BigTV English

Iran Warns Gulf Countries: ‘ఇజ్రాయెల్ కు సాయం చేయొద్దు.. లేకపోతే’.. అరబ్బు దేశాలకు ఇరాన్ గట్టి వార్నింగ్

Iran Warns Gulf Countries: ‘ఇజ్రాయెల్ కు సాయం చేయొద్దు.. లేకపోతే’.. అరబ్బు దేశాలకు ఇరాన్ గట్టి వార్నింగ్

Iran Warns Gulf Countries| ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్దం వాతావరణం రోజురోజుకీ వేడెక్కిపోతోంది. ఈ యుద్దంలో అమెరికాకు అనుకూలంగా ఉండే అరబ్బు దేశాలకు ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. యుద్దం తీవ్ర రూపం దాల్చిన సమయంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన ఏ దేశమైనా ఉపేక్షించేది లేదని.. ఆ దేశంపైన కూడా దాడి చేస్తామని ఇరాన్ అధికారులు హెచ్చరించినట్లు అమెరికా వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురితమైంది.


ఇరాన్ పొరుగున పెట్రోలియం నిక్షేపాలు ఉన్న అరబ్బు దేశాలు అమెరికాతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇజ్రాయెల్ తో జరిగే యుద్ధంలో ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికా పోరాడుతుందనేందుకు ఎటువంటి అనుమానాలు లేవు. ఇప్పటికే ఇజ్రాయెల్ రక్షణ కోసం సముద్రంలో అమెరికా తన యుద్ధనౌకలను మోహరించింది. ఇంతకుముందు కూడా ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా, హౌతీ మిలిటెంట్లు క్షిపణులతో దాడి చేసినప్పుడు అమెరికా యుద్ధనౌకలు వాటిని కూల్చివేశాయి.

అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ తో యుద్ధానికి స్వయంగా ఇరాన్ రంగంలోకి దిగింది. ఇరాన్ వద్ద వేల సంఖ్యలో మిసైల్స్, డ్రోన్స్ ఉన్నాయి. పైగా అణబాంబులు కూడా దాదాపు రెడీ అయ్యాయని సమాచారం. వీటికి అదనంగా రష్యా నుంచి టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ ని ఇరాన్ దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. హమాస్, హిజ్బుల్లాతో పోరాడినంత సులభంగా ఇరాన్‌తో ఇజ్రాయెల్ పోరాడలేదు. అందుకే ఇజ్రాయెల్ కు అండగా అమెరికా రంగంలోకి దిగుతోంది.


Also Read: ఎడారిలో వరదలు.. ఒక్కరోజులో 100mm భారీ వర్షంతో రికార్డ్!

ఇరాన్ ఇటీవల ఇజ్రాయెల్ (Israel) పై దాదాపు 200 బాలిస్టిక్ మిసైల్స్ తో దాడి చేసింది. వీటిలో చాలా వరకు టార్గెట్ ని ఢీకొట్టాయని ఇరాన్ సైన్యాధికారులు తెలిపారు. ఈ చర్యలతో ఇరాన్ పై అమెరికా కన్నెర్ర చేసింది. ఇరాన్ కు ముఖ్య ఆదాయం వనురులైన అయిల్ కంపెనీలపై ఆంక్షలు విధించింది. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఇరాన్ అణు స్థావరాలపై దాడుల చేయాలని చర్చలు జరుగుతున్నాయి.

ఇదంతా జరుగుతుండగా.. ఇరాన్ పొరుగుదేశాలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, యుఎఈ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల నుంచి ఇరాన్ పై దాడులు జరిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ కు ఇదే అతిపెద్ద ప్రమాదం. ఇదే జరిగితే ఇరాన్ కూడా తిరిగి తన పొరుగుదేశాలపై ఎదురుదాడి చేయాల్సివస్తుందని ఇరాన్ సైన్యాధికారులు తమ దౌత్య కార్యాలయాల ద్వారా అన్ని అరబ్బు దేశాలకు హెచ్చరించినట్లు సమాచారం.

ఇప్పటివరకు ఒక్క జోర్డాన్ దేశం మాత్రమే ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ క్షిపణులను కూల్చేసింది. మరే ఇతర అరబ్బు దేశం ఇరాన్ కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ యద్ధంలో ఎటువంటి చర్యలకు పాల్పడలేదు. సౌదీ అరేబియా, యుఎఈ, బహ్రెయిన్ లాంటి దేశాల ప్రభుత్వాలు, పాలకులు ఇజ్రాయెల్ తో యుద్ధంలో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదు. అందుకోసమే ఒక వేళ యుద్ధంలో ఇరాన్ పై దాడి చేయడానికి ఒకవేళ అమెరికా తమ దేశ భూభాగాన్ని ఉపయోగించాలిన భావిస్తే.. అందుకు తాము అంగీకరించమని ఇప్పటికే తెలిపాయి. అయితే అమెరికా అరబ్బు దేశాల పాలకులతో ఏకీభవిస్తుందా? లేదా? అనేదే ఇప్పుడు కీలకంగా మారింది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×