E-Paper
Advertisement

BiggBoss: గోడ దూకి పారిపోయిన కంటెస్టెంట్.. పనిష్మెంట్ తప్పదా..?

BiggBoss: గోడ దూకి పారిపోయిన కంటెస్టెంట్.. పనిష్మెంట్ తప్పదా..?
Advertisement

BiggBoss.. టైటిల్ చూడగానే ఏంటి? నిజమా..? అని ఆశ్చర్యపోయారు కదా… బిగ్ బాస్ పెట్టే టార్చర్ భరించలేక గోడదూకి వెళ్లిపోయారా..? ఇంతకు అబ్బాయా..? అమ్మాయా.. ? ఎవరా కంటెస్టెంట్.. అసలు ఎందుకు గోడ దూకి వెళ్ళిపోయారు..? మరి హౌస్ లోకి వచ్చే ముందు రూల్స్ చదవలేదా.. ?మరి గోడ దూకి వెళ్లిపోయారు కదా..? బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తాడా..? ఇలా ఎన్నో ప్రశ్నలు మీలో తలెత్తుతున్నాయి కదా.. మరి అసలు విషయం ఏమిటో..? ఇప్పుడు చూద్దాం..

కంటెస్టెంట్స్ కి నరకంగా మారిన హౌస్..

Advertisement

బిగ్ బాస్ రియాల్టీ షో ఎవరికైనా సరే ఒక పెద్ద పరీక్ష అని చెప్పాలి. జీవితంలో జరిగిన సంఘటనలు మొత్తం కేవలం హౌస్ లో ఉన్న ఆ మూడు నెలల్లోనే అనుభవించాల్సి ఉంటుంది. ఒక్కసారి అలాంటి సంఘటనలు మనకు ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. చూసే ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ లభిస్తున్నా.. హౌస్ లోపల కూర్చున్న వారికి మాత్రం దూల తీరిపోతుంది అనడంలో సందేహం లేదు. ఆహారం సరిగా ఉండదు.. నిద్రలేస్తే ఒకరికొకరు ఒకరు చూసుకోవాలి. ఎవరితో అయినా గొడవపడితే మాట్లాడడానికి చాలా సమయం పడుతుంది. కానీ హౌస్ లో ఇష్టం వచ్చినట్టు అరుచుకోవడం, కూర్చోవడం లాంటివి చేసిన మళ్లీ కొద్దిసేపటికి పక్కన కూర్చొని మాట్లాడాల్సిందే. కలిసి గేమ్ ఆడాల్సిందే. ఈ ప్రక్రియలో సదరు కంటెస్టెంట్ అనుభవించే మానసిక వేదన ఏ విధంగా ఉంటుందో చెప్పడం అసాధ్యం. ముఖ్యంగా హౌస్ లో ఉన్నన్ని రోజులు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. టీవీ ఉండదు.. ఫోన్ ఉండదు.. బోర్ కొట్టినప్పుడు తట్టుకోవాల్సిందే. ఇంటి వాళ్ళు గుర్తొచ్చినా.. మన అనే వాళ్ళు పక్కన లేకపోయినా.. ఆ నరకం ఎలా ఉంటుందో.. హౌస్ లో గడుపుతున్న కంటెస్టెంట్స్ కి మాత్రమే అర్థమవుతుంది.

భరించలేక హౌస్ నుంచి వచ్చేసిన కంటెస్టెంట్స్..

Advertisement

దీనికి తోడు నిద్రపోవడానికి కూడా అనుమతి ఉండదు. కఠినమైన టాస్కులు పెడతారు.. వాటిని ఆడేందుకు ఫిజికల్ గా బలంగా ఉండాలి. అయితే కడుపు నిండితేనే కదా ఆడడానికి బలం వస్తుంది. తినడానికి సరిగా తిండి లభించదు. దీంతో టాస్క్ ఆడే క్రమంలో క్రిందకు పడిపోతారు. కొంతమందికి గాయాలు కూడా అవుతాయి. అయినా సరే హౌస్ లో ఉండాల్సిందే. ఎందుకంటే అగ్రిమెంట్ అలాంటిది మరి. అయితే ఇదంతా పక్కన పెడితే కొంతమంది కంటెస్టెంట్ ఇలాంటివి తట్టుకోలేక నాగార్జునను బిగ్ బాస్ ను బ్రతిమిలాడి బయటకు వెళ్లిపోతారు. గతంలో సంపూర్ణేష్ బాబు , గంగవ్వ కూడా అలా వెళ్లిపోయిన వారే. అయితే ఇప్పుడు మాత్రం ఇలాంటి ఏ పర్మిషన్లు లేకుండా ఒక వ్యక్తి ఏకంగా గోడ దూకి వెళ్లిపోయారు.

గోడ దూకి పారిపోయిన కంటెస్టెంట్..

అయితే ఇది తెలుగు సీజన్లో కాదు లెండి.. హిందీలో ప్రసారమవుతున్న సీజన్ 18 లో.. ఇటీవలే భారీ అంచనాల మధ్య ప్రారంభమైన ఈ షో లో జరిగే ఒత్తిడి తట్టుకోలేక గోడ దూకి స్టూడియో నుండి బయటకు పారిపోయాడు కుషాల్ టాండన్. గోడకి చుట్టి ఉన్న ఫెన్సింగ్ వైర్లను కూడా దాటుకుంటూ వెళ్లిపోయాడు. నిజానికి బిగ్ బాస్ అగ్రిమెంట్ ప్రకారం ఇలాంటివి చేస్తే రూ .25లక్షలు ఫైన్ చెల్లించాలని బిగ్ బాస్ ఒప్పంద పత్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది. వాటి మీద సంతకం చేసిన తర్వాతనే వారు హౌస్ లోకి అడుగు పెడతారు. కానీ ఇతడు మాత్రం అలాంటివి పాటించకుండా హాస్టల్ గోడ దూకినట్టు దూకి వెళ్లిపోయాడు. మరి వీకెండ్స్ లో సల్మాన్ ఖాన్ పనిష్మెంట్ ఇస్తారేమో చూడాలి.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×