BigTV English

Bigg Boss: బిగ్ బాస్ కంటెస్టెంట్ కు జాక్ పాట్, లాటరీలో ఏకంగా రూ. 1.78 కోట్ల ఇళ్లు కొట్టేశాడుగా!

Bigg Boss: బిగ్ బాస్ కంటెస్టెంట్ కు జాక్ పాట్, లాటరీలో  ఏకంగా రూ. 1.78 కోట్ల ఇళ్లు కొట్టేశాడుగా!

Bigg Boss Shiv Thakare Wins Rs 1.78 Crore House: బిగ్ బాస్ 16 ఫేమ్ శివ్ థాకరేకు  దసరా పండుగ ముందే వచ్చింది. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (MHADA) 2024 లాటరీ విజేతగా నిలిచాడు. ఏకంగా రూ. 1.78 కోట్ల విలువైన ఇంటిని దక్కించుకున్నాడు.  పొవాయ్‌లో హై ఇన్‌కమ్ గ్రూప్ (HIG) కేటగిరీలో భాగంగా ఆయనకు అధికారులు ఇంటిని కేటాయించారు. అక్టోబర్ 8న MHADA విడుదల చేసిన లాటరీలో శివ్ థాకరేతో పాటు మరికొంత మంది మరాఠా సెలబ్రిటీలు కూడా  ఇళ్లను పొందారు.


1,030 ఇళ్లను అమ్మకానికి పెట్టిన  MHADA

MHADA ముంబైలోని నలు ప్రాంతాలలో నిర్మించిన 2,030 ఇళ్లను అమ్మకానికి పెట్టింది. వీటిలో ఆయా కేటగిరీలుగా ఇళ్లను విభజించి అమ్మకానికి ఉంచింది. ఒక్కో కేటగిరీలో ముగ్గురి చొప్పున లక్కీ డ్రా తీస్తామని అధికారులు వెల్లడించారు. హై ఇన్‌కమ్ గ్రూప్ (HIG) కేటగిరీలో చాలా మంది సెలబ్రిటీలు ఇళ్ల కొనుగోలుకు మొగ్గు చూపారు. వారిలో బిగ్ బాస్ కంటెస్టెంట్ శివ్ థాకరే, నటులు గౌతమి దేశ్‌పాండే, హాస్య జాత్రా, నిఖిల్ బానే, నటుడు గౌరవ్ మోర్ ఉన్నారు.  విక్రోలిలోని కన్నమ్వార్ నగర్‌లో నిఖిల్ ఇంటిని గెలుచుకున్నాడు. మరోవైపు గౌతమికి గోరేగావ్‌లో ఇంటిని కేటాయించారు. గోరేగావ్‌లో కేవలం రెండు ఇళ్ల కోసం దాదాపు 27 మంది సెలబ్రిటీలు అప్లై చేసుకున్నారు.


శివ్ థాకరే గురించి..

శివ్ ఠాకరే నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘రోడీస్ రైజింగ్’ లాంటి రియాలిటీ షోలలో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. బిగ్ బాస్ మరాఠీ రెండవ సీజన్‌ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన ఆయన, మంచి ఆటతీరుతో విజయం సాధించారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హోస్టుగా చేసిన హిందీ ‘బిగ్ బాస్’ 16 రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలిచారు. ఈ షోతో ఆయన బాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించారు. బిగ్ బాస్ షో తర్వాత 2023లో రోహిత్ శెట్టి హోస్ట్ చేసిన ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ 13లో పాల్గొన్నారు. మార్చి 2021లో శివ్ థాకరే  బి.రియల్ అనే డియోడరెంట్ బ్రాండ్‌ను ప్రారంభించారు. శివ్ థాకరే రియాలిటీ షో రోడీస్‌ లో పాల్గొనడానికి ముందు, శివ తన స్వస్థలమైన మహారాష్ట్రలోని అమరావతిలో కూలి పనులకు వెళ్లేవారు. ఆ తర్వాత పొద్దున్నే పలు ఇళ్లకు వెళ్లి న్యూస్ పేపర్లు, మిల్క్ ప్యాకెట్లు వేసేవారు. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 16లో పాల్గొన్న తర్వాత అతడు బాగా పాపులర్ అయ్యారు. ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటున్నారు. తాజాగా లాటరీలో ఆయన ఇల్లు దక్కించుకోవడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు.

Read Also: సీత దొంగతనం.. ఇంత సైలెంట్‌గా ఎలా చేసింది భయ్యా? మరి మెగా చీఫ్ ఏం చేస్తున్నాడో!

 

View this post on Instagram

 

Read Also: గోడ దూకి పారిపోయిన కంటెస్టెంట్.. పనిష్మెంట్ తప్పదా..?

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×