేందుకు ప్రయత్నించండి.

పాత (చల్లారిన) అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ ప్రతిస్పందన కూడా మెరుగుపడుతుంది. పొట్టలోని గట్ మైక్రోబయోమ్ కు కావాల్సిన బలం లభిస్తుంది.


అన్నం వండిన తర్వాత కొన్ని గంటల పాటు పక్కన పెట్టేయండి. తర్వాత దాన్ని కొన్ని రకాల కూరగాయలు, టమోటాలు వంటి వాటితో ఫ్రైడ్ రైస్‌లాగా మార్చుకొని తినండి. ఇలా వండితే టేస్టీగా ఉంటుంది. అలాగే ఎగ్ రైస్‌గా కూడా చేసుకోవచ్చు. దాంతోనే లెమన్ రైస్ వంటివి చేస్తే రుచికరంగా ఉంటాయి. నువ్వుల అన్నాన్ని కూడా ప్రయత్నించవచ్చు. నువ్వులు తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే చికెన్ కూర రెడీగా ఉంటే ఈ పాత అన్నంతో చికెన్ ఫ్రైడ్ రైస్ ను చేసుకోవచ్చు. ఇలా తినడం వల్ల ప్రోటీన్లు, ఫైబర్ వంటివి కూడా శరీరంలో చేరుతాయి.

అన్నం వండిన తర్వాత దాన్ని అతిగా మాత్రం వేడి చేయవద్దు. అలాగే నీరు కలపడం వంటివి కూడా చేయవద్దు. వీలైనంతవరకు ఆవిరి పద్ధతిలో వేడి చేయడం ఉత్తమం. అంటే స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి నీళ్ళు పోయాలి. ఆ నీళ్లు వేడెక్కాక అన్నం గిన్నెను దించి పైన మూత పెట్టాలి. అప్పుడు ఆవిరిలో అన్నం కొంచెం వేడెక్కుతుంది. అప్పుడు ఆ అన్నాన్ని తినేయాలి. చల్లని అన్నాన్ని ఇలా వేడి చేసుకుని తినడం వల్ల కూడా ఎలాంటి సమస్య ఉండదు. అన్నాన్ని ఆవిరి మీద వేడి చేస్తే ఎలాంటి హానికర సమ్మేళనాలు జనించవు.

Also Read: మీ కిచెన్‌లో ఉన్న ఈ 5 పదార్థాలు.. వ్యాధులకు కారణం అని మీకు తెలుసా ?

ఈ చల్లని అన్నంలో పెరుగు, ఉల్లిపాయలు వంటివి కలుపుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో మాత్రం ఇలా తినలేరు. కాబట్టి వేసవిలో ఇలా మిగిలిపోయిన అన్నంతో చద్దన్నంలా తినేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.

పూర్వకాలంలో మిగిలిపోయిన అన్నాన్ని తినేందుకు ఇష్టం చూపించేవారు. రాత్రిపూట అన్నాన్ని పుల్లని మజ్జిగలో వేసి ఉంచేవారు. ఉదయం ఆ అన్నాన్ని తినేవారు. ఇలా తినడం వల్ల అందులో ఆరోగ్యానికి మేలు చేసి బ్యాక్టీరియా ఉంటుందని వారు నమ్మకం. సైన్స్ కూడా ఆ విషయాన్ని నిర్ధారించింది. ఆ బ్యాక్టీరియాలో పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు ఉపకరిస్తాయని, గట్ మైక్రోబయామ్ సమతుల్యతను కాపాడతాయని చెబుతారు.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×