BigTV English

Nerella Sharada: మహిళా కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు, ఆపై ఆగ్రహం..

Nerella Sharada: మహిళా కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు, ఆపై ఆగ్రహం..

Nerella Sharada: రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద. గడిచిన కొన్నేళ్లుగా మహిళా కళాశాల విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించారు. వారానికి ఒకటీ రెండు మహిళా కాలేజీలను సందర్శిస్తున్నారామె.


లేటెస్ట్‌గా మాదాపూర్‌లోని శ్రీచైతన్య మహిళా కాలేజీని ఆకస్మిక తనిఖీ చేశారు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. నేరుగా కాలేజీకి వెళ్లారు ఛైర్మన్. విద్యార్థుల తరగతుల గదికి వెళ్లారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థుల వసతిని పరిశీలించారు.

కాలేజీ హాస్టల్, మెస్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ పరిశుభ్రత లేకపోవడంతో ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో సౌకర్యాలు సరిగా లేవని, నాసిరకమైన ఆహారం పెడుతున్నారని యాజమాన్యం పై నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఏమైనా సమస్యలున్నా, యాజమాన్యం ఇబ్బంది పెట్టినా తమని సంప్రదించవచ్చని విద్యార్థులకు మహిళా కమిషన్ ఛైర్మన్ భరోసా ఇచ్చారు. గతవారం నిర్మల్ జిల్లా కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారామె. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. రిజిస్టర్లలను తనిఖీలు చేసి ఎంతమంది విద్యార్థులున్నారని ఆరా తీశారు. సమస్యలను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు ఛైర్మన్ నేరెళ్ల శారద.

 

Related News

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Big Stories

×