Bigg Boss 8 Day 30 Promo 1 : బిగ్ బాస్ 8వ సీజన్ లో భాగంగా ఐదవ వారం మొదలయ్యింది. అప్పుడే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. కంటెస్టెంట్ లు ఒకరి మీద ఒకరు నిప్పులు చెరుగుతూ సంచలనం సృష్టించారు. కంటెస్టెంట్ల మధ్య నామినేషన్ పోరు ఏ రేంజ్ లో భగ్గుమనిందో అందరికీ తెలిసిందే. ఇకపోతే నామినేషన్ ప్రక్రియ పూర్తవగానే అప్పుడే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లో మళ్ళీ కంటెస్టెంట్స్ ముందుకు వచ్చారు బిగ్ బాస్. అందులో భాగంగానే ఐదవ వారంలో.. 30 వ ఎపిసోడ్ కి సంబంధించిన తాజా ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమో గురించి ఇప్పుడు చూద్దాం.
తాళం విడిపించు టైర్ ని నడిపించు..
సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లో భాగంగా మరో కొత్త ఛాలెంజ్ తో కంటెస్టెంట్స్ ముందుకు వచ్చాడు బిగ్ బాస్. బిగ్బాస్ మాట్లాడుతూ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు బిగ్ బాస్ మీకు ఇస్తున్న మొదటి ఛాలెంజ్..” తాళం విడిపించు టైర్ ని నడిపించు”. ఈ చాలెంజ్ గెలవడానికి మీరు చేయవలసిందల్లా ఐదు టైర్లను తీసుకెళ్లి, స్లాట్ లో వేయాలి. ఇక పూల్ లో ఉన్న టైర్లను తీసుకెళ్లి స్లాట్లో వేయాల్సి ఉంటుంది. ఇక మొదటి ఛాలెంజ్ లో భాగంగా నిఖిల్ మరియు విష్ణు ప్రియ వచ్చేశారు. అయితే నిఖిల్ స్ట్రాటజీ ఉపయోగించినప్పటికీ చాలెంజ్ లో గెలవలేకపోవడం గమనార్హం. మొత్తానికైతే టైం అవ్వడంతో ఇద్దరూ కాస్త ఓడిపోయారు. దీంతో ఛాలెంజ్ ఓడిపోయి వైల్డ్ కార్డు ఎంట్రీకి అవకాశం ఇచ్చారు అని తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలివితేటలకు నబీల్ ఫిదా..
ఇక తర్వాత ఛాలెంజ్ ఓడిపోవడంతో నబీల్ , ఆదిత్య, యష్మీ, విష్ణు ప్రియ ఒకచోట కూర్చుని గేమ్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా.. మధ్యలో నబీల్ మాట్లాడుతూ.. మేము ఇలా చదువుదామని చెప్పి మొత్తం బ్లాక్ పెయింట్ వేశారు అంటూ విష్ణుప్రియ చెబుతుంది. దీనికి నబీల్ మాట్లాడుతూ.. నేమ్స్ రాసి పెడతారా వాళ్ళు.. అంత ఈజీ టాస్కా.. ఓ అని అక్కడికెళ్ళి పేరు చదివి, పేరు తీసుకోమా మనం.. వాళ్ళు చాలా తెలివైన వాళ్లు.. కనిపించిందా నీకు ఏమైనా బ్లాక్ పెయింట్ లో నుంచి అంటూ ప్రశ్నించాడు నబీల్.. కనిపించింది కానీ అక్కడ ఏం లేదు అంటూ వైల్డ్ కార్డు ఎంట్రీ బోర్డులపై ఉన్న పేర్ల గురించి చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ.
12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నిజమేనా..
ఇక తర్వాత నిఖిల్ – మణికంఠ ఒక రూమ్ లో డిస్కషన్ పెట్టారు. ఇప్పుడు మనం చాలెంజ్ ఓడిపోయాము మొత్తానికి అయితే 12 మందికి 12 మంది దిగిపోతారు చూడు అంటూ మణికంఠ చెప్పేశారు. మరి మణికంఠ చెప్పినట్టు 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ హౌస్ లోకి అడుగు పెడతారా లేదా చూడాలి. అసలు మరి ఈ కాన్సెప్ట్ జనాలకు ఎక్కుతోందా లేదా అనే వాదన కూడా తెరపైకి వస్తూ ఉండడం గమనార్హం.